కల్వకుంట్ల రాజ్యంలో దళితులకు ద్రోహం

0

★ ఆవేదన ఎందరో..
★ ఎన్నో అకృత్యాలు
★ వారు ఓటు బ్యాంకు కోసమే
★ తనయుడి తలపై నేరెళ్ళ నిప్పు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)

భారత రాజ్యాంగం నిర్మాతలు ఊహించని సంఘటనలు రాజ్యమేలుతున్నాయి. దళితులకు దక్కాల్సిన వాటాల విషయంలో ఎన్ని రిజర్వేషన్లు కల్పించినా… వారి జీవితాలు…65 ఏళ్ళు గడిచిన మారలేదు.. సరికదా… మరింత దయనీయంగా మారాయి. తూటాలకు బలయ్యేది.. దారుణాలకు దారుణంగా ముక్కలయ్యేది వారి శరీరబాగాలే… వారి గొంతులకు అందరూ చూస్తుండగా వేసేది వజ్ర వైఢూర్య భరణం కాదు… వారి అరుపులు బయటకు రాకుండా బిగించే బానిస సంకెళ్ళు. ‘ఎవడురా ఈ సంకెళ్ళు తెంచేది’ అని ఎవరైనా ఎలుగెత్తితే… రాజకీయ రాబందులు అర క్షణంలో ఆరగిస్తాయి. ఆ రాందులు దళిత రక్తానికి రుచి మరిగాయి. చుండూరు, కారంచేడు… మొదలుకొని.. నగ్జలబరీ,
అన్ని పార్టీల ఆందోళనలకు, తెలంగాణ తొలి, తుది ఉద్యమాలకు, చివరకు బంగారు తెలంగాణలో నేరెళ్ళ సంఘటనలతో దళితుల బతుకులే తెల్లారేది. ఈదేశంలో దళితులు బతికే హక్కు లేదా..? బతకడానికి వారికి అర్హత లేదా..? వారి బతుకులకే కాదు… కనీసం దళితుల శవాలకు సైతం ‘ఖర్మభూమి’ కరవైన ఘనమైన ఘన చరిత్ర కలిగిన తెలంగాణాలో దళితులపై జరిగిన అమానుష అకృత్యాలు.. అక్షరాల 7,131 సంఘటనలు. ఈ సంఖ్య గురించి మాట్లాడితే కృష్ణజన్మస్థానంలో సమాధుల జీవితం రుచి చూపించింది గులాబీ ప్రభుత్వం. సాక్షాత్తూ కల్వకుంట్ల కుటుంబ వారసుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే ఆత్మహుతి సిద్దపడే సంఘటన శుక్రవారం జరగటం పరిస్థితి తీవ్రతకు నిలువెత్తు నిదర్శనం. భవిష్యత్త్ తరాలకైనా కనీసం ఈ తెలంగాణ గడ్డపై ఊపిరి పీల్చుకునే చిన్న చిరు అవకాశం ఆత్మగౌరవంతో కల్పించాలనే దృక్పథంతో.. పక్కా లెక్కలతో.. ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న పరిశీలన కథనం.

ప్రస్తుతం:

ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక కులాల కుంపటి స్పష్టంగా మొదలయింది. కులాల వారీగా భవనాలు, స్థలాలు, వందల కోట్ల నిధులు ఇస్తామని ముందస్తు ముందు గులాబీ నేత చక్కగా చెప్పారు. ముఖ్యంగా దళితులు అంటే చిన్న చూపు చూడడం మొదలు పెట్టారు మన పాలకులు. తెలంగాణకు ‘మొదటి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తా’ అని మాట తప్పడం.. ముచ్చటగా మూడెకరాల భూమి.. హుళుక్కు మనిపించారు. దళిత రైతులకు బేడీలు… ఇలా చెప్పుకుంటే పోతే… కల్వకుంట్ల రాజ్యంలో ఎన్నో దురాగతాలు.. ఎన్నో అకృత్యాలు…ఎన్నో దళిత హత్యలు.

ఇవ్వన్నీ చూశాక దళితులలో నిశ్శబ్ద విప్లవం మొదలయింది. ఈ పరిస్థితుల్లో ‘దళిత ఓటు వైపు ఉంటుంది’ అనేది పరిశీలకులు కూడా అంచనా వేయలేక పోతున్నారు.

‘బంగారు’ దారుణ మారణకాండలు:

తెలంగాణ లో 2014 నుండి 2017 వరకు దళితుల మీద జరిగిన సంఘటనలు ముందుగా హత్యల గురించి…
2014లో 39, 2015లో 29, 2016లో 42, 2017లో 44 కాగా మొత్తం 154 మంది దళితులు దారుణంగా చంపబడ్డారు. ఇందులో కొన్ని కేసులలో అస్సలు విచారణలే లేవు.

అత్యాచారాలు..:
మహిళలకు రక్షణ లేదని దేశం ఘోశిస్తోంది. అదీ దళిత మహిళ అంటే.. 716 మంది ఈ దురాగతాలకు బలైయ్యారు. 2014లో 133, 2015లో 163, 2016లో 206, 2017లో 214… మొత్తం కలిపి 716.

గాయపరచిన సంఘటనలు: 2014లో 180, 2015లో 172, 2016లో 216, 2017లో 216 కాగా మొత్తం: 784 సంఘటనలు.

ఇతర కేసులు:
2014లో 680, 2015లో 784, 2016లో 958, 2017లో 963 కాగా
మొత్తం 3,385 కేసులు నమోదయ్యాయి.

గృహ దహనాలు: 2014లో 1, 2015లో 1, 2016లో 2, 2017లో 2
మొత్తం 6.

పిసియార్ చట్టం:
2014లో 2, 2015లో 0,
2016లో 0, 2017లో 1,
మొత్తం 3.

అత్యాచార నిరోధక చట్ట కేసులు:
2014లో 562, 2015లో 530, 2016లో 480, 2017లో 511కాగా
మొత్తం 2,083 కేసులు.
అన్ని ఘటనలు కలిపి మొత్తం 7131.

1st BOX….
కేటీఆర్ బహిరంగ సభలో ఆత్మహుతి సంఘటన:
ప్రస్థుతానికి యువరాజు, కాలం కలిసి వస్తే కాబోయే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన మంత్రి కేటీఆర్‌ బహిరంగ సభలో నేరేళ్ల బాధితులు ఆత్మహుతి యత్నం కలకలం రేపింది. రెండేళ్ల క్రితం జరిగిన నేరేళ్ల ఘటన బాధితులకు మంత్రి ఇప్పటి వరకూ ఎలాంటి న్యాయం చేయకపోగా.. తమపై పోలీసులతో థర్ఢ్ డిగ్రీ ప్రయోగించారని నినదిస్తూ బాధితులు బర్తు బానయ్య, కోల హరీశ్‌ ఆత్మహత్యకు యత్నించారు. తమతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకోబోయారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని తంగళ్లపల్లికి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

గ్రూపు అధికారులకూ అవమానాలే..:
ఐఏఎస్ అధికారులకు ఎదురవుతున్న సంఘటనలపై వారు బహిరంగంగానే చెపుతున్నారు. ఇతరులకు రిటైర్మెంట్ తరువాత ఇచ్చే పదవులలో దళితులనే కారణంగానే ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

(ఈ కథనం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు అంకితం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here