Featuredరాజకీయ వార్తలు

తోక పార్టీల డాంబికాలు

– ఉమ్మడి మ్యానిఫెస్టో ఎక్కడ?

– గట్టిగా 12 సీట్లకైనా పోటీ చెయ్యని పార్టీల హామీలు ఎలా నిలబెడతాయి..?

– రెండు లక్షల రుణమాఫీ బడా రైతులకా, బక్క రైతులకా..!

– ప్రభుత్వంలోకి రాని పార్టీల మాటలు మాయ కాక మరేమిటి?

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ప్రజలను ఐదేళ్ళపాటు ఘనంగా పాలిస్తామంటూ.. తమ గొప్పలను గుట్టలుగా పోసి కొండలెక్కలు చల్లగా చెప్పే ఆర్థిక కోణంలో ప్రచురించేదే… మ్యానిఫెస్టో. ఇవి కాస్తా మాయఫెస్టోలుగా మారి వెక్కిరిస్తున్నాయి. ‘గంజికి లేనోడు బెంజ్‌ కారు కొన్నట్లు’ ఉంది మన పార్టీల పరిస్థితి.

తోక పార్టీల దయనీయం:

సిపిఐ, మజ్లీస్‌, తెజస, తెలుగుదేశం పార్టీలు తమస్థా యిలో మ్యానిఫెస్టోలు విడుదల చేశాయి. అయితే ఈ పార్టీలు ఇచ్చిన హావిూలను అమలు చేయాలంటే తెలంగాణ అసెంబ్లీలో 119 గానూ… 60 సీట్లు గెల వాలి. ఈ పార్టీలు పోటీ పడేది…మాత్రం తెలుగుదేశం 12, తెజాస, సిపిఐ, మజ్లీస్‌లు ‘సింగిల్‌ డిజిట్‌’ దాటని పార్టీలు. ఇవి తయారుచేసిన మ్యానిఫెస్టోలు ఎలాగూ అమలు కావు. ఈ తోక పార్టీలు మాత్రం తమ మ్యాని ఫెస్టోలలో ‘మాటలు కోటలు ఎక్కించి కోట్లు’ దాటించా యి. మూస పద్దతులను పాటించక పోవడంతో ఏ పార్టీ మ్యానిఫెస్టోలో కొత్తదనం లేకుండా పోయింది.

ఆర్థిక నిపుణులు ఎక్కడ.?:

గత ఎన్నికల అన్ని పార్టీల మ్యానిఫెస్టోలు ముందేసుకొ ని అదనంగా కొంత మొత్తం కలిపి కొత్త పెళ్ళికూతురు గా తయారు చేసి ముద్రణకు పంపుతారు. కాని ఏ ఆర్థిక నిపుణులను సంప్రందించలేదని తెలుస్తోంది.

కాంగీ.. కొంత నయం:

కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో వ్యవహారంలో ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిన

ఓ ఇద్దరిని పెట్టుకుంది. వరంగల్‌ జిల్లాకు చెందిన మల్లాది పవన్‌ ఈ విషయంలో కొంత కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈనెల 23న మేడ్చల్‌ బహిరంగసభలో సోనియా గాంధీ చేతుల విూదుగా కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నది. ఈ పార్టీ రైతులకు రెండు లక్షల రుణం రద్దు చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. రెండు లక్షల అప్పు అవసరమయ్యేది భూస్వాములకే తప్ప.. బక్క రైతులకు కాదు. కనుక ఈ ప్రతిపాదన ధనస్వాములకే మేలుచేస్తుందనే విమర్శలు అప్పుడే వినబడుతున్నాయి.

గులాబీ చందా…116/-: కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలకు తెరాస.. మరో 116/- చందాలుగా చేర్చి నగదు బదిలీ పథకానికి ఇంద్రధనుస్సు చుట్టింది. మిగుల బడ్జెట్‌ ను 1,80,238 కోట్ల అప్పుల్లోకి నెట్టింది. మరిష ఇప్పుడు చేపుతున్న కారు మ్యానిఫెస్టో ప్రాకారం వచ్చే ఐదేళ్ళలో 4లక్షల అప్పుల్లోకి తెలంగాణ వెళుతుంది. దీనికి తోడు అదనంగా ప్రకటించిన నిరుద్యోగభృతితో మరో 24వేలకోట్లు వచ్చి అప్పుల కొప్పులో చేరతాయి. ఈ ‘మ్యానిఫెస్టో’లో ప్రతి విషయం నేల విడిచి సాము చేస్తున్నట్లు ఉంది. కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలకు గులాబీ రంగులు అద్ది మరో తుది మ్యానిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసుకొంది.

కుమ్ములాటలలో ఉమ్మడి.. తూచ్‌..: తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి. ఎవరి పార్టీలు వారివి. ఎవరి మ్యానిఫెస్టోలు వారివి. కానీ అధికారం కోసం ఆరాటంతో కూడిన పోరాటం కామన్‌ ఎజెండా మాత్రం తెరసపై గెలవడం. కుమ్ములాటల కూటమికి సీట్ల కుమ్ములాటలో మునిగాయి. ఉమ్మడి మ్యానిఫెస్టో ఆలోచన లేదని స్పష్టం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close