మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

పురపాలికల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందు కు అన్ని మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికల నిర్వహణ విభాగాలను ఏ ర్పాటు చేయనున్నారు. ఓటర్ల జాబి తా, కుల గణన, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, రిజర్వేషన్ల అమలు, నామినేషన్ల పక్రియ, ఓటర్ల లెక్కింపు అంశాలపై ఆ విభాగాలు పనిచేయనున్నాయి. ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 72 మున్సిపాలిటీలు ఉండగా వాటికి తోడు ప్రభుత్వం మరో 71 కొత్తవి ఏర్పాటు చేసింది. పాతవాటితో పాటే కొత్త మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వార్డులు విభజన పూర్తి చేశారు. వార్డుల రిజర్వేషన్ల ప్రకటన మాత్రమే మిగిలింది. వాటిని పూర్తి చేయాలంటే ముందు ఓటర్ల కుల గణన చేపట్టాలి. పురపాలికల్లో ఈనెల 23 నుంచి ఓటర్ల కుల గణన ప్రారంభం కానుంది. చైర్‌పర్సన్‌, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లు అమలు చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ ఓటర్ల లెక్కింపునకు షెడ్యూలు విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా ఈ నెల 23 నుంచి 29 దాకా మున్సిపాలిటీ యంత్రాంగం ఇంటింటి సర్వే చేయనుంది. ఓటర్ల సర్వే ఈనెల 30, 31 తేదీల్లో ప్రకటించనున్నారు. జనవరి 2 నుంచి 4 దాకా రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఫిర్యాదులపై వచ్చే నెల 5, 6 తేదీల్లో అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. 7న మహిళా ఓటర్ల సంఖ్యను లెక్కించనున్నారు. 9న వర్గాల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శించి తుది జాబితాను జనవరి 10న ప్రభుత్వానికి పంపించే విధంగా పురపాలిక అధికారులు ప్రణాళిక రూపొందించారు.

మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లు జనవరి నెలలో కొలిక్కి రానునన్నాయి. జనవరి 10 వరకు కొత్త, పాత మున్సిపాలిటీల్లో ఓటర్ల, కుల గణన పూర్తికానుంది. అనంతరం 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలను పరిగణలోకి తీసుకొని చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ప్రకటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. మునిసిపాలిటీ స్థాయిలో వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న అధ్యక్షులు, కౌన్సిలర్ల రిజర్వేషన్లు పూర్తిగా మారనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here