Featuredరాజకీయ వార్తలు

చేయి జారిపోతుంది…

హడావుడీకే కాంగీరేసు పరిమితం…

పట్టుకొల్పతున్న పట్టింపు లేదు…

సీట్లమీదున్న ఆసక్తి క్యాడర్‌ మీద లేదు..

గొప్పలు చెప్పుకోవడానికి ఒకరికంటే ఒకరు ముందే పోటీ పడతారు.. పార్టీ పుట్టకముందు నుంచి నేను తోపునంటా మరీ దూసుకెళ్తారు.. నన్ను మించిన నాయకుడు మా పార్టీలోనే లేడంటారు… అందరికన్నా నేనే సీనియర్‌ నాయకున్ని అంటూ గొప్పలు చెపుతూ మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ. రాజీవ్‌గాంధీ అందరితో అప్పడు మంచి సంబంధాలు ఉన్నాయని మాటల మీద మాటలు చెపుతూ కోటలు కడుతారు… మాటలతోనే వారు గెలిచినంత పనికాదు కదా రాష్ట్రాన్ని పాలించేలా.. విన్నవారికి గుండెపోటు వచ్చేలా ఉంటాయి…. చేసే పని మాత్రం చాలా తక్కువ.. హడావుడీకి చేయడంలో కాంగీరేసు నాయకులను మించిన వారే ఉండరు.. పార్టీ నిర్మాణం.. పార్టీ భవిష్యత్తుపై ఆలోచించే వారు ఒక్కరంటే ఒక్కరూ కూడా ఉండరు.. కొద్దొ, గొప్పో ఆలోచిస్తూ ముందుకు వెళ్లున్నవారిని వెనక్కిలాగే వారు ఆ పార్టీలో లెక్కలేనంత మంది ఉంటారు.. ఉన్న క్యాడర్‌ను కాపాడుకోవడానికి, పార్టీని క్రమశిక్షణగా నడపడానికి వారు పడుతున్న తంటాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు.. వీరు కొట్లాటలు, గొడవలే అధికారపక్షానికి బెల్లంగా మారుతుందనడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు.. ఎవ్వరిని పడితే వారిని ఎప్పుడు పడితే అప్పుడు తమ పార్టీలోకి లాక్కెళ్లుతూ కాంగ్రెస్‌ను రోజురోజుకు బలహీనపరుస్తున్నారు.. ఓడిన క్యాడర్‌ పోతే పోనియ్యి తర్వాత నిర్మించుకోవచ్చు కాని గెలిచిన సీట్లలో ఉన్న కొద్దో, గొప్పొ అభ్యర్థులు కూడా పార్టీ మారుతుంటే కాంగీరేసు అధినాయకత్వం ఇంకేం చేస్తుందో అర్థమై కావడం లేదు… పగ్గాలు బట్టి నడిపించే రథసారధికి పూర్తి అధికారం లేదో, అధికారం ఉన్నా నడిపించడంలో విఫలమవుతున్నారో తెలియడం లేదు.. రోజురోజుకు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలంగాణలో కాంగీరేస్‌ పార్టీ కథ సమాప్తం అయ్యేలా సంకేతాలో ఎక్కువగా కనబడుతున్నాయి… ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జెండా పట్టి జేజేలు కొట్టె క్యాడర్‌ కోసం కాంగ్రెస్‌ అధినాయకులకు వెతుకులాట తప్పేలా లేదు….

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌….

