Featuredస్టేట్ న్యూస్

అక్రమ గని దేవికారాణి

  • ఆస్తుల విలువ రూ.200 కోట్లు..!
  • రూ.46 కోట్ల విలువైన ఇండెంట్లు
  • భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం
  • దర్యాప్తులో తేల్చిన ఏసీబీ అధికారులు
  • దేవికారాణి భర్త గురుమూర్తి అరెస్ట్‌

ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఊచలు లెక్కిస్తున్న దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. డొల్ల కంపెనీల వ్యవహారం బట్టబయలు కాగానే అలా వచ్చిన డబ్బులతో తన ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌తో ఎంజాయ్‌ చేసినట్లు తెలుస్తోంది. వేదికలపై డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్‌ చేసింది. అదిరిపోయే స్టెప్పులతో హంగామా చేసింది. డ్యాన్సర్‌తో పోటీ పడి మరీ స్టెప్పులేసింది. అంతేకాకుండా దేవికారాణి నాన్‌ చాక్‌ విద్యను కూడా అభ్యసించింది. మరో ఇద్దరితో కలిసి అద్భుతంగా నాన్‌చాక్‌ను ఆడించింది. ఇక బర్త్‌ డే వేడుకలు అద్భుతంగా నిర్వహించిన వీడియో కూడా బయటకొచ్చింది. అతి కొద్ది మంది సమక్షంలో భారీ కేక్‌ను కట్‌ చేసి సంబరాలు చేసుకుంది. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కేటాయించిన డబ్బులను దోచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవికారాణి తేజా ఫార్మా ఎండీతో కలిసి 8 షెల్‌ కంపెనీలు నెలకొల్పింది. ఈ కంపెల ద్వారా 25 కోట్లకు పైగా మందులు కొనుగోలు చేసినట్లు చూపించింది. 5 కోట్ల విలువైన మందులను పాతిక కోట్లకు కొన్నట్లు తెలిసింది. ఇలా వచ్చిన డబ్బులతోనే దేవికారాణి లగ్జరీ లైఫ్‌ను అనుభవించినట్లు పలు వీడియో ఆధారాలు బయటపడ్డాయి.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్లో దేవికారాణి ఆస్తులు బయట పడుతూనే ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో ఉన్న ఆమె ఆస్తులను గుర్తించారు. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 50 చోట్ల దేవికా రాణి ఆస్తులను గుర్తించగా.. వీటి విలువ రూ. 200 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌ షేక్‌పేట్‌లో రూ.4 కోట్ల విలువైన విల్లా, సోమాజిగూడలో 3 ఫ్లాట్లు, షేక్‌పేట్‌లో ఆదిత్య టవర్స్‌లో మూడు ఫ్లాట్లు, చిత్తూరులో రూ.కోటి విలువైన భవనం, హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలో ఇండిపెండెంట్‌ భవనం, రెండు రాష్ట్రాల్లోనూ 11 చోట్ల ఓపెన్‌ ఫ్లాట్లు, తెలంగాణలో ఏడు చోట్ల 32 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు గుర్తించారు. దేవికారాణి అక్రమాల్లో సహకరించిన ఆమె భర్త గురుమార్తిని ఏసీబీ అదికారులు అరెస్ట్‌ చేశారు. నారాయణగూడలోని ఇండియన్‌ బ్యాంక్‌ లో 34లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మరో 23 బ్యాంకుల్లో కోటీ 23 లక్షల బ్యాలెన్స్‌ ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. 25.72లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, 8.40 లక్షల నగదు, 7లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇన్నోవా కారు, మోటర్‌ బైక్‌ సీజ్‌ చేసిన ఏసీబీ అధికారులు వేర్వేరు చోట్ల రూ.15 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌ లో 100 కోట్లపైగా ఉంటుందని పీఎంజే జ్యువెల్లర్స్‌ కు రూ.7.3 కోట్లు చెల్లించినట్టు ఏసీబీ గుర్తించింది. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కాంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలపుట్ట కదులుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అక్టోబర్‌ 2న ఓమ్నీ సంస్థ ఏజెంట్‌ నాగరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈసోదాలో భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అధికార పత్రాలు, సుమారు రూ.46 కోట్ల విలువైన ఇండెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా రూ.46 కోట్ల మేర విలువైన ఇండెంట్లు ఏజెంట్ల ఇళ్లలో లభ్యం కావడంతో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈఎస్‌ఐ డైరెక్టర్‌ కార్యాలయంలో ఉండాల్సిన ఇండెంట్లు ఏజెంట్‌ నాగరాజు నివాసంలో ఉండటంపై అవినీతి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో ఓమ్నీ మెడి సంస్థ నుంచి భారీగా ఔషధాలు, పరీక్షల కిట్లు ఈఎస్‌ఐ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణితోపాటు పలువురు అధికారులు రిమాండ్‌ లో ఉన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close