విజృంభిస్తున్న పెట్రోల్‌ మాఫియా

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అభం శుభం తెలియని వాళ్ళు కూడా రోడ్డుపైన వెళ్తూ ఒక్కసారిగా పేలుడు శబ్దం, మంటలు వ్యాపించడంతో కళ్ళముందే కాలి బూడిద అయిపో యారు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం మేడిపల్లి లోని పెట్రోల్‌ మాఫియా అక్రమంగా పెట్రోల్‌ ట్యాంకర్‌ నుండి పెట్రోల్‌ ను దొంగిలిస్తున్న సమయంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం. అప్పుడు పోలీసు శాఖ ఆగమేఘాల మీద కొంతమంది అధికారులపై కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేసింది. ఈ మాఫియా అక్రమాలకు నిర్ధాక్షణ్యంగా ప్రజల ప్రాణాలు గాలిలో దీపంల మారిన పూర్తిస్థాయి చర్యలు తీసుకోలేక పోలీసు ఉన్నతాధికారులు సైతం వదిలేసారు.

మళ్లీ పుంజుకున్న పెట్రోల్‌ మాఫియా… రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని నాచారం, మేడి పల్లి, కీసర పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో పెట్రోల్‌ మాఫియా మళ్లీ తన పంజా విసురుతోంది. నెల నెల మామూళ్లతో పోలీసు బాసులు సర్దు కోవడంతో పెట్రోల్‌ మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా దర్జాగా కొనసాగుతోంది. చెర్లపల్లి పెట్రోల్‌ స్టేషన్‌ నుండి ట్యాంకర్‌ ద్వారా తెస్తున్న పెట్రోల్‌, డిజిల్‌ను మార్గమధ్యంలో షెడ్‌లోకి తీసుకు వెళ్లి గ్యాస్‌ కటింగ్‌ సహాయంతో తాళాలు తొలగించి పెట్రోల్‌, డిజిల్‌ ను దొంగిలించి అనుమానం రాకుండా తిరిగి వెల్డింగ్‌ చేసి యధా తధంగా రంగులు వేసి తిరిగి పంపించి వేస్తారు. గ్యాస్‌ కటింగ్‌తో తాళాలు తొలగించే సమ యంలో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. పెట్రోల్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని ప్రమాదాలు జరుగుతాయి.

బాధ్యతారాహిత్యంలో రాచకొండ పోలీసలు… పెట్రోల్‌ మాఫియా ఆగడాలపై పోలీసు శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతే హడావుడి చేయడం తప్ప ముందస్తు కఠిన చర్యలు తీసుకొని పెట్రోల్‌ మాఫియాపై ఉక్కుపాదం మోప కపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు నెల నెల మామూళ్లతో సర్దుకుపోతూ ఉంటే… ఎస్‌ఓటి పోలీసులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. అన్ని విభాగాల అధికారులకు మామూలు అందడం వల్లనే ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్‌ మాఫియాను పోలీసులే పెంచి పోషిస్తున్నారు అన్నది బహిరంగ రహస్యంగా వినిపిస్తోంది. కిందిస్థాయి అధికారులు మామూళ్లతో సర్దుకు పోతున్న ఉన్నత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు మౌనం పై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారుల ఏసీ గదుల కే పరిమితమై క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడం వలన రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో నాచారం, మేడిపల్లి, కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధులలో పెట్రోల్‌ మాఫియా రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికైనా డిజిపి స్పందిస్తే తప్ప పెట్రోల్‌ మాఫియాపై కిందిస్థాయి అధికారులు, ఎస్‌ ఓ టి పోలీసులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పెట్రోల్‌ మాఫియాపై ఉక్కు పాదం మోపు తారొ… లేక సదా మామూలే అని వదిలేస్తారొ వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here