Featuredస్టేట్ న్యూస్

కేసును నీరుగార్చిన సిసిఎస్‌ పోలీసులు

జిహెచ్‌ఎంసిలో వందల కోట్ల కుంభకోణం

  • విడిభాగాల ముసుగులో భారీ కుంభకోణం
  • కుంభకోణంలో యూనియన్‌ నాయకుల, ఐఏఎస్‌ల కీలక పాత్ర
  • సీబీఐకి అప్పగించాలని సామాజిక ఉద్యమకారుడు వెంకటనారాయణ డిమాండ్‌

జిహెచ్‌ఎంసిలో అక్రమాలు చేయాలంటే అతి సులువు అందుకు సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా సహకరిస్తారు కావలసింది ఒకటే డబ్బు భారీగా పొందాలి. ఇందుకోసం జిహెచ్‌ఎంసి అధికారులు ఏ పనైనా చెయ్యనీకి సిద్ధంగా ఉంటారు ఇందులో భాగంగానే బోగస్‌ అడ్రస్‌ లతో కోట్ల రూపాయలు స్వాహా చేశారు. హైదరాబాద్‌ నగర సుందరీకరణ సన్‌ రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు కేటాయిస్తుంది. ఇందులో భాగంగా క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పేరుతో జిహెచ్‌ఎంసి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఆ కార్యక్రమాల వెనుక నే భారీ కుంభకోణాలు దాగి ఉన్నాయి.2013 వాహన విడిభాగాల రూపంలో వందల కోట్ల విడి భాగాలను సప్లై చేసినట్టు బిల్లులు 100 కోట్లు అతి సులువుగా నొక్కేశారు. ఈ కుంభకోణం 2011లో జరిగినప్పటికి లోక యుక్త చీఫ్‌ జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి అప్పట్లో పత్రికల వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. సామాజిక ఉద్యమకారుడు వెంకట్‌ నారాయణ ఆర్‌ టి ఐ చట్టం ద్వారా పూర్తి ఆధారాలను సేకరించారు అంబర్‌ పేట లోని రామక ష్ణ నగర్‌ ఐ ఓ బి బ్యాంకు ఏటీఎం ఉండేది. ఏటీఎంలో భవాని మోటార్స్‌ పేరుతో వాహన విడిభాగాల సప్లై జరుగుతున్నట్లుగా ఏటీఎం అడ్రస్‌ పై వాహనాల విడిభాగాల బోగస్‌ దండ నడిపారు. ప్రజా అవెన్యూ అపార్ట్మెంట్‌ తురబ్‌ నగర్‌, బాగ్‌ అంబర్పేట్‌ అడ్రస్‌ పై వెంకటేశ్వర ఆటో సర్వీసెస్‌ పేరుతో వాహనాల విడిభాగాల సరఫరా చేస్తున్నట్లుగా బోగస్‌ దండ చేశారు. ప్రశాంత్‌ నగర్‌ మలక్‌ పేట డివిజన్లో విజయ దుర్గ ఆటో మొబైల్స్‌ అదే అడ్రస్‌ పై లక్ష్మీ సాయి ఆటో మొబైల్స్‌ ఇదే పేరుతో వాహనాల విడిభాగాల సప్లై చేస్తున్నట్లు బోగస్‌ అడ్రస్‌ లతో కోట్లు దండుకున్నారు. వందల కోట్లు ప్రజాధనం దారి మండుతున్న ఉన్నత అధికారులకు కనిపించకపోవడం విడ్డూరం. ఒక వ్యక్తిపై 5 ఫారం రిజిస్ట్రేషన్‌ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు టెండర్‌ లో పాల్గొని అక్రమ మార్గంలో టెండర్లను కొన్నారు. ఉన్నత అధికారులకు మామూలు అందించి బిల్లుల రూపంలో కావలసినంత దండుకున్నారు. ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చూపించి ప్రజాధనం భారీగా లూటీ చేశారు.

జిహెచ్‌ఎంసి కుంభకోణంలో ఐఏఎస్‌ల కీలక పాత్ర….

అప్పట్లో జిహెచ్‌ఎంసి కమిషనర్లుగా క ష్ణ బాబు, సి వి ఎస్‌ కె శర్మ పని చేశారు ఎస్పీ సింగ్‌ జిహెచ్‌ఎంసి అధికారిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు ఈ కుంభకోణంలో పాత్ర పోషించినట్టు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం వీరికి మెమోలను జారీ చేసింది 23 మంది అధికారులను రిప్లై ఇవ్వమని కోరారు. దీనిపై రాస్తా విజిలెన్స్‌ ఎంక్వయిరీ చేపట్టింది విజిలెన్స్‌ రిపోర్టులో వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఐఏఎస్‌ అధికారులు ఉన్నట్లు నివేదిక అందించారు. బిజినెస్‌ రిపోర్ట్‌ ను లోకాయుక్త కోర్టులో వెంకట్‌ నారాయణ ఫిర్యాదు చేశారు 1 9 5 5/ 2 0 1 5 లోకాయుక్తలో విచారణ కొనసాగుతోంది. 2011 సెప్టెంబర్‌ నెలలో వందల కోట్ల కుంభకోణం బయటికి రావడంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు ఈ కుంభకోణంలో చాలా మంది అధికారులు, ఐఏఎస్‌ లు ఉండడం చర్చనీయాంశంగా మారింది పురానాపూల్‌ ఎం ఐ ఎం కార్పొరేటర్‌ సున్నం రాజ్‌ మోహన్‌ కుటుంబ సభ్యులు ఈ కుంభకోణంలో కాంట్రాక్టర్లుగా పాలుపంచుకున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ కార్మిక సంఘం జిహెచ్‌ఎంసి ఇయు ప్రెసిడెంట్‌ కు దారి గోపాల్‌, తెలంగాణ ఎంప్లాయిస్‌ ప్రెసిడెంట్‌ అమరేశ్వర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లికార్జున్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ అంబర్‌ పేట దర్గా ఇంచార్జ్‌ కష్ణ గౌడ్‌ ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించారు. 122 కాంట్రాక్టర్లు వాహన విడిభాగాలు సప్లై చేశారు వీరిలో ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లపై సీసీఎస్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారో లేదో తెలియని పరిస్థితి.

