Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

ముఖ్యమంత్రి గారు ఇదిగో అవినీతి…చర్యలు ఏవి

తీరికలేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలనలో మందులు లేక నరకం అనుభవిస్తున్న లక్షలాది మంది కార్మికులు

పారదర్శక పరిపాలనలో దేశంలోనే నెంబర్‌ వన్‌ అంటూ పదేపదే ప్రకటించే ముఖ్యమంత్రి కెసిఆర్‌ సుమారు 466 కోట్ల మందుల కొనుగోలు కుంభకోణంకారణంగా లక్షలాది మంది కార్మికులు మందులు లేక విలవిలలాడుతున్న స్పందించకపోవడ చర్చనీయాంశంగా మారింది. అవినీతి అంతు చూస్తాం అని పెడబొబ్బలు పెట్టే ప్రభుత్వం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని మందులో రామచంద్ర అంటూ రోధిస్తున్న, దోషులైన అధికారులను వారి వారి సీట్లలోనే కూర్చోబెట్టి ఆధారాలను రూపుమాపే అవకాశం కల్పించడం మరింత విడ్డూరం. విద్య వైద్యం పై అధిక శ్రద్ధ కనబరిచే మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నెలలు గడుస్తున్నా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు కనబడకపోవడం మంత్రి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): ప్రాణాపాయ స్థితిలో గల కార్మికుల గోడును పట్టించుకునే నాధుడే లేడని కనీసం కార్మిక సంఘాల నాయకులు సైతం తమ సమస్యలను ప్రభుత్వ దష్టికి తీసుకు పోవడంలో వెనుకంజ వేయడం లోని మర్మం ఏమిటని వారు ప్రశ్నించారు. విజిలెన్స్‌ ఎన్ఫోర్స్మెంట్‌ నివేదికలో తప్పులు జరిగాయని ఆధారాల పై ప్రభుత్వం కనీసం ప్రాథమిక చర్యలు తీసుకోవడంలో విఫలమవడంతో ఈ ఎస్‌ ఐ ఆసుపత్రిలు మరింత అధ్వాన్నంగా మారాయని కార్మికులు ఆందోళన వ్యక్త పరిచారు. విజిలెన్స్‌ ఎన్ఫోర్స్మెంట్‌ నివేదిక అందిన ఆరు నెలలకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సమ్మిరెడ్డి విచారణ అధికారిగా నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ,కానీ విచారణ ఉత్తర్వులు అందుకున్న నెలరోజుల్లో సమ్మిరెడ్డి పదవీకాలం ముగియడంతో లక్షలాది మంది కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. విజిలెన్స్‌ నివేదిక లో అవకతవకలు జరిగాయని ఆధారాలతో సహా అందజేసినా,ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటం పలు అనుమానాలకు దారితీస్తుంది.

బోగస్‌ ఫార్మా ఏజెన్సీలను సష్టించి నిధులు స్వాహా చేసిన ఐఎంఎస్‌ అధికారులు… విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి అందించిన నివేదికలో రంగారెడ్డి జిల్లాలోని చైతన్యపురి లో ఉన్న సెవెన్‌ హిల్స్‌ అపార్ట్మెంట్‌ ప్లాట్‌ నెంబర్‌ 204 లో ఉన్న వీ/ర.మైత్రి ఫార్మ కమర్షియల్‌ టాక్స్‌ రికార్డ్స్‌ ప్రకారము ఫార్మా ఏజెన్సీ 1. 10. 2015 లో ప్రారంభమై 30 జూన్‌ 2016లో ఫార్మా ఏజెన్సీ మూసేశారు. అలాంటి మైత్రి ఫార్మా ఏజెన్సీ నుండి ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ అధికారులు 2016 – 17 సంవత్సరంలో రూ. 1, 30, 35, 651 మందులు కొనుగోలు చేసినట్టు పరిశీలనలో తేలింది. మైత్రి ఫార్మా ఏజెన్సీ 2016లో మూత పడితే 2016 – 17 సంవత్సరంలో మందులు ఏ విధంగా సరఫరా చేశారు అనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. సికింద్రాబాద్‌ లోని బోయిన్‌ పల్లి ప్లాట్‌ నెంబర్‌ 83 కే. ఆర్‌. నగర్‌ కాలనీ లో ఉన్న వీ/ర గాయత్రీ ఫార్మా ఏజెన్సీ వారి అమ్మకాల్లో 95% మందులు కేవలం ఈ ఎస్‌ ఐ వారికి సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. అంటే గాయత్రి ఫార్మా ఏజెన్సీ కేవలం ఈఎస్‌ఐ మందులు సరఫరా చేయడానికి మాత్రమే ఏజెన్సీని ప్రారంభించినట్లు కనిపిస్తుంది. కుత్బుల్లాపూర్‌ ఇంద్రానగర్‌లో ఉన్న వీ/రమహీంద్రా మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ వారు ఏజెన్సీని జనవరి 2016లో ప్రారంభించింది,అంటే మందుల సరఫరా లో ఏజెన్సీ వారికి ఎలాంటి అనుభవం లేదని స్పష్టం. అలాంటి ఏజెన్సీ నుండి ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ దేవికారాణి, అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం ఏజెన్సీ వారితో కుమ్మక్కై సుమారుగా నాలుగున్నర కోట్ల మందులు సరఫరా చేయడానికి ఆర్డర్స్‌ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్‌ లోని చాపల్‌ రోడ్లో ఉన్న వీ/ర వసుధ మార్కెటింగ్‌ 2016 నుండి వారి వ్యాపారాన్ని ప్రారంభించినట్టు విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ గుర్తించారు. ఈ విషయాల తో స్పష్టంగా అర్థం అవుతుంది ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ దేవికారాణి, అధికారులు, తెరాస మాజీ మంత్రి, నగర ఎన్జీవో నాయకుడు అందరు కుమ్మకై స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థను ధ్వంసం చేసి కమీషన్లకు కక్కుర్తిపడి బినామీ పేర్లతో ఫార్మా ఏజెన్సీలను సష్టించి, వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఔషధాలు కొనుగోలు చేయడమే కాకుండా, రేట్‌ కాంట్రాక్ట్‌ ధరల కంటే 350 శాతం అధికంగా ధర చెల్లించి కొనుగోలు చేశారని నివేదిక ద్వారా బట్టబయలు అవుతుంది. ఇంత స్పష్టంగా అవినీతికి పాల్పడ్డారు అని విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే ఎనిమిది నెలలు గడిచిన కూడా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close