Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

భూటాన్‌ భవిష్యత్తు యువత చేతిలో ఉంది

థింపూ: రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌లో ఉన్న ప్రధాని మోదీ ఆదివారం ఆ దేశ రాజధాని థింపూలోని రాయల్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. భూటాన్‌-భారత్‌ ప్రజల మధ్య ఎంతోకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తుచేశారు. దీంతో ఇరు దేశాల చరిత్ర, సంస్కతి, సాంప్రదాయాలు దఢంగా మారాయన్నారు. భూటాన్‌ భవిష్యత్తు యువత చేతిలో సురక్షితంగా ఉందన్నారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యత వారిపైనే ఉందని గుర్తుచేశారు. ఈ ఆధునిక ప్రపంచంలో యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని.. వాటన్నింటినీ ఒడిసిపట్టుకోవాలని సూచించారు. తద్వారా భవిష్యత్తు తరాలకు పునాదులు వేయాలన్నారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రతి సవాల్‌కి యువకులు వినూత్న పరిష్కారాలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్కడి ప్రజల ఆప్యాయతతో పర్యాటకులు పులకించి పోతున్నారన్నారు. శుక్రవారం తనని చిరునవ్వుతో చిన్నారులు దారిపొడవునా స్వాగతం పలికిన తీరు తనని ముగ్ధుణ్ని చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత్‌లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు జరుగుతున్నాయని మోదీ తెలిపారు. భారత్‌లో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉందని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం గురించి వివరించారు. తాను రాసిన ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్తకంపై బుద్ధుని బోధనల ప్రభావం ఎంతగానో ఉందన్నారు. తమకంటూ ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని నిర్మించుకునే క్రమంలో భూటాన్‌కు చెందిన యువ శాస్త్రవేత్తలు భారత్‌కు రానుండడం సంతోషకరంగా ఉందన్నారు. భూటాన్‌ చేపట్టే ప్రతి పనిలో భారతీయులు అండగా ఉంటారన్నారు. డిజిటల్‌, అంతరిక్ష రంగం నుంచి విద్యా రంగం వరకు అన్నింట్లో సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రసంగం అనంతరం మోదీ థింపూలోని ఆ దేశ దివంగత నేత డ్రక్‌ గ్యాల్పో స్మారకం వద్ద నివాళులర్పించారు. రెండోసారి ప్రధాని అయిన తర్వాత భూటాన్‌లో తొలిసారి పర్యటిస్తున్న మోదీ.. శనివారం అక్కడ 740 మెగావాట్ల మాంగ్‌దెఛు జలవిద్యుత్‌ కర్మాగారాన్ని ప్రారంభించారు. చారిత్రక సింటోఖా కోటలో భూటాన్‌ ప్రధాని లోటే థేర్సింగ్‌తో ఆయన చర్చించారు. అంతరిక్ష పరిశోధన, ఐటీ, విద్యుత్‌, విద్య లాంటి రంగాల్లో ఇరుదేశాల మధ్య 10 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రూపే కార్డును భూటాన్‌లో మోదీ ఆవిష్కరించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close