Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

నగరమా… నరకమా…

చెరువులన తలపిస్తున్న వీధులు..

ఏరులై పారుతున్న రోడ్లు..

ఇండ్లలోకి చేరిన వరద నీరు..

అవస్థలు పడుతున్న నగర ప్రజలు..

వందేళ్ల తర్వాత రికార్డు స్థాయి..

హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తానని చెప్పారు. అన్ని వసతులు, అన్ని హంగులు, ఆర్భాటాలతో దేశంలోని నంబర్‌వన్‌గా, ప్రపంచలోనే అతి గొప్ప నగరంగా మారుస్తామని చెప్పినా పాలకులు ఒక్కసారి వారి ఏసీ రూములు, వారి ఉంటున్న బంగళాలు వదిలి రోడ్డు మీదికొచ్చి చూడాలి.. అసలు ఇదీ మన నాయకులు గొప్పలు చెపుతున్న హైదరాబాద్‌ నగరమేనా అనే అనుమానం కలుగుతోంది. చిన్న చినుకు పడుతే చాలు నగరమంతా నరకంగా మారుతోంది. ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ నాలా ఉందో అర్థం కాక నగర ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో, ట్రాఫిక్‌ సమస్యలతో రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి. నగరంలో అరకిలోమీటర్‌ ప్రయాణానికి గంటలు గంటలు పడుతోంది. మాటలకే హైటెక్‌ నగరంగా చెప్పుకుంటున్న భాగ్యనగరం ఇప్పుడు ప్రతి గల్లీ ఒక చెరువును తలపిస్తోంది. మురికివాడల్లోనే కాకుండా ప్రధాన దారుల్లో ఉన్న భవనాల్లోకి సైతం నీళ్లు వరదలా చొచ్చుకొస్తున్నాయి. నగంరలోని చెరువులన్నీ ఆక్రమించుకోవడం ఉన్న భూమినంతా కాంక్రీట్‌మయం కావడంతో వర్షపు నీరు ఎక్కడికెళ్లాలో తెలియక ప్రధాన ప్రాంతాలు సైతం జలకళతో ఆకట్టుకుంటున్నాయి. అరగంట వర్షానికే ఆగమాగకం అవుతున్న నగరం ఇప్పుడు రోజుల తరబడి కురుస్తున్న వర్షాలకు తల్లడిల్లిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మరీ ఆధ్వాన్న పరిస్థితిగా మారిపోయింది. మన బంగారు తెలంగాణలో పాలకుల పనితీరు ఏలా ఉందో ఇప్పుడు నగరాన్ని చూస్తే అర్థమవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలను లండన్‌లాగా మారుస్తానని చెప్పినా తెలంగాణ నాయకులు రాష్ట్ర రాజధానినే సరియైన దిశగా మార్చాలనే ఆలోచన లేదు. నగరమంతా సముద్రాన్ని తలపిస్తూ నరకంలా కనుబడుతుంటే నాయకులు, అధికార యంత్రాంగం మాత్రం శాశ్వత మరమ్మత్తులు చేపట్టకుండా అప్పటికప్పుడే హడావుడీలు చేస్తూ చేతులు దులుపుకోవడం మన పాలకులకు అలవాటుగానే మారిపోయింది.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

అన్ని రకాలుగా హైదరాబాద్‌ నగరం భద్రతకు, ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉంటుందని చెపుతున్న పాలకులు పనితీరులో మాత్రం అంతా డోల్లగానే కనబడుతోంది. ప్రతి సంవత్సరం నగర అభివృద్ధికి వందల, వేల కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నారు. అప్పటివరకు మాత్రమే తూతూ మంత్రంగా పనులు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు కాని ప్రజల అవసరాలను, భద్రతను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారాలు వెతికే పనిలో మాత్రం ఎవరూ లేరు. గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో ఉంటున్న ప్రజలెంతా భద్రతతో ఉన్నారో ఇప్పటి పరిస్థితులను బట్టి తెలిసిపోతుంది. చిన్న చినుకుపడుతేనే నగరమంతా నగరం గజగజ వణికిపోతుంది. ఎప్పుడు ఏమవుతుందో, ఎక్కడ రోడ్డు తెగిపోతుందో, మ్యాన్‌హోళ్లు పొంగి ఎక్కడ ఏవరు ప్రాణాలు గల్లంతవుతాయో తెలియని పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్ర రాజధాని ఉంది. మన పాలకుల మాటలు మాత్రం కోటలు దాటుతూ పనులు మాత్రం గడప కూడా దాటడం లేదు. బంగారు తెలంగాణలో అంతా బంగారమే చేస్తున్నామని చెపుతున్న పాలనా యంత్రాంగం కనీస రాష్ట్ర రాజధాని విషయంలో కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రతి సంవత్సరం రోడ్ల మరమ్మత్తుకు, మ్యాన్‌హోల నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా ఎక్కడ కూడా సరియైనా శాశ్వతమైనా, సరియైనా చర్యలు చేపట్టడం లేదు.

