Featuredజాతీయ వార్తలు

సొమ్ముల్లేకనే… మోకరిల్లిన పాక్‌

భారత్‌ ముందు పాకిస్థాన్‌ మోకరిల్లిడం అంటే మామూలు విషయం కాదు. పాకిస్థాన్‌ కు అంతకన్నా గత్యంతరం లేక..పరువు కోసం మేకపోతు గాంభీర్యంతో కొంత పాకులాడింది. అండగా ఉంటుందని అనుకున్న చైనా చేతులెత్తేసింది. ‘ఉగ్రవాద నిరోధం నీ పనే కదా, ఇండియా అదే పనిచేస్తుంటే ఎదురు యుద్ధానికి ఎందుకు దిగుతున్నావు’ అన్నట్టుగా రష్యా, భారత్‌ లతో కలిసి ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఇస్లామిక్‌ దేశాల కూటమి కూడా పెద్దగా పాకిస్థాన్‌ వైఖరి పట్ల స్పందించలేదు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర అగ్రదేశాలు కన్నెర్ర చేశాయి. ఇవన్నీ తెరవిూద కనిపించే సంఘటనలు. అయితే పాకిస్థాన్‌ ‘యుద్ధం’ అనగానే భయపడటానికి ప్రధాన కారణం ఆదేశ ఆర్థిక వ్యవస్థ. స్వాతంత్రానికి ముందు సోదరుల్లా ఉన్న దాయాదుల మద్య పోరుకు బదులు శాంతి వైపు అడుగులు పడాలి.

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

2018-19లో పాక్‌ రక్షణ బడ్జెట్‌ రూ.56 వేల కోట్లు. భారత రక్షణ బడ్జెట్‌ రూ.2.95 లక్షల కోట్లు.. అంటే మన బడ్జెట్లో 5వ వంతు. మన త్రివిధ దళాలతో పోలిస్తే.. పాక్‌ సైన్యం, వైమానికదళం, నౌకాదళం అన్నీ బలహీనంగా ఉన్నాయి. భారత్‌ కొనుగోలు చేస్తున్న యుద్ధవిమానాలకు దీటైన యుద్ధవిమానాలు సమకూర్చుకునే స్తోమత పాక్‌ కు లేదు. వీటన్నిటినీ మరచి పాకిస్థాన్‌ గనక భారత్‌ తో పోరుకు దిగితే ఆర్థికంగా మరింత నష్టపోతుంది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల భారంలో మునిగిపోయిన పాక్‌ ఆర్థిక వ్యవస్థ యుద్ధం అంటూ జరిగితే పూర్తిగా మునిగిపోతుంది. అందుకే జరిగిందేదో జరిగింది. ఉగ్రవాది మ మంచిగా ఉందామంటూ ఓ బొంకు బొక్కి ఠక్కున… చటుక్కున పాక్‌ యుద్దం నుంచి బయటపడింది.

‘గ్రే లిస్ట్‌’ తలపోటు: టెర్రరిస్టులకు ఆర్థికసాయంపై నిఘా వేసే అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌, పాక్‌ ను ‘గ్రే లిస్ట్‌ నేషన్‌’ గా ప్రకటించింది. దీంతో ఆదేశ ఆర్థికవ్యవస్థ ఇప్పటికే కుదేలయింది. గ్రే లిస్టు అని ప్రకటించడంతో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పాకిస్థాన్కు రుణాలు వచ్చేలా లేవు. సరికదా గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులపైనా ఒత్తిళ్లు పెరిగాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం పాకిస్థాన్లో పెట్టుబడులకు వచ్చే అవకాశం లేదు. నిజానికి ఈ టాస్క్‌ ఫోర్స్లో చైనా కూడా సభ్యదేశం. పాకిస్థాన్కు ఆర్థికసాయం, మౌలికరంగాల్లో పెట్టుబడుల విషయంలో చైనాపైనా ఒత్తిడి ఉంది. ఈ కారణంగా పాకిస్థాన్‌ విషయంలో తొలిసారిగా చైనా మాటమార్చింది. అంతర్జాతీయంగా అసలే విపరీతమైన లోటులో ఉన్న పాకిస్థాన్‌ ఆర్థికవ్యవస్థకు యుద్ధం పిడుగుపాటు అవుతుంది. ప్రపంచ దేశాల సాయం లేనిదే పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ కదలదు. అంతర్జాతీయంగా పాకిస్థాన్కు నయాపైసా అప్పు పుట్టదు. ఇప్పటికే విదేశీ మారకద్రవ్యం హరించుకుపోయింది. పాకిస్థాన్‌ ఖజానా వట్టిపోయింది. యుద్ధానికి దిగినా కొన్నాళ్లు కొనసాగించే స్థితి లేదు. పైగా దాంతో పాకిస్థాన్‌ ఆర్థికంగా ఇంకా చితికిపోయే దుర్గతి. ఈ పరిస్థితిల్లో భారత్‌ తో యుద్ధాన్ని కొనసాగించడం వల్ల పాక్‌ సాధించేదీ లేదు. ఆ దేశంపై పెత్తనం చేసే పాకిస్థాన్‌ ఆర్మీ ఆర్థికావసరాలే ఇప్పుడు సరిగ్గా తీరడం లేదు. ఇంకా ఈ స్థితి దిగజారితే మొదటికే ముప్పు. ఇవన్నీ తెలిసే ఒకవైపు ‘మా వద్ద కూడా అణ్వాయుధాలున్నయ్‌ సుమా’ అనే మేకపోతు గాంభీర్యాన్ని చూపుతూనే.. మరోవైపు ‘చర్చలకు సిద్ధం’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించాల్సి వచ్చింది.అందుకే భారత్‌ దౌత్య ఒత్తిడికి తలొగ్గి అభినందన్‌ ను ఆగమేఘాల విూద

