బిజినెస్

విద్యుత్తు వాహనాలదే భవిష్యత్తు

న్యూఢిల్లీ: 2020 తర్వాత నుంచి డీజిల్‌ ఇంజిన్లకు గిరాకీ తగ్గుతుందని బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ ఏజెన్సీ ఫైనాన్స్‌ ఒక సర్వేలో పేర్కొంది. అదే సమయంలో విద్యుత్తు వాహనాలకు డిమాండ్‌ పెరగనుంది. ఎటువంటి రాయితీలు లేకుండా మిగిలిన కార్లతో పోటీపడే స్థాయికి ఈవీలు 2024కు చేరుకొంటాయని పేర్కొంది.

బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి.. అనే సామెత డీజిల్‌ ఇంజిన్లకు అతికినట్లు సరిపోతుంది. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ డీజిల్‌ ఇంజిన్లకు స్వస్తి పలకనున్నట్లు గత నెలలో ప్రకటించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే మరో దిగ్గజ సంస్థ టాటా మోటార్స్‌ కూడా డీజిల్‌ ఇంజిన్‌ చిన్నకార్లను త్వరలోనే నిలిపివేయనున్నట్లు సమాచారం. మైలేజీ, ధరల పరంగా చూస్తే పెట్రోల్‌ కంటే డీజిల్‌ మెరుగ్గా కనిపిస్తోంది. కానీ, ఒక్కసారి దేశంలోని దిగ్గజ సంస్థలు డీజిల్‌ ఇంజిన్లకు ఎందుకు దూరమవుతున్నాయనే సందేహం సామాన్యూడిని పీడిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కోట్ల మంది డీజిల్‌ కార్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఇప్పుడు వీటి భవిష్యత్తు ఏమిటనే సందేహాలు తలెత్తున్నాయి. నిపుణులు మాత్రం భవిష్యత్తు పెట్రోల్‌, విద్యుత్తు కార్లదే అని చెబుతున్నారు. పరిశుద్ధ ఇంధనాలకు పెరుగుతున్న ఆదరణ కూడా డీజిల్‌ ఇంజిన్ల అద శ్యానికి కారణమవుతోంది.

డీజిల్‌ ఇంజిన్ల స్వస్తికి కొన్ని కారణాలు..:

ప్రభుత్వం, న్యాయస్థానాలు కాలుష్యం విషయాన్ని తీవ్రంగా తీసుకొంటున్నాయి. చాలా పట్టణాల్లో కాలుష్యం పతాక స్థాయికి చేరింది. దీంతో డీజిల్‌ ఇంజిన్ల వినియోగానికి అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది నుంచి భారత్‌- నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతోపాటు ఉద్గారాలకు సంబంధించి కఠిన నిబంధనలు 2022 నుంచి అమల్లోకి వస్తాయి. అదే సమయంలో రియల్‌ డ్రైవింగ్‌ ఎమన్షన్‌ పరీక్షలను కూడా అమలు చేయనున్నారు. ఈ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌ తయారు చేయాలంటే పరిశోధనలపై భారీగా పెట్టుబడి పెట్టాలి. ఫలితంగా డీజిల్‌ ఇంజిన్ల తయారీ ఖర్చు రూ.1.25లక్షల నుంచి రూ.1.5లక్షల వరకు పెరగనున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ కార్ల మధ్య రూ.2.5లక్షల వరకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిన్న కార్ల వినియోగదారులు పెట్రోల్‌ లేదా సీఎన్‌జీ కార్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా..:

భారత్‌లో కనుక చిన్న కార్ల మార్కెట్‌ వ ద్ధి చెందితే దాని ప్రభావం ప్రపంచ స్థాయి కంపెనీలపై కూడా ఉంటుంది. ఏటా మన దేశంలో దాదాపు 30లక్షల కార్లను కొనుగోలు చేస్తారని అంచనా. వీటిల్లో మూడొంతులు చిన్నకార్లే. ఫలితంగా భారత్‌లో కార్లను విక్రయిస్తున్న విదేశీ సంస్థలు కూడా పెట్రోల్‌, సీఎన్‌జీ, హైబ్రీడ్‌ మోడళ్లపై భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

కాలుష్యంపై ఆందోళన..:

కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళన కూడా డీజిల్‌ ఇంజిన్లకు స్వస్తి పలికేందుకు కారణమైంది. ప్రపంచ వ్యాప్తంగా 3,000 పట్టణాల్లో గ్రీన్‌ పీస్‌ అండ్‌ ఎయిర్‌ విజువల్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో తొలి 30 అత్యంత కాలుష్య పట్టణాల్లో 22 భారత్‌లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దిల్లీలో కాలుష్యాన్ని అడ్డుకొనేందుకు అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగడం డీజిల్‌ కార్ల డిమాండ్‌ పై ప్రభావం చూపింది. దీంతో గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కూడా పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాలపై నిబంధనలు విధించింది. ప్రభుత్వం కూడా దేశంలో విద్యుత్తు, సీఎన్‌జీ వాహనాల తయారీని ప్రొత్సహించే వాతారణాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొంది. దీనిలో భాగంగా 2030 నాటికి 10వేల సీఎన్‌జీ పంపులను ప్రారంభించనుంది. దీంతోపాటు ఎల్‌ఎన్‌జీ ఆధారిత వాహనాలను ప్రోత్సహించనుంది. మరోపక్క ఫోక్స్‌ వ్యాగన్‌ ఉద్గారాల కేసు తర్వాత డీజిల్‌ ఇంజిన్లపై నిఘా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిబంధనల అమల్లో ఏమాత్రం తేడా వచ్చినా భారీగా జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కంపెనీలు కూడా డీజిల్‌ ఇంజిన్ల వైపు మొగ్గు చూపడంలేదు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close