హైదరాబాద్‌ లో ఉనికి విస్తరించిన షిమి వోగ్‌

0

హైదరాబాద్‌, 28 ఏప్రిల్‌, 2019: ఫాస్ట్‌ ఫ్యాషన్‌ కొరియన్‌ డిజైనర్‌ రిటైల్‌ చెయిన్‌ షిమి వోగ్‌ నేడిక్కడ హైద రాబాద్‌ లో శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ లో నెలకొన్న తన రెండవ అవుట్‌ లెట్‌ ను ప్రారంభించింది. సెకండ్‌ లె వల్‌ లోని ఈ అవుట్‌ లెట్‌ 1400 చ.అ. స్థలంలో విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ బ్రాండ్‌ భారతదేశవ్యాప్తంగా 24 అవుట్‌ లెట్స్‌ ను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1700 అవుట్‌ లెట్స్‌ ను కలిగి ఉన్న షిమి వోగ్‌ భారతీయ మార్కెట్‌ లో భారీ విస్తరణ అవ కాశాలను కలిగిఉంది. కాస్మటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, హౌస్‌ హోల్డ్‌, ప్లష్‌ డాల్స్‌, సాఫ్ట్‌ టాయ్స్‌, యాక్సెస రీస్‌, అండర్‌ గార్మెంట్స్‌, ఫుట్‌ వేర్‌, గిఫ్టింగ్‌, టాయిలెట్రీస్‌, స్టేషనరీస్‌ విభాగాల్లో 2600 కన్నా ఎక్కువ రకాల ఉత్పాదనలను అందించడం ద్వారా షిమి వోగ్‌ స్టోర్స్‌ కొనుగోలుదారులకు ఆనందదాయక అనుభూతిని అందిస్తాయి. దీని తెలివైన ఉత్పాదన వ్యూహం, వినూత్న డిజైన్లతో అత్యంత నాణ్యమైన ఉత్పాదనలు, పోటీ దాయక ధరలు ఈ బ్రాండ్‌ ను ప్రపంచవ్యాప్తంగా విజయవంతం చేయడంలో తోడ్పడ్డాయి. ఇది మీ రోజువారీ జీవనశైలి అవసరాలకు వన్‌ స్టాప్‌ షాప్‌.

ఈ మెగా ఆవిష్కరణ సందర్భంగా షిమి వోగ్‌ ఎక్స్‌ పాన్షన్‌ హెడ్‌ శ్రీ శివెన్‌ ఆనంద్‌ మాట్లాడుతూ, ”హైదరా బాద్‌ లో నేడు మా రెండో అవుట్‌ లెట్‌ ప్రారంభించడం మాకెంతో ఆనందదాయకం. దక్షిణాది ప్రాంతంలో విని యోగదారుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉన్న నేపత్యంలో కంపెనీ సొంతమైన మరియు ఫ్రాంచైజీ స్టోర్‌ లను ప్రారంభించేందుకు కంపెనీ యోచిస్తోంది. కొనుగోలు కేంద్రిత విధానం, అధిక నాణ్యం, విలువ ఆధారితం లాం టివన్నీ భారతదేశంలో దీని విజయానికి కారణాలుగా నిలుస్తున్నాయి” అని అన్నారు. ”దేశవ్యాప్తంగా అత్యాధునిక రీజనల్‌ వేర్‌ హౌజెస్‌ తో పటిష్ఠమైన సప్లయ్‌ చెయిన్‌ సాంకేతికతలో భారీగా పె ట్టుబడులు పెడుతూ, 2020 ఆగస్టు నాటికి 180కి పైగా రిటైల్‌ అవుట్‌ లెట్స్‌ ను ప్రారంభించాలన్నది మా ల క్ష్యం” అని ఆయన అన్నారు. ఇతర రిటైల్‌ కాన్సెప్ట్‌ ల మాదిరిగా కాకుండా ఈ ఇంపల్స్‌ పర్చేజ్‌ కేటగిరీ చ.అ.కు అత్యధిక ఆదాయా న్నిఅందించేదిగా (రూ. 3500 – రూ.5,000) గా ఉంది. 55 శాతం వాక్‌ ఇన్స్‌ తో అత్యధిక కన్వర్షన్‌ రేట్‌ ను కలిగి ఉంది.

షిమి వోగ్‌ గురించి:

2015లో ఏర్పడిన షిమి వోగ్‌ కొరియాకు చెందిన డిజైనర్‌ బ్రాండ్‌. ఫాస్ట్‌ ఫ్యాషన్‌ ఉత్పాదనలకు సంబంధించి ఇది ఫ్రాంచైజ్డ్‌ రిటైల్‌ స్టోర్ట్స్‌ గా ఇది కార్యకలాపాలు కొనసాగిస్తోంది. షిమి వోగ్‌ ప్రధాన కార్యాలయం చైనా లోని గువాంజు ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సెంటర్‌ లో నెలకొంది. ‘సరళత్వం, మంచి నాణ్యం, పచ్చదనం’ అనే తాత్వికతకు కట్టుబడి ఉంటూ, ప్రక తికి తిరిగి ఇవ్వడాన్ని ఈ బ్రాండ్‌ ప్రోత్సహిస్తుంటుంది. ఈ విధమైన ధోరణి ద్వారా మరియు చక్కటి కస్టమర్‌ సర్వీస్‌ అందించడం ద్వారా ఈ బ్రాండ్‌ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వయస్సులకు చెందిన తన కొనుగోలుదారుల నుంచి ఆరాధ్యభావనను, గౌరవాన్ని పొందుతోంది. షిమి వోగ్‌ ఉత్పత్తులు క్రమం తప్పకుండా అప్‌ డేట్‌ అవుతుంటాయి మరియు పోటీదాయకంగా ధరలు నిర్ణయించబడుతుంటాయి. చాలా ఉత్పత్తులు రూ.75 నుంచి రూ.1500 లోపుగానే ఉంటాయి. ఇలాంటి అంశాలన్నీ కూడా ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, రష్యా, సింగపూర్‌, స్పెయిన్‌, యూఏఈ లతో సహా 72 ప్రాంతాల్లో బ్రాండ్‌ తిరుగులేని విధంగా వద్ధి చెందేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతీ నెలా 80-100 అవుట్‌ లెట్స్‌ తో విస్తరిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here