Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

మిడ్‌ మానేరు నిర్వాసితుల మహా పాదయాత్ర

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీస్‌లు, వేములవాడ పట్టణ కేంద్రం లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నాలుగు కోట్లతో ఇల్లు కట్టుకున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబు నిర్వాసితుల సమస్యలపై పై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. నిర్వాసితుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. చింతకుంట లో ఇంటికి 10 లక్షలు ఇచ్చిన కేసీఆర్‌ సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ముంపు భాదితుల ధర్నాతో స్పందించిన కలెక్టర్‌ కష్ణ భాస్కర్‌ సమస్య పరిష్కారానికి హామీ.

రాజన్న సిరిసిల్ల (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాజన్న సిరిసిల్ల జిల్లా మద్య మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల సాధన కోసం నిర్వాసితుల ఐక్యవేదిక అఖిలపక్షం ఆధ్వర్యంలో మద్య మానేరు నుండి బయలుదేరిన నిర్వాసితులు సిరిసిల్లాలోని కలెక్టర్‌ కార్యలయం ఎదుట తలపెట్టిన బారి ధర్నా కు మద్దతుగా నిర్వాసితులు చేపట్టిన పాద యాత్రకు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ , ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ,బోడిగే శోభ , ఆది శ్రీనివాస్‌ , కెకె మహేందర్‌ రెడ్డిలు మద్దతు పలికి పాదయాత్రలో పాల్గొని కలెక్టర్‌ రేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. మద్య మానేరు నిర్వస్తితుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నిర్వహించి అండగా ఉంటామని ధర్నాలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ముంపు భాదితుల ధర్నాతో స్పందించిన కలెక్టర్‌ క ష్ణ భాస్కర్‌ సమస్య పరిష్కారానికి క షి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ , బోడిగే శోభ రాణి లు మీడియాతో మాట్లాడుతూ … బావి తరాల భవిష్యత్తుకు త్యాగధనులు ముంపు గ్రామాల బాధితులు మద్యమానేరు ప్రజలని , కన్న ఊరును ఉన్న ఇంటిని కన్నీళ్లతో అప్పగిస్తే కనికరం లేకుండా ప్రవర్తిస్తున్న కెసిఆర్‌ కేటీఆర్‌ లు స్పందించకపోవడం విడ్డూరంగా ఉన్నదని, వేములవాడ రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకం కింద ప్రతి నిర్వాసిత కుటుంబానికి 5లక్షల నాలుగువేల రూపాయలు మంజూరు చేయ్యకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్‌ , కెసిఆర్‌ లు 2009 తెలంగాణ ఉద్యమ సమయం నుండి నిర్వాసితులకు అండగా ఉంటానంటూ నమ్మిస్తూ మోసం చేస్తున్నరని , మల్లన్న సాగర్‌ నిర్వాసిత కుటుంబాలకు ఇచ్చిన ప్రతి హామీని మద్య మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే ప్రకటించాలని డీమాండు చేశారు. తన సొంత గ్రామం అమ్మ గారి ఊరు చింతమడక పై ప్రేమను తన అర్ధాంగి అత్తగారి ఊరు కొదురుపాక పై చూపాలని అన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ తన సభ్యులకు దక్కిన మాదిరిగానే ప్రతి పరిహారం ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన యువతీ యువకులందరికీ దక్కేలా ముఖ్యమంత్రి కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చొరవ చూపి ముంపు గ్రామాల బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని అన్నారు. 2015లో ముఖ్యమంత్రిగా వేములవాడ రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీ 2019 చివరి నాటికి 18 ఏళ్లు దాటిన యువతీ యువకులకు దక్కేలా రెండు లక్షల రూపాయలతో పాటు ఇంటి స్థలం కేటాయించాలని , కొత్త గెజిట్‌ జాబితా జారీ చేసి పరిహారం లభించని ప్రతి ఒక్కరికి పట్టా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డీమాండ్చేశారు.గత 13 సంవత్సరాలుగా మద్య మానేరు నిర్వాసితుల కష్టాలను కెసిఆర్‌ కేటీఆర్‌ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు . ముంపు గ్రామాల యువకులకు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి కాకుండా వివిధ ప్రభుత్వ ఔట్సోర్సింగ్‌ కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు కల్పించి ముంపు గ్రామాల ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలని అన్నారు. .ముంపు భాదితుల ధర్నాతో స్పందించిన కలెక్టర్‌ క ష్ణ భాస్కర్‌ సమస్య పరిష్కారానికి క షి చేస్తామని హామీ ఇచ్చారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close