Featuredజాతీయ వార్తలు

సెప్టెంబర్‌ నాటికి తొలి విమానం : నిర్మల

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ నేతలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు ఒకటి మాట్లాడితే.. పార్టీ ప్రతినిధి మరొకటి మాట్లాడతున్నారని విమర్శించారు. రాఫెల్‌ డీల్‌పై మాట్లాడే ముందు కాంగ్రెస్‌ నేతలు ¬ం వర్క్‌ చేసుకోవాలని, అప్పుడే అవగాహన కలుగుతుందని సూచించారు. రాఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి శుక్రవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ విమానాల కొనుగోలుకు సంబంధించి వివరణ ఇచ్చారు. భారత్‌ కొనుగోలు చేసిన తొలి రఫేల్‌ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని, మిగిలిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు 2022 నాటి కల్లా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం పూర్తవడానికి 14నెలల

సమయం పట్టిందన్నారు. డిఫెన్స్‌ డీలింగ్స్‌కు.. డీలింగ్‌ ఇన్‌ డిఫెన్స్‌కు తేడా ఉందని వ్యాఖ్యానించారు. తాము డిఫెన్స్‌ డీలింగ్స్‌ చేయమని అన్నారు. దేశ భద్రతను, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకునే ఒప్పందాలు చేసుకుంటామని అన్నారు. పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్‌లు రక్షణ సంబంధ విషయాల్లో దూకుడుగా ఉంటే, అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేవలం 18యుద్ధవిమానాలను మాత్రమే కొనుగోలు చేసి, భారత్‌ను ఎటూ కదల్లేని స్థితికి తెచ్చిందని ఆరోపించారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో తగిన సామగ్రిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే దీన్ని అత్యవసరంగా గుర్తించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో నిర్మలా సీతారామన్‌ వారికి గట్టిగానే చురకలంటించారు. తన సమాధానం వినేందుకు కూడా ప్రతిపక్ష సభ్యులు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, యుద్ధ విమానాల కొనుగోలు దేశ భద్రతకు సంబంధించిన విషయమని అందరు గుర్తుంచుకోవాలన్నారు. ‘ఏ ఏ(అనిల్‌ అంబానీని ఉద్దేశిస్తూ)’ కోసమే యుద్ధ విమానాల కొనుగోలు చేశామని కాంగ్రెస్‌ భావిస్తే, ప్రతి ‘ఏఏ’ వెనుక ఒక ‘క్యూ(ఖత్రోకీని ఉద్దేశిస్తూ)’, ‘ఆర్‌వి(రాబర్ట్‌ వాద్రాను ఉద్దేశిస్తూ)’ ఉన్నారంటూ నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

‘రఫేల్‌ విూ హక్కు. దాన్ని విూరే తయారు చేయాలి అని బెంగళూరు హెచ్‌యూఎల్‌ వద్ద జరిగిన ఓ

కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. హెచ్‌ఏఎల్‌కు ఎందుకు ఇవ్వలేదో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలని, హెచ్‌ఏఎల్‌ గొప్పలే కాదు, లోపాలనూ గుర్తించాలన్నారు. తేజస్‌ విషయంలో హెచ్‌ఏఎల్‌ వేగంగా పనిచేయలేదన్నారు. హెచ్‌ఏఎల్‌ విషయంలో కాంగ్రెస్‌ మొసలికన్నీరు కారుస్తోందని విమర్శించారు. తాము హెచ్‌యూఎల్‌కు రూ.లక్ష కోట్ల ఒప్పందాలు అప్పగించామన్నారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకోకుండా.. కాంగ్రెస్‌ రాఫేల్‌ అంశంపై రాద్ధాంతం చేస్తోందన్నారు. భారత్‌ చుట్టు ఉన్న వాతావరణం అత్యంత సున్నితంగా ఉందని, భారత్‌ శాంతిని కాంక్షిస్తుందని, కానీ సైనిక దళాలు నిరంతం అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి ఉందని, సరైన సమయంలో ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని సీతారామన్‌ తెలిపారు. 2004 నుంచి 2015 వరకు చైనా సుమారు 400 విమానాలను తన అమ్ములపొదిలో చేర్చుకుందని, పాకిస్థాన్‌ కూడా తన వైమానిక దళాన్ని రెండింతలు చేసిందని, ప్రస్తుతం భారత్‌లో కేవలం 32 స్క్వాడ్రన్ల బలం మాత్రమే ఉందని మంత్రి తెలిపారు. ఆయుధాల అవసరాన్ని గుర్తించాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు. 36వ రాఫేల్‌ 2022లో డెలివరీ అవుతుందని మంత్రి చెప్పారు. రక్షణ వ్యవస్థను, రక్షణ వ్యవహారాలను చూడాల్సిన తీరు భిన్నంగా ఉంటుందన్నారు.

యూపీఏ హయాంలో ఒప్పందంలో అనేక లోపాలు..

రాఫెల్‌ యుద్ధ విమానాల కోసం యూపీఏలో జరిగిన ఒప్పందంలో అనేక లోపాలున్నాయని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దేశ రక్షణ కంటే వారికి ఖజానా రక్షణెళి ముఖ్యమైందని విమర్శించారు. అయితే తమకు మాత్రం జాతీయ రక్షణెళి తొలి ప్రాధాన్యత అని చెప్పారు.  అసలు నాడు దసో, హెచ్‌ ఎఎల్‌ మధ్య ఎటువంటి ఒప్పందం కుదరలేదని చెప్పారు. హెచ్‌ ఎఎల్‌ ద్వారా భారత్‌ లో 108 యుద్ధ విమానాల తయారీకి దసో గ్యారంటీ ఇవ్వలేదని నిర్మలాసీతారామన్‌ అన్నారు. ఆ వాస్తవాలను విస్మరించి ఇప్పడు కాంగ్రెస్‌ హెచ్‌ ఎఎల్‌ కోసం మొసలి కన్నీరు కారుస్తున్నదని విరుచుకుపడ్డారు. వాస్తవానికి హెచ్‌ఎఎల్‌ కు అంత సామర్ధ్యం లేదని అన్నారు. కాంగ్రెస్‌ హెచ్‌ఎఎల్‌ గొప్పల్ని చెబుతోంది తప్ప లోపాల్ని ప్రస్తావించడం లేదని విమర్శించారు. హెచ్‌ఎఎల్‌ ఏడాదికి కేవలం 8 తేజస్‌ విమానాల్ని మాత్రమే తయారు చేయగలదని సీతారామన్‌ అన్నారు. 45 విమానాలకు ఆర్డరిస్తే హెచ్‌ఎఎల్‌ కేవలం 8 విమానాలను తయారు చేసిందని పేర్కొన్నారు.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close