పురాతన చరిత్రగల పార్టీ మాదీ.. ఎన్నో సంవత్సరాల జాతీయ పార్టీ కాంగ్రెస్‌ అని చెపుతుంటారు.. దానికి తోడుగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది. మొదటగా దేశాన్ని పాలించిందీ మా వాళ్లే అంటారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు మా తర్వాతనే అని చెపుకుంటున్న కాంగ్రెస్‌ జాతీయస్థాయిలో ఏలా ఉన్నా తెలంగాణలో మాత్రం దాని పనితనం రోజురోజుకు దారితప్పుతోంది. సుదీర్ఘ పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్ష కోసమంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఇచ్చింది. ఎన్నో సంవత్సరాల పోరాటం ఫలించినందుకు తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్‌కు రుణపడి ఉన్నారని చెప్పకనే చెపుతారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్‌ తెలంగాణలో మాత్రం పార్టీ మనుగడను కాపాడుకోలేకపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత పార్టీగా అవతరించి తెరాస పార్టీగా ఎన్నికల బరిలో దిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించిన కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాత్రం అప్పటి నాయకత్వం విఫలమయిందనే విషయం అందరికి తెలిసిందే. మొదటిసారి జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకుల్లో ఐకమత్యం కొరవడడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించలేదు. కాని ఉద్యమాలు చేసిందీ మేమే, ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిందీ మేమే అంటూ ప్రజల్లోకి కెసిఆర్‌ ఆ నినాదాన్ని బలంగా తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యాడు.. కాంగ్రెస్‌ మాత్రం నాయకత్వం పోరు వల్ల మధ్యలోనే చతికిలపడి పోయి అధికారాన్ని చేజార్చుకుంది. మొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్‌ నాయకుల ఆసమర్థత, నాయకుల ఆధివత్యం వల్లనే అని చెప్పవచ్చు. రెండవసారి ఎన్నికల బరిలోకి దిగిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన అమలుకాని హామీల వల్ల కూడా ప్రజల్లో నమ్మకాన్ని కొల్పోయింది. ఒకనొక సంధర్బంలో తెరాసకు కనీస సీట్లు వస్తాయో, రావో అని అనుకున్న అధినేత కెసిఆర్‌ ప్రతిపక్షం బలహీనతను, కాంగ్రెస్‌లో లేని ఐకమత్యాన్ని ఆయుధంగా చేసుకొని ఆఖండ మెజారిటీ సాధించి మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకున్నారు…

కిందిస్థాయి క్యాడర్‌ కనుమరుగవుతోంది..

తెలంగాణ ప్రజల చిరకాల కోరికను అమలు చేసిన సోనియమ్మకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి బహుమతిగా అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటి ఉన్న నాయకులను కాపాడుకోలేక పోతుంది. అధికారంలోకి రాకముందే నేనే నాయకుడినని, నేనే సిఎంనని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే నాయకులు పనికొస్తున్నారు కాని కిందిస్థాయిలో పార్టీ క్యాడర్‌ను పటిష్టం చేయడంలో మాత్రం విఫలమవుతున్నారని చెప్పవచ్చు. రెండవసారి తెలంగాణఆసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించి అధికారంలోకి రావాలని కలలుగన్న కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం హామీ మేరకు రాష్ట్రంలోని కొన్ని పార్టీలతో కలిసి మహకూటమిగా ఏర్పడి పోటీ చేసింది. రాష్ట్రంలో విజయం మాదేనంటూ ఏలాగైనా అధికారాన్ని చేపడుతామని చెప్పిన కాంగ్రెస్‌ నేతలు కనీస సీట్లను సాధించలేకపోయింది. ఎంతో పురాతన చరిత్రగల జాతీయ పార్టీ కాంగ్రెస్‌ రాష్ట్రంలో అన్ని గెలిచే అవకాశాలు ఉన్న ఎందుకు వెనుకబడిపోతుందో అని మాత్రం ఒక్కరూ సరిగ్గా ఆలోచించలేకపోతున్నట్లు తెలుస్తోంది.. రెండవ సారి ఆసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పందొమ్మిది సీట్లు మాత్రమే సాధించి జాతీయ పార్టీ పరువును తీసుకుంది. జాతీయస్థాయి నుంచి అతిరథ మహరథులు ఎందరొచ్చినా కనీస సీట్లును సాధించలేక పోయింది. ఉన్నవారిలో కూడా ఎప్పుడు ఎటూ వెళతారో, ఎప్పుడు జంప్‌ అవుతారో తెలియని అయోమయ పరిస్థితి కాంగ్రెస్‌లో ఉంది.

