Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలు

రైతు భీమా వివరాలు సరి చూసుకోవాలి

కౌడిపల్లి ఆదాబ్ హైదరాబాద్. రైతు బీమాకు సంబంధించి కౌడిపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు.గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామ సభ లోరైతు భీమా కు సంబంధించిన విషయాలు  వ్యవసాయ అధికారి పద్మావతి సవివరంగా తెలియజేశారు.  కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతు బీమా 2019 కి సంబంధించి మూడు రకాల లిస్టులను గ్రామలలో అంటించడం జరిగింది అని, రైతు బీమా 2018లో నమోదు చేయించుకున్న వారి ఎల్ఐసి ఐడితో సహా, ఎల్ఐసి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందని, ఇందులో ఏదైనా నామిని మార్పు చేసుకోవాలన్న, ఆధార్ తప్పు ఉన్న వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను వ్యవసాయ కార్యాలయంలో ఇచ్చి సరిచేసుకోవాలి  అని అన్నారు. అర్హత లేని వారి డాటాను కూడా గ్రామాలలో ఇవ్వడం జరిగిందని, ఎవరైనా అర్హులు ఉంటే ఆ వివరాలు సరిచూసుకొని, దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలని, వారిని రైతు బీమా కింద నమోదు చేస్తామని అని ఆమె అన్నారు. అదేవిధంగా  కొత్తగా పట్టా పాస్బుక్కులు వచ్చి నమోదు చేసుకొని వారి లిస్టు కూడా ఇవ్వడం జరిగిందని, ఆ లిస్టు  చూసుకొని 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న వారు ,సంబంధిత ధ్రువీకరణ పత్రాలు వ్యవసాయ కార్యాలయంలో ఇవ్వాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటిలింగం,వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్,ఎటిఎం నరేందర్, పంచాయతీ సెక్రటరీ ఓం ప్రకాష్, ఉప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు రెడ్డి రాజు,నాయకులు చిన్న చిన్నంరెడ్డి, పిసికేశెట్టయ్య,కారోబర్ ఎల్లం,గ్రామస్తులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close