నేడు బీజేపీ తొలి జాబితా

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎన్ని కల్లో దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ సీట్ల ఖరారుపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు వనివారం తెలంగాణలో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించ నుంది. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో తయారీపై పూర్తిగా సిద్ధమైనట్లు సమాచారం. రెండు రోజుల పాటు వరుసగా ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ కూడా సమావేశమైంది. ఈ కమిటీలో దాదాపు 10 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి మొదటి విడత అభ్యర్థుల జాబితాను తయారు చేసే అవకాశముంది. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపనున్నారు. దీన్ని బీజేపీ అధిష్టానం పరిశీలించి శనివారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో ముందుగా పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ తిరిగి ముషీరాబాద్‌ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంబర్‌పేటనుంచి కిషన్‌ రెడ్డి, గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌, కల్వకుర్తి నుంచి ఆచారి,ఆందోల్‌ నుంచి బాబూమోహన్‌ తదితరుల పేర్లు బలంగా వినపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో అమిత్‌ షా సమక్షంలో పరిపూర్ణానంద బీజేపీలో చేరబోతున్నారు. ఇకపోతే గెలుపుపై బజిఎపిలో ధీమా కనిసిస్తోంది. అసోం, త్రిపుర తరహాలోనే తెలంగాణలోనూ భాజపా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్‌యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సుస్థిర పాలన బిజెపికి మాత్రమే సాధ్యమన్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో ఇప్పటికె కేసీఆర్‌ చెప్పలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో పార్టీని విస్తరించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని.. అందువల్ల తెలంగాణ ద్రోహులు, అవకాశవాదులతో కలవకుండానే పోటీలోకి దిగుతున్నామ న్నారు. దీనికితోడు యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుందన్నారు. వారంతా ఉత్సాహంగా బరిలోకి దిగేందుకు వస్తున్నారని అన్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసి.. తెలంగాణ అమరవీరులకు ద్రోహం చేస్తున్న తెరాసకు గట్టిగా బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాజపా చిత్తశుద్ధితో పనిచేసిందని, తాము ఒకే మాట విూద నిలబడిందని తెలిపారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినట్లుగానే.. తెలంగాణ అభివృద్ధిలోనూ ముందుంటామ న్నారు. కాంగ్రెస్‌, తెరాస ప్రభుత్వాల వైఫల్యాలను గ్రామాల్లో ఎండగడతామన్నారు. తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యమని.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఆశించిన ఫలితాలు వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్తవారిని ఎక్కువ మందిని బరిలోకి దింపే ఛాన్స్‌ ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here