Featuredస్టేట్ న్యూస్

నాలా కబ్జాలకు అనుమతులు… నరకంగా మారుతున్న విశ్వనగరం

నాలా స్థలాలలో నిర్మాణాలకు

జీహెచ్‌ఎంసి అనుమతులు

మూసీ సుందరీకరణకు పదహారు

వందల కోట్ల కేటాయింపు

ఆక్రమణలను గుర్తించని మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

చినుకు పడితే చిత్తడివుతున్న నగరం నరకంగా మారడానికి నాలాల కబ్జాలు కారణమని తేల్చి చెప్పిన ప్రభు త్వం. ఆ దిశగా పని చేయక పోగా నాలా కబ్జాలకు అనుమతులను మం జూరు చేస్తూ జిహెచ్‌ఎంసి చేతి వాటాన్ని ప్రదర్శిస్తుంది. మంగళవారం హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మలక్‌ పేట్‌ శాసనసభ్యులు హైమద్‌ బిన్‌ బాలాల తో పాటు జిహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ అంబర్పేట మూసి కాలువ నుండి గోల్నాక చాదర్‌ ఘాట్‌ వరకు మూసి కాలువ సమాంతరంగా ప్రధాన రహదారి నిర్మాణ పనులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఓల్డ్‌ మలక్‌ పేట్‌ సమీపంలో మూసి కాలువ స్థలంలో ఐదంతస్తుల భవనానికి కి నిర్మాణ అనుమతుల మంజూరు విషయం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై అంబర్పేట్‌, చార్మినార్‌ మండల తాసిల్దార్‌ లు మూసి కబ్జాల వివరాలను సూచిస్తూ నివేదికలు సమర్పించిన, ఖాతారు చేయని జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నాలా స్థలాలలో నిర్మాణాలకు అనుమతులను మంజూరు చేసి చరిత్ర సష్టించారు. పార్లమెంట్‌ సభ్యునిగా మూసీ పరీవాహక ప్రాంతాన్ని సుంద రీకరణతో పాటు దానికి సమాంతరంగా ప్రధాన రహదారిని నిర్మించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రయత్నాలు జరుపు తుంటే కాసుల కోసం కబ్జాలను ప్రోత్సహిస్తూ నిర్మాణ అనుమతులను మంజూరు చేయడం శోచనీయం. ఈ విషయమై స్థానికులు కొందరు జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయగా తూతూమం త్రంగా కూల్చివేతల నాటకానికి రక్తి కట్టించి మమానిపించడం కొసమె రుపు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ స్థాయి నాయ కులు సైతం నగరంలో నాలాల కబ్జాలన్నిటిని తొలగి స్తామని అంతర్జాతీయ సాయి లో విశ్వ నగరాన్ని నిర్మిస్తా మని చేస్తున్న ప్రకటనలకు జిహెచ్‌ఎంసి అధికా రులు గండి కొడుతున్నారు అనడం లో సందేహం లేదు. ఇప్పట ికైనా మూసి పరివాహక ప్రాంత అభివద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూసి రివర్‌ ఫ్రంట్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చేసే పనులు చేయించి నగ రాన్ని కాపాడే విధంగా ముందుకెళ్లాలని నగర ప్రజలు కోరుతున్నారు. మూసి సుందరీకరణ కోసం 1600 కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం వారు చేయాల్సిన అన్ని అప్పగించకపోవడం లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు సిబ్బంది ప్రైవేట్‌ పనులు చేసుకుంటూ కాలం గడుపుతుండటం బాధాకరమైన విషయం. సంస్థని ఏర్పాటు చేసి సంవత్సరాలు గడుస్తున్న ఒక్క అంగుళం అక్రమాలని సైతం గుర్తించకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా మారింది. నాయ కులు సుందరీకరణ పనులు చేయించే దిశగా చిత్తశుద్ధిని ప్రదర్శించాలని నగర ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close