Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

నన్ను గవర్నర్‌గా నియమించడం.. తెలంగాణకు దక్కిన గౌరవం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నన్ను హిమాచల్‌ ప్రదేశ్‌ గౌవర్నర్‌గా నియమించడం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన గౌరవమని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రయేయ అన్నారు. గవర్నర్‌గా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం దత్తాత్రేయ మొదటిసారిగా తెలంగాణకు విచ్చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తనను గవర్నర్‌గా నియమించడమనేది పుణ్యఫలంగా భావిస్తున్నట్లు తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా యాదాద్రి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, నన్ను గవర్నర్‌గా నియమించడమనేది తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. యాదాద్రి ఆలయం దేశంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా విరసిల్లాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అనేది ఎన్నో శక్తిపీఠాలున్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమని, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలను లింక్‌ చేసి టూరిజం అభివృద్దికి తోడ్పడతానన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అనేది గొప్ప దేవభూమి అని, వీరభూమి అన్నారు. తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ అనేది రెండూ గొప్ప పోరాటాల గడ్డలని తెలిపారు. సమాజంలో నైతికత పెరగాలని, ప్రజలు ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని దత్తాత్రేయ చెప్పుకొచ్చారు. తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ.. చట్టబద్దంగా తన పదవికి న్యాయం చేస్తానని గవర్నర్‌ పేర్కొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close