Featuredస్టేట్ న్యూస్

ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేందుకే మిషన్‌ భగీరథ

  • ఖర్చుకు వెనకాడకుండా పథకం అమలు
  • దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాల్సి ఉంది
  • కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కేసీఆర్‌

హైదరాబాద్‌

మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీరు అందించే మహత్తర కార్యక్రమం తెలంగాణలో నడుస్తోందని సిఎం కెసిఆర్‌ అన్నారు. ప్రజలకు కనీస అవసరమైన మంచినీటి అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా దీనిని చేపట్టిందన్నారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ గురించి సీఎం కేసీఆర్‌ను గజేంద్రసింగ్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, ఉన్నతాధికారులు భగీరథ పథకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మిషన్‌ కాకతీయ పథకం గురించి కూడా కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. 90శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేసినట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకం దాదాపుగా పూర్తయ్యిందని అన్నారు. 24వేల ఆవాస ప్రాంతాలకు రోజూ ఉపరితల జలాలను అందించనున్నట్లు వెల్లడించారు. వచ్చే 30ఏండ్ల వరకు జనాభా అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు. మిషన్‌ భగీరథ వంటి పథకం దేశమంతా అమలైతే మంచిది. ప్రజలకు మంచినీరు అందించే పథకాలను ఆర్థిక కోణంలో చూడొద్దన్న లక్ష్యంతో దీనిని చేపట్టామని అన్నారు. మిషన్‌ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని’సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ప్రశంసించారు. త్వరలో మరోసారి తెలంగాణలో పర్యటించి క్షేత్రస్థాయిలో పథకాల అమలును స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. మిషన్‌ భగీరథ తరహాలో దేశవ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేస్తాం. మురుగు నీటిని శుద్ధిచేసి తిరిగి వినియోగించే విధానాలు కూడా అవలంబించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల అమలును పరిశీలిస్తాని’ షెకావత్‌ పేర్కొన్నారు. అనంతరం కేంద్రమంత్రికి జ్ఞాపికను బహూకరించి, శాలువాతో సీఎం కేసీఆర్‌ సన్మానించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close