బిజినెస్

మార్కెట్‌లోకి సరికొత్త నోకియా ఫోన్‌

న్యూఢీల్లీ : నోకియా బ్రాండ్‌పై హెచ్‌ఎండీ గ్లోబల్‌ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. నోకియా 4.2 పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ వన్‌ ఫ్లాట్‌ఫాంపై పనిచేస్తుంది. అంతేకాదు, ప్రత్యేకంగా గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌తో ఈ ఫోన్‌ వస్తుండటం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో దీన్ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీ గ్లోబల్‌ రెండు వేరియంట్లలో నోకియా 4.2ను తయారు చేయగా, ఒక వేరియంట్‌ను మాత్రమే తీసుకొచ్చింది. 3జీబీ ర్యామ్‌ 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న మొబైల్‌ ధరను రూ.10,999గా నిర్ణయించారు. బ్లాక్‌, పింక్‌ శాండ్‌ రంగుల్లో ఇది లభ్యం కానుంది. ప్రస్తుతానికి నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో దీన్ని విక్రయానికి ఉంచింది. మరో వారం రోజుల్లో అన్ని ప్రముఖ మొబైల్‌ విక్రయ దుకాణాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ వెల్లడించింది. ప్రారంభ ఆఫర్‌ కింద నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.500 రాయితీ ఇస్తుండగా, వొడాఫోన్‌-ఐడియా వినియోగదారులు రూ.2,500 విలువైన 50 వోచర్లను పొందవచ్చు. అంతేకాదు, ఆరునెలల పాటు ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ సదుపాయాన్ని హెచ్‌ఎండీ గ్లోబల్‌ కల్పిస్తోంది. ‘భారత్‌లోని నోకియా ఫ్యాన్స్‌ కోసం సరికొత్త 4.2 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో అనేక అధునాతన ఫీచర్లను జోడించాం. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నాం. ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రొగ్రాంలో భాగంగా తర్వాతి రెండు అప్‌డేట్‌ల(క్యూ, ఆర్‌)ను కూడా ఇస్తాం’ అని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఇండియా హెడ్‌ అజయ్‌ మెహతా తెలిపారు.

నోకియా 4.2 ప్రత్యేకతలు

I 5.71 అంగుళాల హెచ్‌డీం డిస్‌ప్లే

I స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌

I 3జీబీ ర్యామ్‌ం 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

I ఎస్డీ కార్డు సాయంతో 400 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే సదుపాయం

I ఆండ్రాయిడ్‌ 9

I వెనుక వైపు 13ం2 డ్యుయల్‌ కెమెరా సెటప్‌

I ముందువైపు 8మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

I 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close