Featuredస్టేట్ న్యూస్

మావోయిస్టుల ఘాతుకం

  • పోలీస్‌ వాహనంపై దాడి
  • 16మంది భద్రతా సిబ్బంది దుర్మరణం
  • మావోల దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని
  • మావోల గాలింపు చేపట్టిన సిబ్బంది
  • కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

గడ్చిరోలి: బుధవారం తెల్లవారుజామున పురాందా-మాలేగావ్‌-యెర్కడ్‌ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న 36 వాహనాలకు నక్సల్స్‌ నిప్పుపెట్టిన మావోలు, బుధవారం మధ్యాహ్నం ఓ పోలీస్‌ వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 16మంది చనిపోగా వీరిలో 15 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున దాదాపూర్‌లో దగ్ధమైన వాహనాలను పరిశీలించేందుకు వెళ్తున్న క్విక్‌ రెస్పాన్స్‌ బృందంపై మావోయిస్టులు బాంబు దాడిచేశారు. కుర్‌కెదాలోని లెంధరీ నల్లా దగ్గరకు రాగానే భద్రతాసిబ్బంది ఉన్న ఓ వాహనాన్ని శక్తిమంతమైన ఐఈడీ బాంబుతో పేల్చారు. ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పేలుడు తీవ్రతకు వాహనం తునాతునకలైంది. ఘటన అనంతరం నక్సల్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఘటనాస్థలంలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పురాందా-మాలేగావ్‌-యెర్కడ్‌ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న 36 వాహనాలకు నక్సల్స్‌ నిప్పుపెట్టారు. ఈ నిర్మాణ పనులను అమర్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ లిమిటెడ్‌ అనే సంస్థ చేస్తోంది. ఈ కంపెనీకి దాదాపూర్‌లో దాదర్‌ ప్లాంట్‌ ఉంది. రోడ్డు నిర్మాణం కోసం వినియోగిస్తున్న వాహనాలను ఈ ప్లాంట్‌లోనే నిలిపి ఉంచారు. ఈ ప్లాంట్‌లోకి మావోయిస్టులు చొరబడి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రూ. 10కోట్ల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నేడు ‘మహారాష్ట్ర దినోత్సవం’ జరుపుకుంటున్నారు. ఈ సమయంలో మావోయిస్టులు ఇలాంటి దాడులకు పాల్పడటం గమనార్హం.

మావోల దాడిని ఖండించిన ప్రధాని మోడీ..

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీతో మావోయిస్టులు పేల్చిన సంగతి తెలిసిందే. దీంతో 15 మంది పోలీసులు, ఒక డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. పోలీసుల ధైర్యసాహసాలకు తాను సెల్యూట్‌ చేస్తున్నాను. వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోదు అని మోడీ పేర్కొన్నారు. పోలీసు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హింసాత్మక ఘటనలను ఉపేక్షించేది లేదని మోడీ స్పష్టం చేశారు. పోలీసుల వాహనంపై మావోయిస్టులు దాడి చేయడాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై డీజీపీ, గడ్చిరోలి ఎస్పీతో మాట్లాడానని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close