బయట అడుగుపెట్టాలంటే భయమే..

ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో అడుగుపెట్టాలంటే నగర పౌరుడు భయంతో వణికిపోతున్నారు. చిన్నచినుకులకే డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్‌ పొంగిపోర్లుతున్నాయి. ఎక్కడ నాలా ఉందో, ఎక్కడ గుంత ఉందో తెలియక ప్రతిప్రక్షం భయమే. ఇదివరకు నగరంలో కురిసిన వర్షాలకు ఎంతోమంది పిల్లలు, పెద్దలు నాలాలో కొట్టుకుపోయిన సంధర్బాలు అనేకం ఉన్నాయి. అంతా కాంక్రీట్‌ జంగిల్‌గా పేరుగాంచిన నగరంలో చినుకు పడుతే ఇంకిపోవడానికి అనువైనా వాతావరణం లేకపోవడంతో నీరు అంతా వరదలా ఎక్కడిపడుతే అక్కడే కూరుకుపోతుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో కబ్జారాయుళ్లు చెరువులను కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు. దాని వల్ల నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల చెరువులకు చేరాల్సిన నీరు ఇళ్లలోకి పోతున్నాయి. వాటి ఆవరణలో ఉన్న సైడ్‌ డ్రైనేజీలు పొంగి, మ్యాన్‌హోల్స్‌ నోరు తెరుచుకుంటున్నాయి. అదీ మరీ ప్రమాదకరంగా మారిపోయింది. వారం రోజులు ఏకదాటిగా నగరంలో వర్షాలు కురుస్తే కనుక నగరమంగా మునిగిపోయే ప్రమాదమే ఉంది. ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలు, చెరువులను కబ్జా చేసినవారిపై ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కబ్జారాయుళ్లు పెరిగిపోతున్నారు. దీనివల్ల అంతో, కొంతో ఉన్న చెరువులు అన్ని కాంక్రీట్‌గా మారిపోతున్నాయి. శాశ్వత చర్యలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఆలోచించి పకడ్బందీ చర్యలు తీసుకుంటే మాత్రం నగరాన్ని, నగర ప్రజలను కాపాడిన వారవుతారు.

వందేళ్ల తరువాత కుండపోత వర్షం

మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన కుంభవృష్టి నికి హైదరాబాద్‌ నగరం వణికిపోయింది. ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 101 ఏళ్ల తరువాత కుండపోత వర్షం పడటంతో నాలాలు పొంగిపొర్లాయి. రహదారులు జలంతో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు మునిగాయి. జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. కిలోవిూటర్ల మేర వాహనాలు జామ్‌ అయ్యాయి. రోడ్లపై నిలిచిన నీటిలో ద్విచక్రవాహనాలు మునిగిపోగా, కార్లు అద్దాల వరకు మునిగాయి. 1918 డిసెంబర్‌ తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి. నిన్న రాత్రి 11 గంటల వరకు సికింద్రాబాద్‌ తిరుమలగిరిలో అత్యధికంగా 12.1, ఉప్పల్‌లో 12 సెం.విూల వర్షం కురిసింది. అలాగే అల్వాల్‌, కాప్రా, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌ గూడ, మెహిదీపట్నం, చార్మినార్‌, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, గోషామహల్‌, అంబర్‌పేట్‌, బేగంపేట్‌, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, ముసాపేట్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మరోవైపు నాచారం పోలీస్‌ స్టేషన్‌, సికింద్రాబాద్‌ లాలాగూడ రైల్వే ఆస్పత్రిలోని ఎమ్జ్గం/న్సీ వార్డులోకి కూడా వర్షపు నీరు ప్రవేశించింది. జీహెచ్‌ఎంసీ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపడుతోందని నగర మేయర్‌ బంతు రామ్మోహన్‌ అన్నారు. నగరంలో సహాయక చర్యలను పర్యవేక్షించిన ఆయన… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close