Featuredస్టేట్ న్యూస్

కూలిన కుమార సర్కార్‌

బలపరీక్షలో ఓడిన కుమారస్వామి

  • కర్ణాటక సంకీర్ణం పతనం
  • విజయం సాధించిన యడ్యూరప్ప
  • అనుకూలంగా 99, వ్యతిరేకం 105 ఓట్లు

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను మరిపించిన కర్ణాటక రాజకీయానికి తెరపడింది. మూడు వారాలుగా పలు మలుపులుతిరిగిన కర్నాటకానికి తెరపడింది. విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓడిపోయారు. మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. అధికార కూటమికి చెందిన 15మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు కూలిపోయింది. దీంతో గత నెల రోజులుగా సాగుతున్న కర్ణాటకీయం ముగిసింది. సభలో డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది వరుసల వారీగా ఒక్కో సభ్యుడ్ని లెక్కించారు. కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమికి కేవలం 99మంది సభ్యుల మద్దతు మాత్రమే దక్కింది. రాజీనామా సమర్పించిన సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. విధాన సభలో విశ్వాస తీర్మానంపై చర్చలో ఉత్కంఠభరిత సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి…

బెంగుళూరు :

కర్ణాటకీయానికి తెరపడింది. మంగళవారం విధానసౌధలో బలపరీక్షపై జరిగిన ఓటింగ్‌ లో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సర్కార్‌ ఓడిపోయింది. డివిజన్‌ పద్దతిలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఓటింగ్‌ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు మార్షల్స్‌. 204మంది ఓటింగ్‌ లో పాల్గొన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది శాసనసభ సభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా 105మంది ఓటు వేశారు. దీంతో కుమారస్వామి సర్కార్‌ కుప్పకూలిపోయింది. 14నెలల పాటు అధికారంలో కొనసాగింది సంకీర్ణ సర్కార్‌. కర్ణాటకలో మొత్తం 224మంది శాసనసభ్యులుండగా 20మంది శాసనసభ సభ్యులు ఓటింగ్‌ లో పాల్గొనలేదు. దీంతో అసెంబ్లీలో ప్రస్థుతం మ్యాజిక్‌ ఫిగర్‌ 103గా ఉంది. ఈ బలపరీక్షలో మ్యాజిక్‌ ఫిగర్‌ ని క్రాస్‌ చేసిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. 2018 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప కూడ అసెంబ్లీలో బలనిరూపణకు ముందే రాజీనామాను సమర్పించారు. కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)కు చెందిన ఎమ్మెల్యేలు ఓటింగ్‌ కు దూరంగా ఉన్న కారణంగానే కుమారస్వామి ప్రభుత్వం ఓటమి పాలైంది. జెడి(ఎస్‌)కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడ రెబెల్స్‌ తో జత కట్టారు. జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా అసెంబ్లీలో ఓటు వేస్తే కుమారస్వామి ప్రభుత్వం గట్టెక్కి ఉండేది. అసెంబ్లీకి 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజర్‌ కావడం వల్ల మ్యాజిక్‌ ఫిగర్‌ 103కు పడిపోయింది. గతంలో సంకీర్ణ సర్కార్‌ కు మద్దతు ఇచ్చిన ఇద్దరు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కూడ బీజేపీకి మద్దతును ప్రకటించారు. ఈ పరిణామాలు కూడ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాయి.కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) మధ్య నెలకొన్న విభేదాలు పరోక్షంగా బీజేపీ విజయానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మంగళవారం విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ కు ముందు సీఎం కుమారస్వామి తన స్పీచ్‌ సందర్భంగా కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతిపక్షాలు రైతురుణమాఫీపై చేస్తున్న ఆరోపణలను సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. రైతు సంక్షేమం కోసం తమ సర్కార్‌ చాలా చేసిందన్నారు. రైతులకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. విశ్వాస పరీక్ష ఆలస్యమైన మాట వాస్తవమేనని తెలిపారు. తన పాలనలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలన్నారు. తాజా పరిణామాలు తనను మానసిక క్షోభకు గురిచేశాయన్నారు. తాను ఎప్పుడూ మాట తప్పలేదని,నిజాయితీగా కర్ణాటక అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు.

రెండురోజుల పాటు 144 సెక్షన్‌

కర్ణాటకలో ప్రస్థుత రాజకీయ పరిస్థితులు దృష్ట్యా బెంగళూరులో 144సెక్షన్‌ విధించారు పోలీసులు. బలపరీక్షలో సంకీర్ణ సర్కార్‌ ఓడిపోతే ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా రెండురోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. రెండు రోజులపాటు మద్యం షాప్‌ లు కూడా బంద్‌ కానున్నాయి. మరోవైపు బెంగళూరులోని రేస్‌ కోర్స్‌ రోడ్డులోని స్వతంత్య్ర ఎమ్మెల్యేలు ఉంటున్న ఓ ¬టల్‌ దగ్గర కాంగ్రెస్‌ కార్యకర్తలు హంగామా చేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సంకీర్ణ సర్కార్‌ కి మద్దతు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మంగళవారం బలపరీక్ష నిర్వహిస్తానని ప్రకటించిన స్పీకర్‌ రమేశ్‌.. భోజన విరామం ఇవ్వకుండా సభను కొనసాగిస్తున్నారు. విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ కు ముందు సీఎం కుమారస్వామి తన స్పీచ్‌ సందర్భంగా కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతిపక్షాలు రైతురుణమాఫీపై చేస్తున్న ఆరోపణలను సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. రైతు సంక్షేమం కోసం తమ సర్కార్‌ చాలా చేసిందన్నారు. రైతులకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. సీఎం ప్రసంగం అనంతరం బలపరీక్ష జరగనుంది. మరోవైపు కర్ణాటకలో ఇవాళ లేదా రేపు బలపరీక్ష పూర్తవుతుందని సుప్రీంకోర్టు కూడా ఆశాభావం వ్యక్తం చేసింది.

