ఈ నెలాఖరులో ఎంపీ అభ్యర్థుల ప్రకటన

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ఓటమికి అభ్యర్ధుల ఎంపిక, పొత్తుల విషయంలో అదిష్టానం,టిపిసిసి చివరివరకు సాగదీయడమే కారణమని కొందరు నాయకులు బహిరంగంగానే విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ తప్పులు పునరావృతం కాకుండా చూడాలని వారు అదిష్టానికి సూచించారు. అయితే ఈ విషయంపై కాంగ్రెస్‌ పెద్దలు కూడా దృష్టిపెట్టినట్లున్నారు. దీంతో తెలంగాణ నుండి లోక్‌సభకు పోటీచేసే అభ్యర్ధులను ఈ నెలలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దృవీకరించారు. ఇవాళ గాంధీభవన్‌లో భట్టి విక్రమార్క విూడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల నుండి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీచేయాలని భావిస్తున్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకుల నుండి భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయని… వీటిని అదిష్టానం నియమించే కమిటీ పరిశీలించనుందన్నారు. ఆ నెలలోనే ఈ ప్రక్రియ ముగిసి నెలాఖరు వరకు అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందని భట్టి వివరించారు. లోక్‌సభ ఎన్నికల పొత్తులపై త్వరలో రాష్ట్ర నాయకులమంతా చర్చించి తమ నిర్ణయాన్ని అదిష్టానికి తెలియజేస్తామన్నారు. దాని ఆదారంగా పొత్తులపై నిర్ణయం ఉంటుందని… తుది నిర్ణయం మాత్రం అదిష్టానందేనని భట్టి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను లోక్‌ సభ ఎన్నికల్లో జరక్కుండా చూసుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతులకు అండగా పోరాడతాం… వ్యవసాయ రంగాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కావస్తున్న ఇప్పటి రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టిసారించలేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. నిజామాబాద్‌ జిల్లాలో విరివిగా పసుపును, ఎర్రజొన్నను పండించే రైతులు ఆందోళన చెందుతున్నారని భట్టి అన్నారు. ఎర్రజొన్న, పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. ఎర్రజొన్నలను కొనుగోలు చేశామన్న ప్రభుత్వం మాటలు అబద్దాలేనని భట్టి మండిపడ్డారు. రైతులు తమ సమస్యలు చెప్పుకోవటానికి ఎన్నికలు పూర్తై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారిని నియమించలేదని అన్నారు. మరోవైపు ఆయన అందుబాటులో ఉండటం లేదని దీంతో రైతులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక మదనపుడుతున్నారని అన్నారు. 2017-08 కాంగ్రెస్‌ హయాంలో క్వింటాల్‌ పసుపుకు రూ.14వేలు చెల్లించామని అన్నారు. ప్రస్తుతం రూ.4వేల నుంచి రూ.5వేలకు పడిపోయిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రజొన్నలను రూ.3వేలు మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భట్టి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తీరుతో దళారులు ఎర్రజొన్న రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు పెట్టిస్తామన్న ఎంపీ కవిత మాటలు ఏమయ్యాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇప్పుడు రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసేవారే లేరని, క్వింటా పసుపును రూ.10వేలకు కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం తీరుతోనే వ్యవసాయ రంగం దిగజారిపోతోందని భట్టి విమర్శించారు. రైతులకు ఎక్కడ అవసరం వచ్చినా అక్కడ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం వెళ్తుందని భట్టి పేర్కొన్నారు. ఎంపీ స్థానాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయని భట్టి తెలిపారు. ఈనెలాఖరులో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అన్నారు. ఈనెలాఖరులోగా పొత్తులపైకూడా స్పష్టం వస్తుందని భట్టి స్పష్టం చేశారు. నేతలంతా చర్చచేసి.. పొత్తులపై నిర్ణయాన్ని అధిష్టానానికి పంపుతామని అన్నారు. అధిష్టానం తుది నిర్ణయం ప్రకటిస్తుందని భట్టి తెలిపారు.

ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదు – వీహెచ్‌

ప్రధాని మోదీకి తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన కనిపించడం లేదా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హావిూలను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు. గాంధీభవన్‌లో వీహెచ్‌ విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణకు ఇచ్చిన విభజన హావిూల పరిష్కారంతో పాటు ఏపీకి ప్రత్యేక¬దా సాధ్యమవుతాయని చెప్పారు. మంత్రివర్గం లేకుండా సీఎం కేసీఆర్‌ కొత్త సంప్రదాయానికి తెరతీశారని అన్నారు.  రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని వీహెచ్‌ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here