Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలు

ప్రారంభమైన ఆక్వా సదస్సు

మత్స్యశాఖ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

  • బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు
  • తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
  • జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్‌

తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఆక్వా అక్వేరియా ఇండియా-2019 ప్రదర్శన ప్రారంభమైంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆక్వా అక్వేరియా ఇండియా ప్రదర్శనను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సదస్సు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగనుంది. భారత్‌ సహా ఆసియా దేశాల నుంచి 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. మత్స్య కంపెనీలు, వ్యాపార సంస్థలు, పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ఎంపెడా విశేష కృషి చేస్తోందని, తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. మత్స్యశాఖ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దమొత్తంలో బ్జడెట్‌ కేటాయించినట్లు తెలిపారు. మత్స్యకారులకు రాయితీతో ద్విచక్ర వాహనాలు, వాహనాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారులకు ప్రధానమంత్రి బీమా సురక్షా యోజన, జనజీవన యోజన అమలు చేస్తున్నామని, చేప విత్తనాలు వంద శాతం రాయితీతో ఉచితంగా అందజేస్తున్నామని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకమైన శ్రద్ద మూలంగా నీటి సదుపాయం ఉన్న ప్రతీ చోట చేపపిల్లలను పెంచాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని అన్నారు. మొదటి సారిగా రాష్ట్రంలో తొమ్మిది ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఫాం కల్చర్‌ను ప్రోత్సహించడం ద్వారా మంచి ఫలితాలు రావటం జరిగిందని అన్నారు. క్రేజ్‌ కల్చర్‌, ఫెన్‌ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి మంచి ప్రగతిలో వెళ్తున్నామని తలసాని పేర్కొన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రోజురోజుకు దేశ ప్రజల ఆహార పద్దతులు మారుతున్నాయని, అందుకు అనుగుణంగా ఉత్పత్తులు పెరగాలని అన్నారు. చేపలు మంచి ఆరోగ్యపు పదార్థమని, చేపలు తీసుకొనేందుకు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అన్నారు. దీనికి అనుగుణంగా చేపల ఉత్పత్తి జరగాలని అన్నారు. తెలుగు రాష్టాల్ల్రో ఆమేరకు చర్యలు జరుగుతుండటం మంచి పరిణామమన్నారు. మరోవైపు తినడమే కాకుండా తిన్నది అరిగి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ వ్యాయామం కూడా చేయాలని వెంకయ్య అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విషయాన్ని వెల్లడించారని, ప్రతీ ఒక్కరూ ఫిట్‌గా ఉండేలా వ్యాయామం చేయాలని సూచించారని అన్నారు. వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారని అన్నారు. ప్రతీ ఒక్కరూ వ్యాయామం, యోగా వంటి వాటితో ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించుకోవాలని వెంకయ్య సూచించారు. యోగా ద్వారా అనేక లాభాలున్నాయని, యోగా అనేది మోడీ కనిపెట్టింది కాదని, అది భారతదేశ సంస్కృతి అని అన్నారు. మోడీ ప్రధానిగా వచ్చిన తరువాత భారత దేశ సంస్కృతి అయిన యోగా ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రాధాన్యత కల్పించారని అన్నారు. ఇప్పుడు మన యోగాను ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయని, మన దేశంలోని ప్రతీ ఒక్కరూ యోగాను రోజు దినచర్యలో భాగం చేసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close