నయీమ్‌ ఆస్తుల విలువ తేల్చేసిన సిట్‌ అధికారులు

0

అక్షరాలా 2వేల కోట్లు, వెయ్యి 19 ఎకరాల భూములు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఆస్తుల వివరాలను ఎట్టకేలకు పోలీసులు లెక్కగట్టారు. నయీమ్‌ ఆస్తుల విలువ అక్షరాలా రూ.2వేల కోట్లుగా సిట్‌ లెక్కతేల్చింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బ ందం (సిట్‌) వెల్లడించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గంపై సిట్‌ అధికారులు న్యాయశాఖ నుంచి ఇప్పటికే సలహా కూడా తీసుకుంది. నయీమ్‌కు సంబంధించిన ఆస్తులన్నీ ప్రస్తుతం కోర్టు ఆధీనం ఉన్నాయి. మొత్తం 251 కేసులు నమోదు కాగా, వాటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. ఇంకా మరో 60 కేసులు కొలిక్కి రావాల్సి ఉంది. మరో రెండు నెలల్లో నయీమ్‌ కేసు దర్యాప్తును సిట్‌ ముగించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here