క్రమశిక్షణ బత్తిగా కనుమరుగయ్యింది…

కాంగ్రెస్‌ పార్టీలో నాయకులకు కొదవలేదు. అందరూ నాయకులే.. కాని ఎవరి మాట ఎవరూ వింటారో, ఎవరి ఆలోచన ఏలా ఉందో మాత్రం ఎవ్వరికి ఇప్పటికి అర్థమే కాదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ అధిపతులు కావడమే వారి పార్టీ పతనానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పార్టీని ఏకతాటి మీదికి తీసుకొచ్చారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లఘించిన వారందరిపై చర్యలు తీసుకునేవారు. అందుకే రెండు మార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేతి గుర్తు హావా కొనసాగింది. రాజశేఖర్‌రెడ్డి ప్రమాదంలో పోవడంతో మళ్లీ ఎవరికి వారే తాను నాయకులమంటూ, తానే సిఎం అంటూ రెచ్చిపోయారు. క్రమశిక్షణ మాట దెవుడెరుగు కాని ఆధిపత్యం పోరులో పార్టీ ప్రధానంగా కిందికి దిగజారిపోతుంది.. ప్రతి చిన్న విషయానికి డిల్లీ నాయకులపై ఆధారపడడం, రాష్ట్ర నాయకులకంటూ సొంత నిర్ణయాలు లేకపోవడంతో అందరూ అధిష్టానం దృష్టిలో పడడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికి అదే పనిలో నిమగ్నమైన వారు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్‌నే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు ప్రతి రాష్ట్రానికి ఒకరు అధ్యక్షుడుగానో, ఇంచార్జ్‌గానో ఉంటారు. ఆయన ఆలోచనపరంగా, ఆయన చెప్పినట్టే పార్టీ కార్యక్రమాలు సాగుతుంటాయి. సాగుతుండాలి అదీ పార్టీ సిద్దాంతం.. అధ్యక్షుని మాటకు ఎదురుతిరిగే సాహసం ఎవరూ చేయరు. కాని కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం ఆ పద్దతియే లేదు. ఎవరి ఇష్టానుసారం వారిదే రాజ్యంగా నడుస్తూ ఉంటుంది. కిందిస్థాయిలో ఏం జరుగుతోంది. పార్టీ క్యాడర్‌ ఏలా ఉంది. పార్టీ పటిష్ట నిర్మాణానికి ఏలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై చర్చించడం, పార్టీని ఇంకెలా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలు మాత్రం ఇక్కడ నాయకులకు రాదు. ఎవ్వరికన్నా వచ్చిన ఆవిషయాలపై అంత దృష్టి పెట్టరు.. ఎంతసేపటికి పదవులు, బాధ్యతలు అంటూ గొడవపడడానికే ప్రాధాన్యత ఇస్తూ పార్టీని మరింత వెనిక్కితీసుకెళుతున్నారు ఈ నాయకలు…

నాయకులు వల్లనే మారిపోతున్నామంటున్నారు…

తెలంగాణలో జరిగిన రెండవసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటామని చెప్పిన కాంగ్రెస్‌పార్టీ 19 సీట్లు గెలుచుకొని తమ అధిపత్యాన్ని చాటుకొంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందీ మేము, తెచ్చిందీ మేమే అని చెపుతున్న నాయకత్వం ఓట్లను మాత్రం వేయించుకోలేకపోతుంది. కనీస సీట్లను తెప్పించుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్‌పార్టీ క్యాడర్‌ ఉంది. ఎమ్మెల్యెలుగా గెలిచినవాళ్లు, ఓడినవాళ్లైనా పార్టీని పట్టుకొని ఉంటూ రాబోయే ఎన్నికల కోసమైనా మరింత పటిష్టంగా పనిచేస్తున్నారా అంటే అదీ లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు, మూడు రోజులు అవుతుందో, లేదో అధికారంలోకి వచ్చిన పార్టీలోకి మారిపోతున్నారు. గెలుపొందిన స్థానాలను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం ఉంది. తెలంగాణ అధినేత కెసిఆర్‌కు ప్రతిపక్ష నేతగా బరిలో దిగిన కాంగ్రెస్‌ నాయకుడు ఫలితాలు వచ్చి వారం కాకముందే తెరాస పార్టీలో చేరిపోయారు. అంతో కొంతో గొప్పగా సీట్లు వచ్చాయనుకున్న ఖమ్మంలో కూడా పార్టీ మారే కార్యక్రమాలు సిద్దమైపోయాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ మహిళ నాయకురాలిగా పేరుపొందిన చెవెళ్ల చెల్లమ్మ కూడా రేపో, మాపో తెరాసలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధినాయకత్వం కిందిస్థాయి క్యాడర్‌ను కాపాడకోలేకపోతుంది. ఉన్న నాయకులను కాపాడుకోవడంలో విఫలమవుతోంది. బలమైన ప్రతిపక్ష నినాదం వినిపించడంలో వెనుకబడిపోతుంది. ఇంకా ఎందులో ముందు ఉందో వారికి కూడా అర్థం కాని పరిస్థితిలో నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం ఉంది. ఉన్న నాయకత్వాన్ని మార్చి కొత్త యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పుజెప్పి, కిందిస్దాయి నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు క్రమశిక్షణ అలవాటు చేస్తేనే పార్టీ మనుగడ సాధ్యమవుతోంది. లేక ఇంక పదికాదు కదా వంద సంవత్సరాలైనా పార్టీ భవిష్యత్తు కనుమరుగవడమే కాకుండా జెండాలు పట్టుకొవడానికి కూడా క్యాడర్‌ లేని పరిస్థితి వస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close