Featuredస్టేట్ న్యూస్

మనుషులను దారుణంగా చంపే.. మృగాలకు మానవ హక్కులా…?

  • తెలంగాణ అమరవీరులకు లేవు
  • ‘మావో-పోలీస్‌’ బాధితులకు ఉండవు
  • ‘ఫ్యాక్షన్‌’లో కనపడవు
  • ‘న్యాయం’ జరక్కపోతేనే అటవిక న్యాయం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో… 130 కోట్లమంది భారతీయులకు లేని మానవ హక్కులు… వారిని కర్కశంగా, కఠోరంగా, పశుకామంతో… ఖండ ఖండాలుగా నరుకుతూ.. పైశాచిక ఆనందం పొందే గుప్పెడు ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు మాత్రమే ఈ దేశంలో మానవ హక్కులు ఉన్నాయా..? ఈ నీచులకే హక్కులు ఉంటాయా…? ఆ హక్కులను రక్షించడం కోసం ‘టిప్‌ టాప్‌ టై’లతో విమానాలలో ఎగురుతూ.. ఎగరేసుకొని వచ్చే ఎర్రోళ్ళుకు… ఈదేశంలో సంస్కారంగా బతికేవాళ్ళు, బతకడానికి కష్టపడే వాళ్ళు ఈమానవ హక్కులోళ్ళకు కనపడరా..? పేదోడోకి మానవ హక్కులు లేవా..? ఉండవా..? ఆ హక్కులు కావాలని అడిగే హక్కు ఈదేశంలో లేదా..? ఒకవేళ ఆ మానవ హక్కులు ఉంటే.. ప్రతిరోజూ పిల్లలు, మహిళలు, వృద్ధులు, రైతులు, నిరుద్యోగులు, సామాన్య బీద బిక్కి, మధ్య తరగతి జనాలపై జరుగుతున్న ‘దారుణ మారణకాండలు’ ఇన్ని జరుగుతాయా..? ఈ అవాంఛనీయ సంఘటనలు ఈ పెద్దమనుషులకు తెలియవా…? ‘ఏయ్‌..’ తప్పకుండా వాళ్ళకు తెలుసు…!. ‘అస్కార్‌ అవార్డులు’ సైతం వీరి నటనకు సిగ్గుపడే విధంగా ‘యమ’గా నటిస్తారు. నటిస్తున్నారు. నటేస్తున్నారు. ఢిల్లీ నుంచి ‘జారిపోతున్న’ గొట్టం పాయింటు.. పైకి ఎగదోసుకుంటూ.. ఎగేసుకొని వచ్చినోళ్ళ ఇళ్ళల్లో ‘దిశ’ సంఘటన జరిగితే ఇలాగే ‘పూనకం’ వచ్చినట్లు ఊగుతార్రా..? ఈ మా దేశంలో రోజుకు 60 అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కంటికి కనిపించని మానవ హక్కుల మాటున… ‘ఎన్‌ కౌంటర్‌ మృగాలకు’ ఏదో జరిగిందని… కోరల్లేని విూ అధికారాలను బ్రీఫ్‌ ‘కేసు’ల్లో భద్రంగా పెట్టుకొని తెలంగాణలో ఏం జరిగిందని..? ఏం ‘పగల’ పొడుద్దామని వచ్చారు..? అల్లారు ముద్దుగా పెంచుకున్న మావాళ్ళను విూమే కాపాడుకుంటాం. మా వాళ్ళపై కన్నేస్తే ఇదే జరుగుతోంది. మా ఆడకూతుర్లపై ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారీ… సరిగ్గా దిగాల్సిన చోట ‘జిప్‌’ మంటూ ‘జిగేల్‌ మనే బుల్లెట్‌’ దిగాల్సిందే..! దింపాల్సిందే..! సకాలంలో న్యాయం జరగకపోతే… ఇలాంటి సంఘటనలే జరుగుతాయ్‌. ఆ పోలీసులకు, బాధితులకు, అణగారిన, అణిచివేతకు గురవుతున్న అభాగ్యులకు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అండగా నిలుస్తుంది.

