Featuredస్టేట్ న్యూస్

నిరసనల హోరు !

  • 45వ రోజు ఉధృతంగా సాగిన ఆర్టీసీ సమ్మె
  • రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన కార్మికులు
  • అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం
  • బలవంతంగా సెలైన్‌ ఎక్కించిన వైద్యులు
  • పరామర్శించిన కోదండరాం, తదితరులు
  • మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలు

హైదరాబాద్‌

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన సమ్మె 45వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను విరమించుకున్నా.. సీఎం కేసీఆర్‌ మాత్రం చర్చలకు పిలవకుండా నిరంకుశపాలనను సాగిస్తున్నాడని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్మికులు తెరాస ముఖ్యనేతలను, ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగా కొప్పుల ఈశ్వర్‌ను కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను ఉస్మానియాకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన చికిత్సకు నిరాకరించడంతో ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. అశ్వత్థామరెడ్డిని ఐసీయూలో చేర్పించారు. అశ్వత్థామను పలువురు రాజకీయ, ఆర్టీసీ ఐకాస నేతలు పరామర్శించారు. సోమవారం ఉదయం తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ అశ్వత్థామరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాగే దీక్ష కొనసాగిస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారని, అశ్వత్థామరెడ్డికి బీపీ, షుగర్‌ ఉండడం వల్ల కీటోన్స్‌ ఉత్పత్తి అవుతాయనీ.. అవి మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు పేర్కొన్నట్లు తెలిపారని కోదండరాం అన్నారు.. ఆయనకు బలవంతంగా సెలైన్స్‌ ఎక్కిస్తున్నారని, అయితే ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు తెలిపారని కోదండరాం పేర్కొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close