Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలువిద్యస్టేట్ న్యూస్

కార్మికుల శాపం మంత్రి పదవి మాయం

కార్మిక సంఘాల నేత గా మంత్రి స్థాయికి ఎదిగిన నేత

  • ఈఎస్‌ఐ మందుల కొనుగోలుకు కుంభకోణంలో కీలక పాత్ర
  • నిబంధనలను అతిక్రమిస్తే నే కొరతను నివారించగలిగాం
  • తప్పయితే ఏ శిక్షకైనా సిద్ధం ఐఎంఎస్‌ సూపరింటెండెంట్‌ : వీరన్న

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): కార్మిక సంఘం నేతగా శ్రామికుల స్వేదం పై మంత్రి స్థాయికి ఎదిగిన ఓ తెరాస నేత కనుసన్నల్లోనే రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందుల కొర తకు శ్రీకారం చుట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది.సుమారు 466 కోట్ల రూపాయల మందుల కొనుగోళ్లలో కీలక పాత్ర పోషించిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ డైరెక్టర్‌ దేవికారాణి సదరు మంత్రి అండదండలతో నిబంధనలకు పాతరేసి విశ్వరూపం ప్రదర్శించినట్లు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది.అయితే సదరు మాజీ మంత్రికి రెండవసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం లో చోటు దక్కకపోవడం సైతం మందులు కొనుగోలులో సదరు మంత్రి ప్రమేయమే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు.కార్మిక సంఘాల నాయకునిగా సుదీర్ఘకాలం పనిచేసిన నేత దర్శకత్వంలోనే రాష్ట్రంలోని ఈ ఎస్‌ ఐ ఆసుపత్రులలో సభ్యత్వం కలిగిన 18 లక్షల మంది కార్మికులలో అనేకమంది ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడి మందులు లేక విలపించడం బాధాకరం. ఇటీవల కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చామకూర మల్లారెడ్డి ఒక సమావేశంలో మాట్లాడుతూ తాను బాధ్యత వహిస్తున్న ఈ ఎస్‌ ఐ ఆసుపత్రిలో మందుబిళ్ల లేకపోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేయడం కార్మికుల సమస్యల కు అద్దం పడుతుంది. ఇంత జరుగుతున్న రాష్ట్రప్రభుత్వం మందుల కొరత నివారణ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కార్మికులు తమ దురదష్టంగా భావిస్తున్నా రు.ప్రైవేటు కంపెనీలు పదిమంది అంతకంటే ఎక్కువ సిబ్బంది పనిచేసే దుకాణాలు హోటళ్లు పెట్రోల్‌ బంకులు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే 21 వేల రూపాయల జీతానికి లోపు గల పలువురు ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తారు.ఇందులో వీరి భాగస్వామ్యం తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతు వాటా అందజేస్తారు . గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆసుపత్రుల్లో ఏనాడు ఇంతటి మందుల కొరత రాలేదని కార్మికులు కార్మిక సంఘాల నాయకులు వాదిస్తుంటే, తాము నిబంధనలకు విరుద్ధంగా మందులు కొనుగోలు చేయడం వలననే మందుల కొరతను గత మూడు సంవత్సరాలలో నివారించగలిగమని ఆదాబ్‌ హైదరాబాద్‌ బాద్‌ ప్రత్యేక ప్రతినిధి తో మాట్లాడిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ డైరెక్టర్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌ వీరన్న వితండవాదాన్ని ప్రదర్శించారు.తాము కార్మికులు వారి కుటుంబాలను ఆదుకోవాలని సదుద్దేశ్యంతోనే నిబంధనలకు విరుద్ధంగా అనేక సార్లు మందులు కొనుగోలు చేయడం జరిగిందని అది నేరం అయితే తాము శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని వీరన్న ఆదాబ్‌ ప్రతినిధితో చెప్పడం గమనార్హం.ఇంతకీ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని విజిలెన్స్‌ ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టరేట్‌ నివేదిక స్పష్టం చేసిందని అయితే అది ఫైనల్‌ కాదని ఆ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం విశ్రాంత ఐఎఫ్‌ఎస్‌ అధికారి సమ్మిరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు అని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ డైరెక్టర్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌ వీరన్న తెలిపారు.కాగా సదరు విచారణ అధికారి విచారణ ఉత్తర్వులను అందుకుని నెల రోజులు గడుస్తున్న ఎటువంటి విచారణ ప్రారంభం కాకమునుపే ఆయన పదవీకాలం ముగియడం కార్మికులు తమ పాలిట శాపంగా భావిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close