జస్ట్‌.. అలా చూసి.. ఇలా : ‘దిశ’ హంతకుల ఎన్కౌంటర్‌ జరగ్గానే? జస్ట్‌, ఆ కాసేపట్లోనే టీవీ వార్తలు చూస్తూ.. స్క్రోలింగులు చదివేసి… జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి… హహ్హాహ్హా… నోటీసులు జారీ చేసిందట అర్జెంటుగా..! ఇప్పుడు వీళ్ళను చూస్తే న్నిజంగా నవ్వొస్తోంది..! ఎందుకో గానీ మన దేశంలో మామూలు మనుషులకు అస్సలు ఏ హక్కులూ ఉండవ్‌. హంతకులకు, ఉగ్రవాదులకు, రేపిస్టులకు, దోపిడీ దొంగలకు మాత్రమే ఆ హక్కులు వర్తిస్తాయి?! ఛీ ఏం బతుకు. ఈ వ్యాఖ్య ఈ ఎన్కౌంటర్కు సమర్థన కాదు? కానీ ఓ ప్రశ్న? నిజంగానే మన న్యాయవ్యవస్థ ‘సక్కగా’ ఉంటే అసలు జాతీయ మానవ హక్కుల సంఘం ఉనికే అవసరం లేదు కదా?!! పోలీసుల ‘తక్షణశిక్ష’ అనే మాటే వినిపించేది కాదు కదా..! గతంలో ఓ సుప్రీంకోర్టు తన తీర్పు ఇస్తూ… ‘సకాలంలో న్యాయం జరగకుంటే… అన్యాయం చేసినట్లే’ అని పేర్కొంది. అందుకే ప్రజలు ‘న్యాయం’ కోసం రాళ్ళు పట్టుకుని బయలుదేరారు. ఆరోజు ఓ రెండు నిమిషాలు .. జస్ట్‌ టు మినిట్స్‌ ఖాకీలు ‘కళ్ళు’ మూసుకుంటే… దొవ్మిూలో ఆ మృగాలు కుక్క కన్నా.. ‘హీనంగా’ చచ్చేవాళ్ళు.

తూటా పేల లేదు..ప్రజలు ‘ట్రిగ్గర్‌’ నొక్కారు: గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులు ఉన్నాయా..? పోలీస్టేషన్‌ లో రాజకీయ ఉనికి లేకుండా ‘ఎఫైర్‌ నమోదు’ జరిగే అవకాశం ఉందా..? (మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రయోగం చేస్తాం). రాజకీయ అధికారం చేతుల్లో ‘పోలీసులు’ నలగట్లేదా..? ఈ విషయాలు ఈ న్యాయకోవిదులకు తెలియవా..? ‘ఫీల్‌’ కాకండి..తెలంగాణ రాష్ట్రంలో రెండో స్థానంలో కొనసాగుతున్న జస్టిస్‌ సంజయ్‌ ను 12వ స్థానానికి పంపినప్పుడు… తెలుగు రాష్ట్రాల న్యాయవాదులు ‘న్యాయస్థానాలను’ బహిష్కరించినప్పుడు… అప్పుడు మానవ హక్కులు కనిపించలేదా..? అస్సలు హక్కులు వాళ్ళకు లేవా..? అలాగే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఎలక్ట్రానిక్‌ విూడియా సామ్రాజ్యాన్ని నిర్మించిన టివి9 రవిప్రకాష్‌ ను ఆక్రమంగా జైలుకు పంపించినప్పుడు మానవ హక్కులు కన్పించ లేదా..? మరి ఇప్పుడు పేలిన తూటాలు పోలీసులు పేల్చినవి కావు. ప్రజల ఒత్తిడితో పేలినవి. అయితే హైదరాబాద్‌ కు చెందిన గులాబీ మంత్రి ఒకరు ‘ముఖ్యమంత్రిదే ఈ క్రెడిట్‌’ అంటూ ఎలక్ట్రానిక్‌ విూడియా సాక్షిగా మాట్లాడారు. మరి ఇప్పుడు దర్యాప్తు ప్రారంభం కావల్సింది ఎక్కడి నుంచి..? ఎవరి వద్ద నుంచి..? ఓ ‘మంచి సజ్జనారా..’ మళ్ళీ ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం. నాయకులు పరార్‌.. ఉద్యోగులకు ఉచ్చు. నక్సల్స్‌(మావో)ల, పోలీసు బాధితులకు ఈ హక్కులు ఉండవు. ఏమిరా… ‘రంగ’స్థలంపై ‘రాజక్రీడ’.