ఈ కుంభకోణం సీసీఎస్‌కు అప్పగింత….

జిహెచ్‌ఎంసి కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి ఈ కేసును సీసీఎస్‌ కు అప్పగించారు ఇప్పటికి సిసిఎస్‌ లో విచారణ నెమ్మదిగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆరుగురిని అరెస్టు చేశారు. 30 మందిపై నాన్‌ బెయిల్‌ క్రిమినల్‌ కేసులను నమోదు చేశారు దీనిపై సిసిఎస్‌ పోలీసులు కోట్లు అవినీతి జరిగినట్లు నివేదిక ఇచ్చారు ఈ విచారణలో భాగంగా 100 కోట్లు అవినీతి జరిగినట్టు నివేదిక సమర్పించారు వాహనాల విడిభాగాల కుంభకోణంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు ఉన్నందువలన సి.బి.ఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ నరసింహం, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ల కి సామాజిక ఉద్యమకారుడు వెంకటనారాయణ కోరుతున్నారు. అరెస్ట్‌ అయిన ఆరు మందిలో నలుగురు రిటైర్‌ అధికారులు, ఒక ప్రస్తుత అధికారి, ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నారు. కుంభకోణంలో డబ్బులను రికవరీ చేయడం లో సిసిఎస్‌ పోలీసులు పూర్తిగా విఫలం చెందారు. ఇంత పెద్ద కుంభకోణంలో పాలుపంచుకున్న కాంట్రాక్టర్లు వారి కోట్ల రూపాయల నిలిపివేశారని చెప్పారు. కానీ తమంది అక్రమాధికారులు బిల్లులను చెల్లించినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో సాక్షాత్‌ జిహెచ్‌ఎంసి కమిషనర్‌ హస్తం ఉండడంతో విచారణ సిసిఎస్‌ పోలీసులు ముందుకు తీసుకుపోవడం లేదని అవినీతిపరులకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అవినీతిలో భాగస్వాములైన కాంట్రాక్టర్ల లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ ద ష్టి సాధించలేకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రతి సంవత్సరం జిహెచ్‌ఎంసి ఆర్థిక బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది ఈ కుంభకోణం వెలుగు చూసినప్పటినుండి ఇప్పటివరకు వాహనాల మరమ్మత్తు పై ఎన్ని రూపాయలు ప్రవేశపెట్టిం దో తెలపడం లేదు. ఇప్పటికి వాహనాల విడిభాగాలు పై జీహెచ్‌ఎంసీలో కోట్ల కుంభకోణం కొనసాగుతోంది.


అక్రమార్కులతో చేతులు కలిపిన సిసిఎస్‌….

ప్రస్తుతం కోర్ట్‌ కేసులో ఉన్న ఈ కుంభకోణం వ్యవహారం పై కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించ కూడదు పెండింగ్లో ఉన్నాయా లేదా అన్నది ఇప్పటివరకు ఏ అధికారి చెప్పడంలేదు..? ఐఏఎస్‌ అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు స్పష్టత ఇవ్వని సీసీఎస్‌ పోలీసులు..? ఐఏఎస్‌ అధికారులను సీసీఎస్‌ పోలీసులు ఇప్పటివరకు విచారించారా..? లేదా అన్నది తెలపలేదు. వందల కోట్ల కుంభకోణాన్ని సీసీఎస్‌ పోలీసులు 23 కోట్లకు ఎలా తగ్గించారు…? ఇందులో సిసిఎస్‌ పోలీసులకు ఎంత మొత్తంలో అందిందో అర్థం కాని పరిస్థితి. తూతూమంత్రంగా అరెస్టు చేసి నామమాత్రము కేసులతో అవినీతిపరులను రక్షించిన సిసిఎస్‌ పోలీసులు. కాంట్రాక్టర్లపై, యూనియన్‌ నాయకులపై, ఉన్నతాధికారులపై కేసులు పెట్టకుండా వారితో కుమ్మక్కయిన సీసీఎస్‌ పోలీసులు ఇలా అనేక సందేహాలు సామాజిక ఉద్యమకారుడు వెంకటనారాయణ వెలుగులోకి తేవడంతో పాటు సీసీఎస్‌ పోలీసులు అక్రమార్కులతో కుమ్మక్కయ్యారని అందుకోసమే సి.బి.ఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close