బిజినెస్

ఆద్యంతం ఒడుదొడుకులే..

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారం భమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యి ంది. అయితే ఆ జోరు ఎంతో సేపు సాగలేదు. కీలక రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒత్తిడికి గురైన సూచీలు కాసేపటికే ఆరంభ లాభాలను కోల్పో యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ దాదాపు 200 పాయింట్లు దిగజారింది. ఇలా ఆద్యంతం ఊగి సలాడిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 17 పాయింట్లు కోల్పోయి 41,558 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 12,256 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.31గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో టాటామోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌, వేదాంతా, హీరో మోటార్స్‌ షేర్లు లాభపడగా.. యెస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close