మహేష్‌ హీరోయిన్‌ అక్కడ కుమ్మేస్తోంది

0

మహేష్‌ బాబుతో ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో నటించిన కైరా అద్వానీ ఆ తర్వాత తెలుగులో రామ్‌ చరణ్‌ కు జోడీగా ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించింది. ఒక హిట్‌ ఒక ఫ్లాప్‌ తో టాలీవుడ్‌ లో ఈమెకు మంచి గుర్తింపే వచ్చింది. ఇదే సమయంలో ఈమె బాలీవుడ్‌ లో జెట్‌ స్పీడ్‌ తో దూసుకు పోతుంది. సౌత్‌ లో ఎంట్రీ ఇవ్వక ముందు ఈమె పలు చిత్రాల్లో నటించినా కూడా స్టార్‌ డం దక్కించుకోలేక పోయింది. కొన్ని వెబ్‌ సిరీస్‌ లలో కూడా ఈమె నటించింది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఈమె చాలా బిజీ అయ్యింది. ఒక వైపు ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ అయిన కబీర్‌ సింగ్‌ చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు ఆ వెంటనే బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తో రెండు సినిమాల్లో నటించేందుకు సైన్‌ చేసింది. కాంచన చిత్రం రీమేక్‌ లో అక్షయ్‌ కి జోడీగా నటించబోతున్న ఈ అమ్మడు మరో డైరెక్ట్‌ సినిమాలో కూడా అక్షయ్‌ తో రొమాన్స్‌ చేసే అవకాశం దక్కించుకుంది. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా హిందీలో మరో సినిమా సౌత్‌ లో ఇంకో సినిమాను చేసేందుకు కైరా అద్వానీ కమిట్‌ అయ్యింది. హిందీలో స్టార్‌ హీరోయిన్స్‌ పారితోషికంతో పోల్చితే కైరా అద్వానీ పారితోషికం విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో పాటు తక్కువగా ఉంటుందని అందుకే ఈమెను తమ సినిమాల్లో బుక్‌ చేసుకునేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారంటూ బాలీవుడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతానికి కైరా అద్వానీ పారితోషికం ఇతర హీరోయిన్‌ ల పారితోషికంలో సగంకు తక్కువగానే ఉందనే టాక్‌ వినిపిస్తోంది. పారితోషికం తక్కువ తీసుకోవడంతో పాటు స్కిన్‌ షోకు ఏమాత్రం అడ్డు చెప్పకపోవడం నటిగా కూడా మంచి మార్కులు పొందడం వంటి కారణాల వల్ల బాలీవుడ్‌ లో వరుసగా కుమ్మేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here