Featuredజాతీయ వార్తలు

దేశానికి మరోమారు మోడీ నాయకత్వం అవసరం

మోడీ మాత్రమే దేశాన్ని పటిష్టంగా ఉంచగలరు

అభివృద్ది, రక్షణ విషయంలో మోడీది రాజీలేని మార్గం

వైమానిక దాడులపై రాహుల్‌, బాబుల తీరుపై మండిపాటు

నిజామాబాద్‌ సభలో అమిత్‌ షా

నిజామాబాద్‌,మార్చి6(ఆర్‌ఎన్‌ఎ): దేశానికి మరోమారు మోడీ నాయకత్వం అవసరమని, మళ్లీ ఆయన ప్రధాని కావాల్సి ఉందని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. ఏ ప్రభుత్వం చేయని పనులను ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని వివరించారు. దేశ రక్షణ విషయంలో రాజీలేకుండా పనిచేస్తున్నారని అన్నారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని అమిత్‌ షా తెలిపారు. ఐదేళ్లలో మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మోదీ మరొకసారి ప్రధాని కావడం తథ్యమని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గెలుపు దేశానికి అవసరం అన్నారు.ఏడాదికి రూ. 6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఐదేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచినట్లు స్పష్టం చేశారు. వాయుసేన దాడులతో పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఇక రాహుల్‌బాబా నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎన్నికలకు వెళ్తోందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో జరిగిన సభలో షా మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌ గాంధీతో పాటు యూపీఏ మిత్రపక్ష నాయకులపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా తీవ్రంగా మండిపడ్డారు.పాకిస్తాన్‌లో రెండోసారి భారత వైమానిక దళాలు చేసిన సర్జికల్‌ దాడుల గురించి పాకిస్తానే ప్రశ్నించడం లేదు కానీ చంద్రబాబు మాత్రం ఆధారాలు అడుగుతున్నారని విమర్శించారు. ఉగ్రవాదులు సైతం అడగడం లేదు కానీ రాహుల్‌ గాంధీ మాత్రం వాటికి ఆధారాలు చూపించాలని అడుగుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. పాక్‌ విూడియాలో ఏం ఉంటుందో అదే రాహుల్‌ మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. సర్జికల్‌ దాడులు సక్సెస్‌ అయ్యాయని దేశం మొత్తం నమ్ముతోందని వ్యాఖ్యానించారు. యూపీఏ మిత్రపక్షాలు అన్నీ కూడా సిగ్గుపడాలని అన్నారు. రాహుల్‌ గాంధీ లాంటి నేతలకు పాకిస్తాన్‌, చైనా లాంటి దేశాలను ఎదుర్కోవడం చేతకాదని ఎద్దేవా చేశారు. కేవలం మోదీ లాంటి నేతలే ధీటుగా సమాధానం ఇవ్వగలరని వ్యాఖ్యానించారు. దేశాన్ని మోదీ ఒక్కరే సురక్షితంగా ఉంచగలరని దేశ ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. శత్రు మూకలకు కొన్నిసార్లు బుల్లెట్‌లతోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, రాహుల్‌ గాంధీలను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా…ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలా వద్దా సమాధానం చెప్పాలన్నారు. ఈ సారి తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి మోదీని బలపర్చాలని కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని మరిన్ని ఎక్కువ సీట్లతో గెలిపిస్తే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాద శక్తులను వెతికి పట్టుకుని మరీ తరిమేస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పాలనలో దశాబ్దాల పాటు దేశంలో ఏం సాధించలేదని అన్నారు. నాలుగేళ్ల పాలనలో బీజేపీ, పేద ప్రజలకు కరెంటు, ఇండ్లు, వైద్యాన్ని చేరువ చేసిందని చెప్పారు. తెలంగాణాలో గెలిచిన కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపరని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో ఎన్‌డీఏ ఓ వైపు, రాహుల్‌ బాబా ఆధ్వర్యంలోని మహాకూటమి మరొక వైపు ఉన్నాయని అన్నారు. రాహుల్‌ బాబాకు ఎజెండా లేదు సిద్దాంతం లేదు.. ఏ ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని సూటిగా ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌,

ఎంపి దత్తాత్రేయ, మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close