దేశంలో తొలి వీడియో మాట్రిమోనియల్‌… దిల్‌కే రిస్తే సైట్‌ ప్రారంభం…

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో ఆధారిత మాట్రిమోనియల్‌ సైట్‌ను రూపొందించారు. ఆదిదేవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. ఇంటర్‌నెట్‌ వాడకం విస్తృతి ఓ వైపు పెరుగుతుండటం, మరోవైపు తక్కువ ధరలో మొబైల్‌ డాటా అందుబాటులోకి రావడం, సెల్‌ఫోన్ల ధరలు పెద్ద ఎత్తున తగ్గిపోవడం వంటి పరిణామాల వల్ల ప్రజలు తమ జీవిత భాగస్వామ్యుల కోసం ఆన్‌లైన్‌ మాధ్యమంలో అన్వేషిస్తున్న ధోరణి రోజురోజుకు పెరిగిపోతుంది. వారి అవసరాలను తీర్చడంలో భాగంగా వీడియో బయోడేటా మాట్రిమోనియల్‌ ప్రొఫైల్స్‌ దిల్‌కే రిస్తే అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా దిల్‌కే రిస్తే వ్యవస్థాపకులు సురేశ్‌ నాయర్‌ మాట్లాడుతూ కెపిఎంజీ, గూగుల్‌ అధ్యయనాల ప్రకారం, దాదాపుగా 43 మిలియన్ల మంది ప్రజలుతమ జీవిత భాగస్వామ్యుల కోసం మాట్రిమోనియల్‌ సేవలపై ఆధారపడుతున్నారు. మొత్తం ఇంటర్నెట్‌ వాడకం దారుల్లో వీరి సంఖ్య 11శాతం. జాతీయ గణాంకాల ప్రకారం, దాదాపుగా 69శాతం పురుషులు, 31శాతం మహిళలు పెళ్లి సంబంధాల వెబ్‌సైట్లను తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ సైట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. దిల్‌కే రిస్తే. కామ్‌లో రిజిస్టర్‌ చేసుకోవడం చాలా సులభం. ఈ సైట్లో నమోదు చేసుకునేవారు తమ వీడియోను వెబ్‌కామ్‌ లేదా మొబైల్‌ కెమెరా లేదా ప్రోఫెషనల్‌ సర్వీస్‌ను పొంది తమ యొక్క ప్రొపెల్‌ను రూపొందించి వెబ్‌సైట్‌లో పొందవర్చవచ్చని తెలిపారు. వీడియోకాలింగ్‌ సమయంలో నంబర్‌ కనిపించకపోవడం, ప్రొపెల్‌ లింక్‌ షేరింగ్‌కు నియమిత కాలం వ్యవధి, ఆన్‌లైన్‌ కుండలి మరియు జాతకచక్రం పరిశీలించుకోవడం వంటి పలు అంశాలు ఉన్నాయన్నారు. మా వెబ్‌సైట్‌ ద్వారా సరైన వ్యక్తిని, ఎలాంటి సమస్యలు లేకుండా వారిని కలుసుకోవడం సాధ్యపడుతుందన్నారు. రాబోయె రెండు నెలల కాలంలో దక్షిణాదిలోని ఇతర నగరాలకు సంస్థ తన కార్యకలాపాలను విస్తరిస్తుందన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here