Featuredజాతీయ వార్తలుస్టేట్ న్యూస్

మరింత ఉధృతంగా ఆర్టీసీ సమ్మె

11వరోజూ తగ్గని ఆందోళనలు

హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ తమిళసై

కెకెతో చర్చించిన మాజీ ఎంపి కొండా

ఎక్కడిక్కడ ప్రజాప్రతినిధులను అడ్డుకున్న పోలీసులు

ఎంపి బండి సంజయ్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డిల అరెస్ట్‌

హైదరాబాద్‌

తెలంగాణలో టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది.11వ రోజు కార్మికుల ఆందోళనలతో దద్దరిల్లింది. సమ్మకు మద్తుగా నిలిచన ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎక్కడికక్కడ పోలీసులతో ఆందోళనలను అణిచివేసే కార్యక్రమానలు ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై హూటాహుటిన మంగళవారం ఢిల్లీకి బయల్దేరారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి రావాలంటూ
గవర్నర్‌కు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం నివేదికను కోరింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షాను తమిళిసై భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్‌ వారికి వివరించనున్నారు. అయితే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చి, ముగ్గురు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు కార్మికులు కానీ ఒక్క మెట్టు కూడా దిగడంలేదు. దీంతో పాఠశాలలు, కళాశాలలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వ మొడి వైఖరి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మెతో పలు జిల్లాల్లో కార్మికులు మానవహరాలు, ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్బంగా కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీకి మద్దతుగా చేపట్టిన బీజేపీ ర్యాలీలో పెద్ద ఎత్తున ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారుకు అడ్డంగా బీజేపీ కార్యకర్తలు పడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం తీరు పట్ల ఆర్టీసీ కార్మికులు
అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికులు మంత్రులకు పిండప్రదానం చేశారు.ఆర్టీసీ కార్మికుల బలిదానాలకు మంత్రులే కారణమంటూ.. మంత్రుల ఫోటోల ముందు ఏడుస్తూ మహిళల నిరసన తెలిపారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ నాయకురాలు బోడిగ శోభ మద్దతు తెలిపారు.

ఆర్టీసీ సమ్మె ప్రభావంతో మంత్రుల బంగ్లాల వద్ద హై అలర్ట్‌ ప్రకటించారు. ఎటువైపు నుంచి అయినా కార్మికులు చొరబడతారన్న సమాచారంతో బంగ్లాల వద్ద 30-50 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులకు మద్దతుగా విద్యార్థులు నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్‌ డౌన్‌డౌన్‌ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. నల్లగొండ బస్టాండ్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. నల్లగొండ డిపోను ఆర్టీసి కార్మికులు, ప్రజాసంఘాల నేతలు ముట్టడించారు. బస్సులు కదలకుండా కార్మికులు అడ్డంగా
పడుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో వంద మంది కార్మికులు, నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదిలావుంటే ఆర్టీసీ సమ్మెపై తాను చర్చిస్తానని అనలేదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు అన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే చర్చిస్తానని
అన్నానని అన్నారు. ఆర్టీసీ సమ్మెతో

పరిస్థితులు చేజారుతున్నాయని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో తాను చర్చలు జరుపుతానని చెప్పలేదన్నారు. మంచి జరుగుతుందని అనుకుంటే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమన్నారు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని.. ఆయన అందుబాటులోకి
రాలేదని చెప్పారు. ప్రభుత్వం ఉద్దేశమేంటో తనకు తెలియదన్నారు. ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా కలిసికట్టుగా ఉండాలని కేకే సూచించారు. మరోవైపు చర్చలకు ముందుకు రావాలని కెకెకు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కోరారు. సమ్మెతో ప్రజలకు తీవ్రిబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఇకపోతే ఆందోళనకు మద్దతుగా నిలిచిన సంగారెడ్డి ఎమ్మెల్యేజగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట
చేశారు. వివిధ జిల్లాల్లో కుటుంబాలతో సహా కార్మికులు నోడ్డెక్కారు. వారంతా సిఎం కెసిఆర్‌ను విమర్శిస్తూ నినాదాలు చేశారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close