మార్కెట్‌లోకి సరికొత్త బాలెనో

0

న్యూఢీల్లీ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియాకు చెందిన మోడల్‌ మారుతీ సుజుకి బాలెనోలో మరో కొత్త వేరియంట్‌ను సంస్థ భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. భారత్‌ స్టేజ్‌- కర్బన ఉద్ఘారాల నియంత్రణకు అనుగుణంగా తీర్చిదిద్ది, పెట్రోల్‌తో నడిచే సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో వేరియంట్‌ను విపణిలోకి విడుదల చేసినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. దీని ధర రూ.5.58 లక్షల నుంచి రూ. 8.9 లక్షలు (ఎక్స్‌ షోరూం దిల్లీ)గా ఉంది. అంతేకాకుండా ఈ మోడల్‌లో స్మార్ట్‌ హైబ్రిడ్‌ సాంకేతికతతో నడిచే మరో రెండు కొత్త వేరియంట్లను కూడా సంస్థ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 1.2 లీటర్‌ డ్యుయల్‌ జెట్‌, డ్యుయల్‌ వీవీటీ పెట్రోల్‌ సామర్థ్యంగల మోడల్‌ ధర రూ. 7.25 లక్షలు, జెటా వేరియంట్‌ ధర 7.86 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. స్మార్ట్‌ హైబ్రిడ్‌ సాంకేతికతతో నడిచే ఈ వేరియంట్స్‌ అన్నీ ఒక లీటర్‌ పెట్రోల్‌కు 23.87 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. ‘ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, పర్యావరణ హితమైన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కొత్త మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క షి చేస్తున్నాం. దీనిలో భాగంగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిందే ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో వేరియంట్‌. ఈ వేరియంట్‌ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది’ అని మారుతీ సుజుకి ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) ఆర్‌.ఎస్‌. కల్సి అన్నారు. భారత్‌ స్టేజ్‌-కి అనుగుణంగా వాహనాలను తీర్చిదద్దే క్రమంలో ఈ వేరియంట్‌లోని ఇంజిన్‌ హర్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఎగ్సాస్ట్‌ వ్యవస్థలో అనేక మార్పులు చేసినట్లు కల్సి పేర్కొన్నారు. అంతేకాకుండా స్మార్ట్‌ హైబ్రిడ్‌ సాంకేతికతతో నడిచే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో దేశంలో ఇదే మొదటిది అని కల్సి తెలిపారు. 2015లో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన బాలెనో ఇప్పటివరకు 5.5 లక్షలకుపైగా యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here