Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలు

అనుమానితుడు కూడా ఉగ్రవాదే..

యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • అనుకూలంగా 147, వ్యతిరేఖంగా 42ఓట్లు
  • వీగిపోయిన స్థాయీ కమిటీకి పంపామన్న విపక్షాల డిమాండ్‌
  • బిల్లుపై వాడివేడిగా సాగిన చర్చ

న్యూఢిల్లీ

చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) సవరణ బిల్లు (యుఏపీఏ)కు శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై సభలో చర్చ అనంతరం డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ను చైర్మన్‌ వెంకయ్యనాయుడు నిర్వహించారు. సవరణ బిల్లుకు అనుకూలంగా 147ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. దీంతో రాజ్యసభలో బిల్లు నెగ్గింది. యూఏపీఏ సవరణ బిల్లును స్థాయీ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్‌ వీగిపోయింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 104 మందిసభ్యులు, అనుకూలంగా 85 మంది సభ్యులు ఓటు వేశారు. ఇదిలా ఉంటే అంతకుముందు దీనిపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ నేత పి.చిందబరం మాట్లాడుతూ.. మామూలు వ్యక్తులనుసైతం ఉగ్రవాదులుగా ప్రభుత్వం ముద్రవేసేందుకు బిల్లు వీలు కల్పిస్తుందని, ఇది సరికాదని అన్నారు. సవరణలకు మీరు కారణాలు చెబుతూ చెబుతూ.. ఎన్‌ఏఐకు అధికారులు పెరుగుతాయంటారు. ఆమోదం లభించిన తర్వాత వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనడం, లేదా తొలగించే హక్కు కేంద్రానికి ఉందంటారు. ఈ భిన్న ధోరణి వల్లే మేము ఈ సవరణను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అంతేకానీ, మేము యూపీఏపీకి వ్యతిరేకం కాదుని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ¬ం మంత్రి అమిత్‌షా.. తాను సవరణ మాత్రమే తెస్తున్నానని, చట్టాన్ని తీసుకురావడం లేదన్నారు. సంస్కరణలను ఏ విధంగా చేస్తామో అలాగే ఉగ్రవాదుల విషయంలో మరో ముందడుగు మాత్రమే తాము వేస్తున్నామని అన్నారు. గత సవర్ణలన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే తీసుకున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. నేడు అటువైపు (విపక్షం వైపు) ఉన్నంత మాత్రాన వైఖరి మారిపోతుందా..? ఎందుకలా అంటూ కాంగ్రెస్‌ నేతలను అమిత్‌షా నిలదీశారు. కాగా, ఈ బిల్లు కింద ఏ రాష్ట్రంలోనైనా, ఎవరినైనా ఎన్‌ఐఏ అరెస్టు చేయవచ్చని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ చర్చలో పాల్గొంటూ ఆందోళన వ్యక్తంచేశారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎంపీ మాట్లాడుతూ, చట్టాన్ని దుర్వినియోగం చేయమని ప్రభుత్వ, ¬ం శాఖ హామీ ఇవ్వాలని కోరారు. టెర్రరిస్టు అంటే టెర్రరిస్టేనని, చిన్నచిన్న సవరణలకు తాము వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి యూఏపీఏ బిల్లుకు మద్దతు తెలిపారు. టెర్రరిస్టు రహతి దేశంగా భారత్‌ను మార్చాలన్న ¬ం మంత్రి విజన్‌కు తమ పార్టీ మద్దతిస్తోందని విజయసాయిరెడ్డి తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close