భారత్‌ కు గౌరవంగా పంపింది.

చైనా దొంగాట:

భారత్‌ పాక్‌ యుద్ధం వస్తే ఇరు దేశాలతో పాటు వెంటనే ఆర్థికంగా నష్టపోయేది చైనా.

గిల్గిట్‌- బల్తిస్థాన్‌ ప్రాంతాల్లోకి విస్తరిస్తున్న చైనా-పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్ను కూడా బ్రేక్‌ పడుతుందని చైనా, పాకిస్థాన్‌ లు భావించాయి. చైనా పెడుతున్న లక్షల కోట్ల పెట్టుబడులు. కూడా అయోమయంలో పడతాయి. ఇదే జరిగితే పాకిస్థాన్‌ పరిస్థితి మరింత సంక్షోభంలో పడటం ఖాయం. అందుకే చైనా వెంటనే భారత్‌ వెంట నిలబడి… పాక్‌ కు తాత్కాలికంగా ‘యుద్ద విరామం – సయోధ్య సలహా’ ఇచ్చి పాక్‌ ను గట్టెక్కించింది.

ఆగని పాక్‌ కవ్వింపు చర్యలు..

సరిహద్దు వెంట పాక్‌ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి మెంధార్‌, బాలాకోట్‌, కృష్ణఘాటి సెక్టార్లో పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. పాక్‌ బలగాల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది.

పాక్‌ లో ‘బాజ్వా’ ముసలం:

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బాజ్వా ప్రతిపాదించిన అంశాలే బాజ్వా సిద్ధాంతంగా చెబుతున్నారు. ఇది ప్రాంతీయ శాంతిని కోరుకుంటోంది. ఇపుడు బాజ్వా సిద్ధాంతానికి కాలం చెల్లిపోతుందా? లేదా ..? అనేది భవిష్యత్‌ నిర్ణయిస్తుంది.ఈ పాలసీ ప్రకారం భారత్‌ తో సమస్యలను ఒక పక్కన పెట్టి మంచి సంబంధాల కోసం ప్రయత్నించాలి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే… గత నాలుగు దశాబ్దాలుగా శవాల దిబ్బలపై మానవత్వం మరిచి రక్త సంబరాలు రుచిమరిగిన పాకిస్థాన్‌ ఇకనైనా మారాలి. పాక్‌ లో శాంతి నెలకొనాలి. అదే పాక్‌ భవిష్యత్తుకు మంచిది. అదే 130 కోట్ల

భారత హృదయాలు కోరుకుంటుంది.

చివరిగా…

శాంతి గురించి హిందూధర్మం చెబుతోంది. చాలామంది భారత్‌ లో ఉన్నది ‘హిందుమతం’ అని తప్పుగా భావించుకుంటారు. కానీ మనదేశంలో ఉన్నది..

భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది.. హిందూ మతం కాదు. హిందూ ధర్మం. మేరా భారత్‌ మహాన్‌. జైహింద్‌.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close