Featuredస్టేట్ న్యూస్

పోలీసులపై నిందితులు దాడికిదిగారు

  • ఆయుధాలను లాక్కొని ఫైరింగ్‌కు యత్నించారు
  • పలుమార్లు హెచ్చరించినా వెనక్కుతగ్గలేదు
  • ఆత్మరక్షణ కోసం నిందితులపై ఫైరింగ్‌ చేశాం
  • ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి
  • విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌

‘దిశ’ను హతమార్చిన ప్రాంతంలో నిందితులతో కేసు రీకన్‌స్టక్ష్రన్‌ చేస్తున్న సమయంలో నిందితులు పోలీసులపై దాడికి దిగారని, రెండు ఆయుధాలను లాక్కొని ఫైరింగ్‌ చేశారని, పోలీసులు హెచ్చరించినా వెనక్కు తగ్గకపోవటంతో ఫైరింగ్‌ చేయాల్సి వచ్చిందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. గురువారం ఎన్‌కౌంటర్‌ ఘనటకు సంబంధించిన వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. నవంబర్‌ 27న రాత్రి దిశను అపహరించి అత్యాచారం చేసి హత్య చేశారని సీపీ తెలిపారు. నవంబర్‌ 28న తెల్లవారుజామున షాద్‌నగర్‌ చటాన్‌పల్లి వద్ద దిశను కాల్చేశారని, షాద్‌నగర్‌ డీసీపీ ఆధ్వర్యంలో విచారణ జరిగిందన్నారు. ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, నారాయణపేట జిల్లా మక్తల్‌ మండల వాసులను నిందితులుగా గుర్తించి నవంబర్‌ 30న మెజిస్టేట్ర్‌ వద్ద హాజరుపర్చామని అన్నారు. 30న సాయంత్రం చర్లపల్లి జైలుకు తరలించామని అన్నారు. ఆ తర్వాత పోలీసు కస్టడీకి తీసుకున్నామని సీపీ తెలిపారు. 3వ తేదీన 10 రోజుల కస్టడీకి అనుమతించారని, 4వ తేదీన పోలీసు కస్టడీకి తీసుకున్నామని, 4, 5వ తేదీల్లో నిందితులను విచారించామని సీపీ వివరించారు. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల కస్టడీలో నిందితులు చాలా విషయాలు వెల్లడించారు. బాధితురాలి వాచ్‌, సెల్‌ఫోన్‌ గురించి చెప్పడంతో శుక్రవారం తెల్లవారుజామున నిందితులను చటాన్‌పల్లికి తీసుకువచ్చామని అన్నారు. సెల్‌ఫోన్‌ అక్కడ, ఇక్కడ పెట్టామని చెప్పడం జరిగిందని, ఆ సమయంలోనే పోలీసులపై కర్రలు, రాళ్లతో నిందితులు దాడికి దిగారని సీపీ తెలిపారు. పోలీసుల వద్ద ఉన్న రెండు ఆయుధాలను నిందితులు లాక్కొని ఫైరింగ్‌కు యత్నించారని, పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితులు వినలేదని అన్నారు. పలుమార్లు హెచ్చరించిన తర్వాతే ఆత్మరక్షణ కోసం నిందితులపై పోలీసులు ఫైరింగ్‌ చేసినట్లు సీపీ తెలిపారు. వీళ్లు కరుడుగట్టిన నేరస్తులని ఏ1 ఆరిఫ్‌ పాషా, ఏ4 చెన్నకేశవులు వద్ద రెండు ఆయుధాలను రికవరీ చేశామని తెలిపారు. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌ గౌడ్‌ కు గాయాలయ్యాయని తెలిపారు. వీరిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించామన్నారు. నిందితుల దాడిలో పోలీసుల తలకు గాయాలయ్యాయని సీపీ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో నిందితులు దాడులు చేశారని సీపీ సజ్జనార్‌ మీడియాకు వివరించారు. కేసుకు సంబంధించి పలువురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి సున్నితమైన కేసులో తప్పుడు ప్రచారంతగదని సీపీ అన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close