ఐపిఎస్‌ (కన్పాడ్‌) రంగనాథ్‌ బాధితులకు హక్కులు లేవా..? : ఛాలెంజ్‌ చేసి చెపుతున్నాం. ఫిర్యాదులు లేకుండా ఎఫ్‌ఐఆర్‌ చేసే సంస్కృతిపై ఆయనది. (సాక్ష్యాలు ఉన్నాయ్‌) ఆధారాలతో మానవ హక్కుల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులు ఏమైనాయి.? రంగనాథ్‌ పై ఉన్న ‘సిబిఐ దర్యాప్తు’ కావాలంటూ వేసిన కేసులు ఎక్కడ ఉన్నాయ్‌..? రంగనాథ్‌ చేసిన అకృత్యాలపై 18 మంది బాధితులను స్వయంగా విచారణ చేసి ప్రభుత్వానికి ఐపిఎస్‌ (స్ట్రైయిట్‌) నవీన్‌ చంద్‌ ఇచ్చిన నివేదిక గల్లంతైంది. ఇలాంటి సందర్భాల్లో వెల్లువెత్తే పోరాటాలే నేటి ప్రభుత్వ లొసుగులను ఆధారాలతో ‘ఓ కలం’ ఏంచక్కా బయటపడుతోంది. బెయిలబుల్‌ కేసు(అదీ తప్పుడిదే)లో అరడజను రోజుల జైలు జీవితం రంగనాథ్‌ ను త్వరలో వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఆ కేసులో న్యాయం జరగకుంటే ‘సుప్రీం’ వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై అందిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా..? అంటే లేదని తెలిసింది. రక్షించాల్సినంత వరకు రక్షించండి. జరగాల్సిన పోరాటం అంతకంతకూ నిశ్శబ్దంగా ఉదృతం అవుతోంది. కాలం ‘కలం’ రూపంలో కాటేస్తుంది ఇక నుంచి ఈ కేసుల విషయాలపై వేగంగా ముందుకు వెళ్ళాలని ఢిల్లీ పెద్దలు బాధితులకు సూచించినట్లు తెలిసింది. ఏ ముసుగులో ఉన్నా అన్ని కుట్రలు బయట పడాల్సిందే. ప్రజలకు తెలియాల్సిందే..!

‘దిశ’ పోరాటాలకు నాంది..: ‘దిశ’ కులం గురించి మాట్లాడే వారు… ఇతరులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తుకు తెస్తున్నారు. ఆ సందర్భంలో చాలామంది ఓ ‘లాజిక్‌’ మిస్‌ అవుతున్నారు. ‘దిశ’ సంఘటనపై కుల, మతాలకు అతీతంగా ఇంటా, బయట.. పార్లమెంట్‌ నుంచి స్థానికంగా అందరూ స్పందించారు. అలాగే రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలపై ముందు మౌనపోరాటాలు రోజుకు ఓ గంట చేయండి. నిరసనలు వ్యక్తం చేయండి. అంచెలంచెలుగా పోరాట ఉదృతి పెంచండి. ఫలితాలు అవే వస్తాయి. రావాల్సిన అవసరం ఉంది. బాధితులందరికీ న్యాయం జరగాల్సిందే. నేరస్థులకు ఎలాంటి రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే బాధితుల తరఫున ఎవరు పోరాడుతున్నా వారందరికీ అండగా అందరూ నిలవాలి. ‘ఈరోజు మనకు ఎందుకులే’ అని మౌనంగా ఉంటే.. అలాంటి సంఘటన కాదు సంఘటనలు మరి కొందరకు జరుగుతాయి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close