అవినీతి కళ చంద్రకళ

0

అనంచిన్ని వెంకటేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌

నిజాయితీ ముసుగులో పక్కా అవినీతి. ఈ జనరేషన్‌ లో జరుగుతున్న దారుణాలలో బయటకు వచ్చిఃది ఒకటే… రావల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇదే నిఖార్సయిన చంద్రకళను భుజానికెత్తుకున్న విూడియా యథావిధిగా మౌనవ్రతం. ఈ ‘కళ’ రాజకీయులను అండగా చూసుకొని రెచ్చిపోయింది. పైకి మాత్రం మేలి ముసుగు. జస్ట్‌ ఇప్పుడు తొలిగింది. నిజాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి.

ఎఫ్‌ఐఆర్‌లో..: అఖిలేష్‌ యాదవ్‌ అండదండలతో రాజకీయనాయకులు ఎస్పీ పార్టీకి చెందిన రమేష్‌ మిశ్రా, బిఎస్పీకి చెందిన సత్య యాదవ్‌ దీక్షిత్‌ లకు చెందిన ఆస్తులపై ఏకకాలంలో దాడులు జరిగాయి. అలహాబాద్‌ హైకోర్టుకు 2015లో 65 ఇసుక రీచ్‌ లలోఅక్రమాలకు తెర తీయగా.. 32 ప్రాంతాల్లో రాజకీయ ప్రాబల్యం ఉన్న చోట్ల కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఫిర్యాదు అందింది. ఈ విషయంలో కథనాలు రాసిన ఓ పరిశోధన జర్నలిస్ట్‌ జైలు జీవితం గడిపారు. ఆయన చేసిన పోరాటం ఎట్టకేలకు ఓ ఐఏఎస్‌ ను పట్టించింది

చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు

ఐఏఎస్‌ అధికారి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. మైనింగ్‌

స్కాం, ఇసుక మాఫియాతో చేతులు కలిపిందని, అవకతవకలకు పాల్పడిందని సీబీఐ కేసు నమోదు చేసింది. ఏకకాలంలో 12 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. చంద్రకళ స్వస్థలం కరీంనగర్‌ జిల్లా. ఉత్తరప్రదేశ్‌ లో లక్నో, కాన్పూర్‌, హారియపూర్‌, ఢిల్లీ, నోయిడా, తెలంగాణలోని హైదరాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో సీబీఐ సోదాలు నిర్వహించింది.

కేంద్రం కళ్ళు కట్టింది..:

బులంద్‌ షహర్‌, బిజ్నోర్‌, విూరట్‌ జిల్లాల కలెక్టర్‌ గా ఆమె స్వచ్ఛభారత్‌ కోసం ఎంతగానో కృషి చేసి పేరు తెచ్చుకున్నారు. అవినీతిపై నిప్పులు చెరిగే అధికారిగా సామాజిక మాధ్యమాల్లో చంద్రకళ పేరు మారుమోగింది. బిజ్నోర్‌ ను బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాగా మార్చేందుకు ఆమె చేపట్టిన చర్యలు కేంద్ర సర్కారు ప్రశంసలు పొందాయి. ఇప్పుడామె నిజాయితీకి, కృషికి గుర్తింపుగా ప్రధాని నరేంద్రమోదీ ఆమెను తన డ్రీమ్‌ టీంలో చేర్చుకున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ డైరెక్టర్‌ గా, కేంద్ర తాగునీరు, పారిశుధ్ధ్య మంత్రిత్వశాఖ ఉపకార్యదర్శిగా నియమించారు. దీంతో ప్రస్తుతం విూరట్‌ కలెక్టర్‌ గా ఉన్న చంద్రకళ కార్యరంగం ఢిల్లీకి మారింది. బులంద్‌ షహర్‌ జిల్లా కలెక్టర్గా ఆమె చూపిన ధైర్యసాహాసాలు అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అంశాలను పరిగణలోకి తీసుకోని ఆమెను స్వఛ్చ భారత్‌ మిషన్‌ కు డైరెక్టర్‌ గా నియమించింది. ఈమె అసలు అవతారం తెల్సిన కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.

అందం-అలంకరణకు.. యోగా:

చంద్రకళ సహజంగా అందంగా ఉంటారు. మంచి ఫొటోజెనిక్‌ ఫేస్‌. మంచి స్నేహశీలి. అందరితో ఇట్టే కలుపుకుని పోయే మనస్తత్వం. ఇతరులు అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకుంటే ఒప్పుకోరు. కానీ సెల్ఫీలు తీసుకోవడం హాబీ. ఆరోగ్యం కోసం రోజూ కనీసం అరగంట యోగా చేస్తారు. వేపుడు కూరలంటే ఇష్టపడతారు. విహారయాత్రలంటే చాలా ఇష్టం. పండుగల సందర్భంలో.. ముఖ్యంగా దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో సంప్రదాయ రీతిలో చేస్తారు. వ్యవసాయ క్షేత్రాలు, విల్లాలు, నగలు, అలంకరణ లంటే ఇష్టం.

ఇదరు టాపర్లు..ఇలా..:

తెలుగు రాష్ట్రాల నుంచి ఐఏఎస్‌ అధికారులు లక్ష్మీ, చంద్రకళలు ఇద్దరూ రాజకీయుల చేతిలో కీలుబొమ్మలుగా మారి సిబిఐ కేసులు ఎదుర్కోవడం కాకతాళీయం. భవిష్యత్తు తరాలకు అవాంఛనీయం

2015 నుంచి.. తవ్వి..:

65 ఇసుక రీచ్‌ల విషయంలో చంద్రకళ దగ్గరుండి పర్యవేక్షించిన కీలక సాక్ష్యాలను సిబిఐ అత్యంత రహస్యంగా సేకరించింది. ఐఏఎస్‌ కదా… కవర్‌ చేయవచ్చనే ధీమాతో చివరి వరకు ఉంది. ఒకసారి సిబిఐ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో రుచి చూపించింది. సిబిఐ చంద్రకళ కళ్ళు ఏ రంగులో ఉంటాయో కూడా చెప్పే డాక్యుమెంట్‌ ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ సంపాదించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here