కేసీఆర్‌వి హత్యా రాజకీయాలు

0
  • సీఎంపై మండిపడ్డ బీజేపీ ఎంపీ
  • నిలువరించి తీరుతామన్న బండి సంజయ్‌
  • పాలమూరులో బీజేపీ కార్యకర్త హత్య..
  • దోషులను శిక్షించకపోతే మేమే న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్‌ :

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు పై కరీంనగర్‌ బీజేపి ఎంపీ బండి సంజయ్‌ విరిచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్‌ మరియు సమాజ్‌ వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ మాదిరి చంద్రశేఖర్‌ రావు హత్యా రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్నామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడంతో ఆందోళనకు గురవుతున్న కేసీఆర్‌ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. నారాయణపేట జిల్లా దేవరకద్ర గ్రామంలో బీజేపీ కార్యకర్త ముష్టి ప్రేమ్‌ కుమార్‌ హత్యలో టీఆర్‌ఎస్‌ అగ్రనాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రేమ్‌ కుమార్‌ తో పాటు మరో ముగ్గురిని సామూహికంగా హత్య చేసేందుకు టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, కేరళ సీఎం పినరాయి విజయన్‌ల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం హత్యా రాజకీయాలకు తెరలేపిందన్నారు. రాబోయే రోజుల్లో దాడులు హత్యా రాజకీయాలు మితి మీరు పోయే ప్రమాదం ఉందని వాటిని ధీటుగా ఎదుర్కునేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రేమ్‌ కుమార్‌ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దాడులు, హత్య రాజకీయాలకు పాల్పడితే ఎలాంటి గతి పడుతుందో మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌ కు తెలిసిందని భవిష్యత్‌ లో కేసీఆర్‌ కు అలాంటి గతే పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు నాయకులు మనోధైర్యంతో ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని, టిఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేసేందుకు వెనుకాడొద్దని ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

దోషులను శిక్షించకపోతే మేమే న్యాయం చేస్తాం : రాజా సింగ్‌

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వెల్లడైన వేళ.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. దేవరకద్ర సమీపంలోని డోకూరు గ్రామంలో ప్రేమ్‌ కుమార్‌ అనే బీజేపీ కార్యకర్తను రాడ్లతో మోదిన ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీజేపీ చేతిలో ఓటమిపాలవడంతో.. గులాబీ పార్టీ కార్యకర్తలు ప్రేమ్‌ను టార్గెట్‌ చేసుకున్నారు. ఇద్దరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రేమ్‌ కుమార్‌ను రాడ్లతో బాది చంపేశారని అతడి సహచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌కు చెందిన శ్రీకాంత్‌ రెడ్డితోపాటు మరో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని దేవరకద్ర పోలీసులు తెలిపారు. హత్యకు గురైంది కాంగ్రెస్‌ కార్యకర్త అని, బీజేపీకి చెందిన వ్యక్తి కాదని పోలీసులు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసి ఒక సీటు గెలిచాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here