Featuredప్రాంతీయ వార్తలు

సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

ఎమ్మెల్యే  పార్టీ మారిన ఒప్పందం నిలబెట్టుకోవాలి

అభివృద్ధి అన్నావు!పార్టీ మారవు!వంతెనపై హామీ ఇప్పించు 

కొల్లాపూర్  (ఆదాబ్ హైదరాబాద్) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీపీసీసీ కార్యనిర్వాహన కార్యదర్శి  జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. సీఎం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిరుద్యోగుల భృతి  వికలాంగుల పెన్షన్ 3016రూ  ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు.గురువారం సీఎం కెసిఆర్ కొల్లాపూర్ ప్రాంతానికి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ సమస్యలను తీర్చలన్నారు.  సింగోటం నుండి గోపాల్ దిన్నె రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలన్నారు.అదేవిధంగా 98జీవో బాధితులను ఆదుకోవాలన్నారు.కొల్లాపూర్ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు.బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన సమయంలో తీసుకున్న ఒప్పందాలను నెరవేర్చాలన్నారు.మాదాసి మాదారి కురువులకు ఇచిన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. అదేవిధంగా సోమశిల సిద్దేశ్వరం వంతెన పై సీఎంతో హామీ ఇప్పించాలన్నారు.ఈ అంశాలపై సీఎం కేసీఆర్ తో హామీ ఇప్పిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేకు సన్మానం చేస్తామని తెలియజేశారు.లేదంటే సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మారారని  తెలిసిపోతుందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్,మండల నాయకులు రాము యాదవ్, ముస్తఫా,రఫీయోదిన్, వెంకటేష్,క్రాంతి,పరుశురాం, కలమంద శేఖర్ తదితరులు పాల్గొన్నారు

టిపిసిసి కార్యనిర్వహణ కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close