దూసుకొస్తున్న వాయు తుపాను

0

నేడు ఉదయం గుజరాత్‌ తీరందాటే అవకాశం

  • గంటకు 135కి.మీ వేగంతో ప్రచండ గాలులు
  • అప్రమత్తమైన గుజరాత్‌ ప్రభుత్వం
  • రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
  • గుజరాత్‌కు ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు

గాంధీనగర్‌ :

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను తీవ్ర రూపం దాల్చింది. తీరం దిశగా దూసుకొస్తోంది. గురువారం ఉదయం గుజరాత్‌ తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే సమయంలో తుపాను మరింత ప్రచండ రూపందాలుస్తుందని చెప్పింది. గంటకు 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అంచనా వేసింది. ‘వాయు’ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ముమ్మరం ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల రక్షణకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటోంది. వాయుతుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌, కేరళ, లక్షద్వీప్‌, కర్ణాటక, కొంకణ్‌, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో వాయు తుపాను తీవ్రత అధికంగా ఉండనుంది. మరో రెండు రోజులు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. వాయు తుపానును ఎదుర్కోవడానికి చేసిన ఏర్పాట్లను కేంద్ర ¬ం మంత్రి అమిత్‌ షా సమీక్షించారు. ప్రజలను రక్షించడానికి వీలైనన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ విభాగం.. 26 బృందాలను వీరావల్‌ ఓడరేవు సహా గుజరాత్‌లోని తీరాలవెంట మోహరించింది. అదనంగా మరో 12ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను గుజరాత్‌ కి తరలించారు. తుపాను తీరం దాటిన తర్వాత గుజరాత్‌, డయూ ప్రాంతాల్లో సహాయక చర్యలను అందించనున్నారు. ముందు జాగ్రత్తగా తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మోర్బీ,

కండ్లా, గాంధీదామ్‌ ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

గుజరాత్‌లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను తీవ్ర రూపం దాల్చింది. గుజరాత్‌ వైపు కదులుతోంది. దూసుకొస్తున్న వాయు తుపాను గుజరాత్‌ తీర ప్రాంత ప్రజలను భయపెడుతోంది. గురువారం ఉదయం వాయు తుపాను గుజరాత్‌ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కచ్‌ నుంచి దక్షిణ గుజరాత్‌ వరకూ ఉన్న కోస్తా తీర ప్రాంతాల నుంచి 3 లక్షలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గుజరాత్‌లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కేంద్ర ¬ం మంత్రిత్వ శాఖ గుజరాత్‌, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలకు సమాచారాన్ని, సలహాలను అందజేసింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను కూడా గుజరాత్‌ కు తరలించారు. సహాయక చర్యల కోసం బలగాలను రంగంలోకి దింపారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానాల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఎయిర్‌ పోర్టుకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను తరలించారు.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎండలు..

వాయు తుపాను ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురవనుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం ముగిసినా సూర్యుడి ప్రతాపం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రుతుపవన తేమ గాలులు, భూఉపరితలం మీద ఉన్న గాలులు మొత్తం తుపాను దిశగా పయనిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ, ఏపీ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో వడగాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయు తుపాను తీరందాటితే కానీ రుతుపవనాలు విస్తరించవని, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలుకురిసే అవకాశం  లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here