కాశ్మీర్‌లో సమాధి అబద్ధం

0

జీసెస్‌ క్రీస్తు కాశ్మీర్‌ వచ్చి ఇఖ్కడే మరణిం చినట్లు, ఆయన తల్లి సెయింట్‌ మేరీ (మేరీమాత, మరియమ్మ) పాకిస్థాన్‌ లో మరణించినట్లు, వారి సమాధులు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని న్యూలైఫ్‌ మినిస్ట్రీస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకులు శ్యాంసన్‌ రాజ్‌ తీవ్రంగా ఖండించారు. జీసెస్‌ భారత్‌ వచ్చాడనే ప్రచారం 1920 నుంచి స్వార్థ పరులు ప్రారంభించారని, 1945 డిసెంబరున మహమ్మద్‌ ఆలీ సమ్మాన్‌ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని సారవంతం చేసుకోవడానికి మెత్తటి మట్టి కోసం నాగ్‌ హమ్మడి పట్టణం చేరువలో ఉన్న జబల్‌ అల్‌ తరిఫ్‌ అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో 13 పేపిరస్‌ తో తయారుచేయబడిన పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్‌ గాస్పెల్స్‌ అని అంటారు. కోప్టిక్‌ అనే ఈజిప్టు భాషలో వ్రాయబడినవి. ఇవి క్రీస్తు శకం 350 – 400 సంవత్సరాల మధ్య వ్రాయబడినవని పరిశోధకుల ఊహలేనని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ పుస్తకాలు ప్రధానంగా ఇప్పుడున్న బైబిల్‌ గ్రంథానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏసు క్రీస్తుకు మహిమ శరీరమే గాని భౌతిక శరీరం లేదు కనుక శిలువ మరణం అబద్ధమని, ఏసుక్రీస్తుకు మగ్దలేని మేరితో వివాహం అయ్యిందని, వివాహాన్ని పరిత్యజించి జీవితమంతా కన్యలుగాలేదా బ్రహ్మచారులుగా ఉండాలని చెబుతాయి. క్రీస్తును విశ్వసించడం వల్ల మోక్షం లభించదు కాని నిగూఢమైన అనుభవం ద్వారా గాని లేదా ప్రత్యేకమైన తదాత్మయం చెందడం వల్ల గాని లభిస్తుంది అని చెబుతాయి. ఇవి అన్నీ అసలైన క్రైస్తవ బోధనలకు విరుధ్దం. కనుక ఈ గ్రంథాలు ‘చర్చి’ వారిచే ఆమోదింపబడని క్రైస్తవ గ్రంథాలుగా మిగిలిపోయాయి. వీటిని కొన్ని దేశాలు రద్దు చేశాయి. ఏది ఏమైనా సమస్త మానవాళి దుఖాలు లేకుండా సంతోషంగా ఉండాలని, ఆందరూ ఆ కోవలోనే జీసెస్‌ జన్మదిన వేడుకలను అధ్భుతంగా జరుపుకుంటారని, ప్రతి క్రైస్తవు సోదరులు ప్రపంచశాంతి కోరుకుంటారని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here