Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

బడ్జెట్‌ ఓ అంకెల గారడీ

ఆర్థిక మంత్రి ఉండగా, బడ్జెట్‌ను సీఎం ఎందుకు ప్రవేశపెట్టారు?

  • సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి
  • లేదంటే కేంద్రమే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

మహబూబాబాద్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బ్జడెట్‌ అంకెల గారడీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. సోమవారం ఆయన మహబూబాబాద్‌ జిల్లా పెరుమాండ్ల సంకీస గ్రామంలో సాయుధ రైతాంగ పోరాట సమరయోధుల కుటుంబాల్ని సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో లక్ష్మణ్‌ ప్రసంగించారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన బ్జడెట్‌తో పేదలకు ఒరిగిందేవిూ లేదని, ప్రజలకు మేలు కలిగే పథకాలకు ప్రాధాన్యాన్ని తగ్గించారని విమర్శించారు. ఆర్థిక మంత్రిగా హరీశ్‌ రావు ఉండగా, అసెంబ్లీలో సీఎం ఎందుకు బ్జడెట్‌ ప్రవేశపెట్టాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీజేపీ చేసిన ఉద్యమం వల్లే యాదాద్రిలో కేసీఆర్‌, ఇతర శిల్పాలను తొలగించారని చెప్పారు. సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులను కేసీఆర్‌ మర్చిపోయారన్నారు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహిస్తానని కేసీఆర్‌ మాట తప్పారని లక్ష్మణ్‌ గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాట అమర యోధుల కుటుంబాలను సన్మానించినవారిలో.. లక్ష్మణ్‌, మాజీ ఎంపీలు డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి, రవీంద్రనాయక్‌, మాజీ మంత్రి డీకే అరుణ, పెద్దిరెడ్డి, రాజవర్ధన్‌ రెడ్డి ఉన్నారు. అంతకుముందు తోర్రూర్‌ లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు బీజేపీ నేతలు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close