భోజన విరామం లేకుండా…

కర్ణాటక శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితిల్లోనూ మంగళవారం బలపరీక్ష నిర్వహిస్తానని ప్రకటించిన స్పీకర్‌ రమేశ్‌.. భోజన విరామం ఇవ్వకుండా సభను కొనసాగించారు. భోజన విరామం కోసం సభను వాయిదా వేయడం లేదంటూ.. సభ నిరంతరాయంగా కొనసాగించారు. సభ్యులు బృందాలుగా భోజనానికి వెళ్లి వెంటనే తిరిగిరావాలని సూచించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి అసెంబ్లీకి వచ్చినా.. తన ఛాంబర్‌లోనే ఉండిపోయారు. బలపరీక్షను వెంటనే జరపాలని ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు నేటికి వాయిదా వేసింది. సాయంత్రం 6 గంటల లోపు బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదించారు. బలపరీక్ష నిర్వహించకుండా రోజూ సభ వాయిదా వేస్తున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. విశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరుగుతుందని స్పీకర్‌ తరపు న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ వాదించారు.

నా రక్తం మరిగిపోయింది: స్పీకర్‌ రమేశ్‌

బెంగళూరు విధాన సభలో విశ్వాస తీర్మానంపై చర్చలో ఉత్కంఠభరిత సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. సభలో స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ భావోద్వేగ ప్రసంగం చేశారు. సభలో జరిగిన పరిణామాలన్నింటితో తన రక్తం మరిగిపోయిందని వ్యాఖ్యానించారు. కనీస సంప్రదాయ ప్రక్రియ పాటించకుండా తనను ఇబ్బంది పెట్టారన్నారు. స్పీకర్‌ పదవిలో రాజ్యాంగబద్ధంగా తన బాధ్యతను తాను నిర్వర్తించానన్నారు. రాజ్యాంగ ప్రమాణాల మేరకే సభను నిర్వహించానని స్పీకర్‌ చెప్పారు.

రాజీనామా పత్రంతో సభకు వచ్చిన స్పీకర్‌!

కర్ణాటక స్పీకర్‌ రమేష్‌కుమార్‌ సభకు రాజీనామా పత్రంతో వచ్చారు. విధాన సభలో విశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన రాజీనామా పత్రాన్ని సభ్యులకు చూపించారు. రాజీనామా పత్రాన్ని సిబ్బందితో ప్రతిపక్ష నేత యడ్యూరప్పకు పంపారు.

వారు వెన్నుపోటు పొడుస్తారు:శివకుమార్‌

విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా కర్ణాటక శాసనసభలో మంత్రి డి.కె.శివకుమార్‌ ఉద్వేగంగా ప్రసంగించారు. అసమ్మతి ఎమ్మెల్యేలు సభకు రావాల్సిందేనని పట్టుబట్టిన ఆయన.. వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సవాల్‌ విసిరారు. ముంబయిలో సంతోషంగా గడుపుతున్న వారిని.. సభకు తీసుకురావాలని ప్రతిపక్షాన్ని డిమాండ్‌ చేశారు. వారంతా సంకీర్ణ ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచారని.. భవిష్యత్తులో భాజపా సైతం అదే పరిస్థితి ఎదుర్కొంటుందన్నారు. సీఎం అయ్యేందుకు యడ్యూరప్ప చేసిన ప్రయత్నాలు ఇప్పటికే ఆరు సార్లు విఫలమయ్యాయని మరోసారి అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భాజపా ప్రభుత్వంలో మంత్రులుగా తిరిగివస్తామన్న అసమ్మతి ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వారు ఎలా మంత్రులు అవుతారో తనకు అర్థం కావడం లేదన్నారు. చర్చ సందర్భంగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పక్ష నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం తనకు విప్‌ జారీ చేసే హక్కు ఉందన్నారు. దీని ప్రకారమే తనకు విప్‌ జారీ చేసే అధికారం స్పీకర్‌ ఇచ్చారని అందుకనుగుణంగానే తాను నడుచుకుంటున్నానని వివరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై అనర్హత వేటు వేసే అధికారం ఉందన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలను శివకుమార్‌ బెదిరిస్తున్నారన్న భాజపా వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వారి రాజీనామాల్ని ఇంకా ఆమోదించలేదని.. అసంబద్ధ ఆరోపణలతో భాజపా సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. టికెట్‌ ఇచ్చి గెలిపించుకున్న వారే తమని ఇప్పుడు మోసం చేస్తున్నారన్న ఆవేదనతోనే శివకుమార్‌ తన బాధని వ్యక్తం చేశారన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close