ముగిసిన ఆరో విడత పోలింగ్‌

0

  • పశ్చిమ బెంగాల్‌లో 80 శాతం!
  • 59 నియోజకవర్గాలల్లో 51 శాతం

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో ఆరురాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్లో4 గంటల వరకు 71.55 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని 8 నియోజకవర్గాలపరిధిలో 69 శాతానికి పైగా ఓటింగ్‌ జరిగింది. తమ్‌లుక్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 73.58 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌ పుల్‌పూరాలో అత్యల్పంగా 36 శాతం పోలింగ్‌ జరిగింది. జార్ఖండ్‌, మధ్య ప్రదేశ్‌, హర్యానాల్లో 50 శాతం పైగా పోలింగ్‌ నమోదైంది. అయితే, ఢిల్లీలో ఆశించిన స్ధాయిలో ఓటింగ్‌ నమోదుకాలేదు. 4 గంటల వరకు 45.25 శాతం మాత్రమే ఓటింగ్‌ జరిగినట్లు తెలిసింది. ఉత్తర ప్రదేశ్‌లో 43.28, బీహార్‌లో 44.58 శాత, జార్ఖండ్‌లో 60 శాతానికి చేరువలో ఓటింగ్‌ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో చెదురుమదురు ఘటనలు మినహా… ఆరో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని .. 59 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ దాదాపు ముగిసింది. ఇప్పటి వరకు క్యూలైన్‌లో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ లెక్కల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల వరకు 59 నియోజకవర్గాల పరిధిలో 51 శాతం పోలింగ్‌ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాకాలో భారీగా ఓటింగ్‌ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు గంటల వరకు 72 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. ఎన్నికలు జరుగుతున్న 8 నియోజవకర్గాల పరిధిలో ప్రతి చోట 69 శాతం పైగానే పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రంలోని తమ్‌లుక్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 73.58 శాతం పోలింగ్‌ నమోదైంది. ఘతాల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న భారతి ఘోష్‌పై దాడి చేయడంతో ఉద్రిక్తత రేగింది. ఈ ఘటనపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేయడంతో అధికారుల నుంచి నివేదిక కోరింది. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే జార్ఖండ్‌లో 59 శాతం, మధ్యప్రదేశ్‌లో 53 శాతం, హర్యానాలో 52లో శాతం , బీహార్‌లో 45 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 43 శాతం పోలింగ్‌ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో ఆశించిన స్ధాయిలోపోలింగ్‌ జరగలేదు. నాలుగు గంటలవరకు ఇక్కడ 45 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. గడచిన ఎన్నికల్లో ఇక్కడ ఏడు నియోజకవర్గాలను కైవసం చేసుకున్న బీజేపీ .. ఈ సారి కూడా సత్తా చాటాలని భావిస్తోంది. అయితే పోలింగ్‌ శాతం తక్కువగా ఉండటంతో … ఎవరికి లాభం .. ఎవరికి నష్టం అనే లెక్కలు రాజకీయ పార్టీలు వేసుకుంటున్నాయి.

7 రాష్ట్రాల్లోని 59 లోక్‌ సభ స్థానాలకు మే 12వ తేదీ ఆదివారం పోలింగ్‌ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 10, వెస్ట్‌ బెంగాల్‌లో 8, బీహార్‌ 8, మధ్యప్రదేశ్‌ 8, ఢిల్లీలో 7, జార్ఖండ్‌ 4 లోక్‌ సభ స్థానాలున్నాయి. ఓటు వేసేందుకు ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. పలు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయమే ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఎప్పటిలానే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీనితో ఓటు వేయడానికి ఓటర్లు వెయిట్‌ చేయాల్సి వచ్చింది.

6వ దశలో జరిగిన ఎన్నికల్లో 979 మంది అభ్యర్థులున్నారు.

1,13,167 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

10.17 కోట్ల మంది ఓటర్లున్నారు.

దేశంలోని మొత్తం 543 స్థానాల్లో మొత్తం 7దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 12వ తేదీ వరకు మొత్తం 483 నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 59 స్థానాలకు చివరి దశలో మే నెల 19న పోలింగ్‌ నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here