‘పరమపదం విలయట్టు’ ట్రైలర్‌ విడుదల

0

ఒకప్పుడు తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయింది. అక్కడ త్రిషకి అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. చివరిగా ఆమె నటించిన 96, పేట చిత్రాలు మంచి విజయం సాధించడంతో త్రిషకి వరుస ఆఫర్స్‌ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కిట్టీలో అరడజనుకి పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయని సమాచారం. మురుగదాస్‌ శిష్యుడు శరవణన్‌ దర్శకత్వంలో త్రిష ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్‌ చేస్తుంది. ఈ చిత్రానికి ‘రాంగి’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది. మరోవైపు కె తిరుగననమ్‌ దర్శకత్వంలో పరమపదం విలయట్టు అనే చిత్రం చేస్తుంది. ఈ చిత్రం త్రిషకి 60వ మూవీ కావడం విశేషం. నంద, ఏఎల్‌ అజగప్పన్‌, వేల రామ్మూర్తి, రిచార్డ్‌, చామ్స్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 24 అవర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతుంది. అవ్రిూష్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు త్రిష 36వ జన్మదినం సందర్భంగా పరమపదం విలయట్టు ట్రైలర్‌ విడుదల చేశారు. ఇందులో త్రిష మూగ, చెవిటి అయిన చిన్నారికి తల్లిగా నటిస్తుంది. తన కూతురు కిడ్నాప్‌కి గురి కావడంతో ఆమె పలు సమస్యలని ఎదుర్కొంటూ ముందుకు వెళుతుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హై యాక్షన్‌ సీన్స్‌ అభిమానులని అలరిస్తాయని అంటున్నారు. త్రిష ప్రస్తుతం తన తల్లి ఉషా కృష్ణన్‌తో కలిసి యూఎస్‌లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల త్రిష షూటింగ్‌లో గాయపడినట్టు వార్తలు రాగా, వాటిని త్రిష తల్లి కొట్టిపారేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here