మళ్లీ అధికారం బీజేపీదే

0

  • ఐదేళ్లలో ప్రజల మనన్నలు గెలుచుకున్నాం
  • ప్రస్తుతం బీజేపీ గాలి బలంగా వీస్తుంది
  • విపక్షాలు రోజుకో కొత్తకథలు అల్లుతున్నారు
  • ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోడీ

భోపాల్‌ : ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రభుత్వ అనుకూల గాలులు బలంగా వీస్తున్నాయని, మళ్లీ బీజేపీదే అధికారమనిన ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని రూట్లా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. తొలిసారి ఓటుహక్కు వినియోగించుంటున్న ఓటర్లు, మహిళల నాడిని పట్టుకోవడంలో రాజకీయ పండితులు విఫలమయ్యారని, ప్రతి రోజూ కొత్త కథలు అల్లుతున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. రాజకీయ పండితులని చెప్పుకుంటున్న వారు ఢిల్లీలో కూర్చుని మోడీ సర్కార్‌కు అనుకూలంగా ఎలాంటి గాలులు లేవని ప్రతిరోజూ కొత్త కథలు అల్లుతున్నారని విమర్శించారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారు, మహిళలు నాకు మద్దతిస్తున్న విషయం వారికి తెలియదన్నారు. అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తూ చట్టం తీసుకువచ్చినందుకు తల్లులు, సోదరీమణులంతా నాకు సపోర్ట్‌ చేస్తున్నారని చెప్పారు. మహిళల గృహాలకే నేరుగా వంటగ్యాస్‌, విద్యుత్‌ అందజేశామని, టాయిలెట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ అనుకూల గాలులు ఎక్కడ్నించి వస్తున్నాయో తెలియక రాజకీయ పండితులు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భోపాల్‌ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌ ఓటు వేయకపోవడంపై మోడీ మాట్లాడుతూ, తొలిసారి ఓటు వేస్తున్న వారికి ఇది తప్పుడు ఉదాహరణ అవుతుందని అన్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారు తమ మొబైల్స్‌లోనే అందరి నాయకులను గమనిస్తున్నారని, ఎవరికి ఓటు వెయ్యాలో వారికి చెప్పాల్సిన పని లేదని, వారు అభివృద్ధికే ఓటు వేస్తారని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

చిన్న పారిశ్రామికవేత్తలకు గుడ్‌ న్యూస్‌..

నరేంద్ర మోడీ ప్రభుత్వం యూనివర్శల్‌ డెబ్ట్‌ రిలీఫ్‌ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్‌ చేస్తోంది. చిన్న రుణాదారులకు సాయం చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. రుణమాపీ పథకం ద్వారా.. చిన్న రైతులు, కళాకారులు, చిన్న పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ కొత్త ప్లాన్‌ అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా.. మే 23, 2019న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎవరికైతే వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.60వేల కంటే తక్కువ ఉంటుందో వారు పథకం కింద లబ్ధి పొందవచ్చు. రూ.35వేల కంటే తక్కువ రుణాలు, ఆస్తుల విలువ రూ.20వేలు అంతకంటే తక్కువ ఉన్నవారే ఈ పథకాన్ని అర్హులువుతారు. దీనిపై కార్పొరేట్‌ అఫైర్‌ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. యూనివర్శల్‌ డెబ్ట్‌ రిలీఫ్‌ స్కీమ్‌ ను ప్రత్యేకించి పేదవారి కోసం ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ పథకం అమలుపై మినిస్టరీ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ పనిచేస్తోందని అన్నారు. ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చును రూ.20వేల కోట్ల కంటే అధికంగా ఉండే అవకాశం లేదన్నారు. చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్న వారికి మిలియన్ల బెనిఫెట్స్‌ అందే అవకాశం ఉందని చెప్పారు. రుణం పొంది తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నవారి కోసం బ్యాంక్రప్టీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా అండగా ఉండి వారిని రుణాల నుంచి విముక్తి కలిగించేలా చేయూతనిస్తోందన్నారు. వ్యక్తిగత వార్షిక ఆదాయం పొందే వారంతా ఈ స్కీమ్‌ నుంచి బెనిఫెట్స్‌ పొందవచ్చునని, తమ క్రెడిట్‌ హిస్టరీ ఆధారంగా లబ్ధి పొందే అవకాశం ఉందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here