కథువా కంత్రీలకు శిక్షలు ఖరారు

0

సాంజీరామ్‌తో పాటు మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష

మరో ముగ్గురికి ఐదేళ్ల చొప్పన కారాగారం

ఏడాదిన్నరలో తీర్పు వెలువరించిన పఠాన్‌ కోర్టు

కథువా అత్యాచారం కేసులో పఠాన్‌ కోట్‌ న్యాయస్ధానం శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్ధానం ఏ1 సాంజీరామ్‌, ఏ2 దీపక్‌ ఖజూరియా, ఏ3 కపిల్‌ రాజ్‌ లకు జీవిత ఖైదు విధించింది. మిగిలిన ముగ్గురికి ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. జీవత ఖైదుకు గురయిన వారిలో గ్రామ పెద్దతో పాటు మిగిలిన ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. భూవివాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు నిర్ధారించిన దర్యాప్తు బృందం కేసు వివరాలు బయటకు రాకుండా స్ధానిక పోలీసులు ప్రయత్నించినట్టు చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దీనికి సంబంధించి తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించడంతో నిందితులకు శిక్షలు పడ్డాయి.


2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here