తొమ్మిది మీదే మహర్షి భారం

0

ఇవాళ సాయంత్రం జరగబోయే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కన్నా ట్రైలర్‌ మీదే అభిమానుల కన్ను ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా వచ్చిన టీజర్‌ ప్లస్‌ ఆడియో ఆల్బం రెండూ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్‌ దక్కించుకోకపోవడంతో ఒక్క ట్రైలర్‌ తో ఇవన్ని తుడిచిపెట్టుకుపోవాలని బలంగా కోరుతున్నారు. 9న రాబోతున్న మహర్షికి టైం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఎన్నో కారణాల వల్ల అంత బజ్‌ కనిపించడం లేదు. మహేష్‌ రేంజ్‌ హీరోకు ఇవన్ని అవసరం లేదు అనుకున్నా పబ్లిసిటీ లేనిదే ఎంత బహుబలైనా తడబడక తప్పదు. ఇకపోతే మహర్షి విషయంలో టీం 9వ నెంబర్‌ ని గట్టిగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇవాళ రాత్రి ట్రైలర్‌ విడుదలయ్యే ముహూర్తం 8 గంటల 10 నిమిషాలలో అంకెలను కూడితే వచ్చే నెంబర్‌ 9. టీజర్‌ రిలీజ్‌ చేసినప్పుడు సమయం 9 గంటల 9 నిముషాలు. టోటల్‌ చేస్తే సేం రిజల్ట్‌. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ వచ్చిన టైం 4.05ది కూడా ఇదే పరిస్థితి అయితే బెనిఫిట్‌ షో కూడా ఉదయం 9 గంటలకు వేస్తారా అనే సందేహం రావడం సహజం. ఏడాది తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ప్రీమియర్‌ షోకు అంత లేట్‌ అంటే ఫాన్స్‌ ఒప్పుకోరు. తెలంగాణాలో అనుమతి ఇవ్వరు కాబట్టి 9కి వేయొచ్చు కాని ఆంధ్రప్రదేశ్‌ లో అలాంటి అడ్డంకులు ఏమి ఉండవు కాబట్టి ఆ ఒక్క చోట ఛాన్స్‌ ఉంది. హ్యాపీగా తెల్లవారుఝామున 4 లేదా 5 గంటలు షోకు పడిపోతాయి. బయ్యర్ల నుంచి వస్తున్న టాక్‌ ప్రకారం ఫస్ట్‌ షో ఉదయం 4 గంటల 50 నిమిషాలకు లేదా 5 గంటల 4 నిమిషాలకు వేయోచ్చట. అదే జరిగితే తొమ్మిదో నెంబర్‌ సెంటిమెంట్‌ మహర్షి రిలీజ్‌ కూడా వర్తించినట్టే. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here