ఉగ్రవాద చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది

0

రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కొలంబోలో వరుస బాంబు దాడుల కారణంగా దాదాపు 200 మందికి పైగా మరణించడం వందలాది మంది గాయపడటం పట్ల ఉగ్రవాదుల చర్యను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఉగ్రవాదానికి కులం మతం ఉండదనేది బిజెపి మొదటి నుంచి చెపుతూనే వస్తుంది. ఈస్టర్‌ డే సందర్భంగా ప్రార్థనలు చేసుకునే వారి పైన దుండగులు బాంబులతో వారి మరణానికి కారణం కావడం తీవ్రమైన చర్య అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ తీవ్రవాదం, ఉగ్రవాదం పట్ల కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే దేశంలో ఉగ్రవాద సంఘటనలను అరికట్టారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో తుదముట్టించాల్సిందే. దేశంలో ఏ ఉగ్రవాద సంఘటన జరిగినా హైదరాబాదుకు సంబంధం ఉండేది. ఎన్‌ఐఏ నిన్న హైదరాబాదులో ఐసిస్‌ కు చెందిన ఒక అనుమానిత వ్యక్తిని అరెస్ట్‌ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ ఉగ్రవాద సంఘటనలు జరగకుండా ముందస్తు గా వారిని అరెస్ట్‌ చేయడం ద్వారా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉగ్రవాదం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని బిజెపి డిమాండ్‌ చేస్తున్నదని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని,మరణించిన వారి కుటుంబ సభ్యులకు బిజెపి రాష్ట్ర శాఖ తరపున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతి తెలియజేస్తూ మరణించిన వారి ఆత్మలకు శాంతిని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here