Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

దేశ భద్రతే ప్రధాన అంశం

పోలీసు వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకురావాలి

  • విచారణలు వీలైనంత ఎక్కువగా శాస్త్రీయ దక్పథంతో చేపట్టాలి
  • కేంద్ర ¬ంమత్రి అమిత్‌ షా వెల్లడి

దిల్లీ: దేశాన్ని ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు దేశ భద్రత అనేది ప్రధాన అంశమని కేంద్ర హోంమత్రి అమిత్‌ షా వెల్లడించారు. దిల్లీలో నిర్వహించిన బ్యూరో పోలీస్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌(బీపీఆర్‌డీ) 49వ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. ఆ కల సాకారం కావాలంటే దేశ భద్రత అనేది ముఖ్యమైన అంశం. కాబట్టి అంతర్గతంగా, బయటా పకడ్బందీగా భద్రత నిర్వహించాల్సిన అవసరం ఉంది. దేశ అంతర్గత శాంతి భద్రతల పరిరక్షణ కోసం దాదాపు 34 వేలకు పైగా పోలీసులు అమరులయ్యారు. కాబట్టి భద్రత కోసం మనం ఇంకా శ్రమించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని’ అన్నారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థల్లో తీసుకురావల్సిన మార్పులపై మాట్లాడుతూ..’పోలీసు వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా రానున్న రోజుల్లో నూతన సంస్కరణలు తీసుకురావాలి. కానీ ఇది ఒక పెద్ద శ్రమతో కూడుకున్న పని, ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి బీపీఆర్‌డీ సైతం సహకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐపీసీ, సీఆర్పీసీ వ్యవస్థల్లో తీసుకురావల్సిన మార్పులపై దేశమంతా తిరిగి నిపుణులను సంప్రదించే ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా నేరాలకు సంబంధించి దోషుల్ని వేగంగా పట్టుకునేలా విశ్వవిద్యాలయాల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ విద్యను ప్రోత్సహించాలి. దీని ద్వారా నేరాలు జరిగినపుడు బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది. చివరగా ఆయన భద్రతాధికారులను ఉద్దేశిస్తూ విచారణలు వీలైనంత ఎక్కువగా శాస్త్రీయ దక్పథంతో చేపట్టాలని’ సూచించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close